ఎస్బిఐ ప్లాటినమ్ కార్డులపై అద్భుత క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్న IRCTC.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్లాటినమ్ కార్డ్ను ఉపయోగించి రైలు టికెట్ బుకింగ్ల పై క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తుంది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్లాటినమ్ కార్డ్ను ఉపయోగించి రైలు టికెట్ బుకింగ్ల పై క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తుంది. IRCTC ఎస్బిఐ ప్లాటినం కార్డు, ఎస్బీఐ రైల్వే కార్డుగా కూడా పిలవబడుతుంది, ఇది కూడా ఒక రకమైన క్రెడిట్ కార్డు వంటిది, ఇది వినియోగదారులకు ఉచిత రైల్వే టిక్కెట్లను మరియు ఇతర ప్రయోజనాలను కలిగిస్తుంది అని IRCTC తన వెబ్సైట్ -irctc.co.in లో తెలిపింది.IRCTC ఎస్బిఐ ప్లాటినం కార్డు 350 బహుమతి పాయింట్లు, 1.8 శాతం లావాదేవీల వ్యత్యాసాన్ని, ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణను మరియు అలాగే రైల్వే బుకింగ్లపై 10 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది.

- IRCTC ఎస్బిఐ ప్లాటినమ్ కార్డును ఉపయోగించి IRCTC అధికారిక వెబ్ సైట్లో టికెట్ల కొనుగోళ్లకు రిసీవ్ పాయింట్లుగా AC1, AC11, AC CC బుకింగ్లకు 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
- ఎస్బిఐ రైల్వే కార్డుపై ప్రతి రూ. 125 రూపాయల కొనుగోలుపై 1 రివార్డ్ పాయింట్ అందిస్తుంది రైల్వే టికెట్ కొనుగోళ్లు సహా ఇతర రిటైల్ కొనుగోళ్ళలో (ఇంధనం కానివి) ఇది వరహిస్తుందని irctc.co.in తెలిపింది.
- IRCTC వెబ్సైట్లో తెలిపిన ప్రకారం IRCTC ఎస్బీఐ ప్లాటినం కార్డు ఉపయోగించి తమ రైల్వే టిక్కెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రతిసారీ 1.8 శాతం లావాదేవీల ఛార్జీలు (జిఎస్టి మరియు ఇతర అన్ని ఛార్జీలు మాత్రమే)ఆదా చేయవచ్చు.
- ఖాతాదారుడికి 350 బోనస్ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. IRCTC ఎస్బీఐ ప్లాటినం కార్డు జారీ చేసిన 45 రోజుల్లో రూ.500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్ళకు వర్తిస్తుంది.
- IRCTC ఎస్బిఐ ప్లాటినమ్ కార్డు కూడా రైలు ప్రమాదానికి గురైన జీవన నష్టానికి రూ.10 లక్షల వరకు ప్రయాణ టిక్కెట్టు పై భీమా అందిస్తుంది.
- IRCTC ఎస్బిఐ ప్లాటినం కార్డును తరచూ ఉపయోగించడం వల్ల ఉచిత రైలు టిక్కెట్ బుక్ చేసుకోవడానికి వినియోగదారుడు అవకాశం పొందవచ్చు.
- వినియోగదారుడు ఈ కార్డును కొన్ని ఎంపిక చేసిన ఇంధన పంపుల్లో ఇంధన మరియు ఇతర లూబ్రికెన్ట్స్ కొనడానికి రూ. 400 నుండి రూ. 2000 వరకు,ప్రతిసారీ చేసిన లావాదేవీలు ఉచితంగా చేయవచ్చు.
- IRCTC ఎస్బిఐ ప్లాటినం కార్డు కోసం దరఖాస్తు చేసుకోవటానికి, వినియోగదారులకు 56767 కు SMS RAIL అని చెయ్యవచ్చు.
- ఎస్బిఐ కార్డు యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా ఎస్బిఐ రైల్వే కార్డుకు ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications