ఎన్నికల ముందు మోడీ మరో బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు. నల్లధనాన్ని అడ్డుకునేందుకు ఆర్డినెన్స్ రూపంలో మరో కొత్త గేమ్ ప్లాన్ మొదలుపెట్టారు. అన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్‌ను అర్జెంటుగా ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చింది కేంద్రం. వాస్తవానికి నాలుగైదు రోజుల క్రితమే ఇది వెలువడినా దీని ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే ఒంటబట్టించుకుంటున్నారు జనాలు. ఎవరికీ తెలియకుండానే ఇందులో చాలా లొసుగులు అనేక రంగాలకు దిమ్మతిరిగేలా చేయబోతున్నాయి.

మనపై ఎఫెక్ట్ ఉంటుందా
మీరు ఏదైనా అత్యవసరమై మీ స్నేహితుడి దగ్గర చేబదులు తీసుకోవడానికి ఇక వీలుండదు. వ్యాపారంలో ఒడిదుడుకులు వచ్చి తన వ్యక్తిగత అవసరాల కోసం ఓ వ్యాపారి ఇతరుల దగ్గర అప్పు తీసుకోవడం ఇక కుదరదు. అలానే ఓ ఛారిటీ దగ్గర విద్యార్థులు తమకు అవసరమైన రుణాన్ని పొందడం కూడా ఇక కష్టం. అంతే కాదు చిట్ ఫండ్ సంస్థలు, కో - ఆపరేటివ్ సొసైటీలు చాలా మంది నుంచి డబ్బులు సేకరించి వాటిని ఎన్నికల టైంలో పొలిటికల్ పార్టీలకు పరోక్షంగా సర్దడం కూడా ఇక కుదరబోదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ మనీ మార్గాలను ఈ అత్యవసర ఆర్డినెన్స్ మూసివేయబోతోంది.

ఏంటీ ఆర్డినెన్స్
గతవారం కేంద్రం అన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ 2019 పేరుతో ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఇప్పుడు చట్టం చేసేందుకు అవకాశం లేకపోవడంతో ఈ ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. పోంజీ స్కీమ్స్, చైన్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కేటింగ్ ట్రిక్స్ నుంచి అమాయక ఇన్వెస్టర్లను కాపాడేందుకు కేంద్రం దీన్ని తీసుకువచ్చింది. అయితే డీటైల్స్ లోపలికి వెళ్తే ఇది డీమానిటైజేషన్ తరహాలో పెద్ద కుదుపే తీసుకురావచ్చొని అర్థమవుతోంది.
చట్టప్రకారం ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి మాత్రమే రుణాలు పొందాలి. ఫ్రెండ్స్ నుంచి రుణాలు పొందడం కరెక్ట్ కాదు. ఈ చట్టం ప్రకారం అడ్వాన్స్ పేమెంట్ కింద మాత్రమే ఆర్థిక సంఘం, రియల్ ఎస్టేట్ సంస్థలు కస్టమర్ల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకోవాలి. విద్య, వైద్యం వంటి అత్యవసర పరిస్థితుల్లో దగ్గరి కుటుంబ సభ్యుల నుంచి మాత్రమే తీసుకోవాలి. (దగ్గరి కుటుంబ సభ్యులు అంటే ఏదో ఒక దగ్గరి సంబంధం ఖచ్చితంగా ఉండాలి అనే ఆర్డినెన్స్‌లో స్పష్టంగా ఉంది. Only Immediate Family members అనే పదాన్ని వాడారు).

కో-ఆపరేటివ్ సొసైటీలకు చుక్కలు
మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీలు ఇకపై నాన్ ఓటింగ్ మెంబర్ల నుంచి డిపాజిట్లు ఇకపై స్వీకరించడానికి వీల్లేదు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న సొసైటీలు పెద్ద ఎత్తున జనాల నుంచి డబ్బులు సమీకరించి వాటిని కొన్ని కంపెనీలకు రుణాలుగా ఇచ్చి అక్రమంగా వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఇకపై ఓటింగ్ హక్కు ఉన్న సభ్యుల నుంచి మాత్రమే సదరు కో-ఆపరేటివ్ సొసైటీలు డిపాజిట్లను సేకరించాల్సి ఉంటుంది. సామాన్యుల నుంచి డబ్బులు సేకరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు.

తీసుకుంటే ఏమవుతుంది
కొత్త ఆర్డినెన్స్ నేపధ్యంలో పైన చెప్పిన విధానంలో కాకుండా ఏ మార్గంలో డిపాజిట్లు సేకరించినా అవన్నీ పూర్తిగా అక్రమమే. అలాంటి సంస్థల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో పాటు అవసరం అనుకుంటే అరెస్ట్ చేసే అధికారాన్ని కూడా ఆర్డినెన్స్ కట్టబెట్టింది.

సామాన్యుల కంటే
వాస్తవానికి ఇది ఆర్డినెన్స్. చిట్ ఫండ్ సంస్థలు, సొసైటీలు,రియల్ ఎస్టేట్ సంస్థలకు నిధులు బ్లాక్ చేసేందుకు కేంద్రం తెచ్చిన కొత్త అస్త్రం. సామాన్యులపై కూడా దీని ప్రభావం ఉంటుంది. దొరకనంత వరకూ అందరూ దొరలే. చట్టంలో అది తప్పు అని ఉన్నంత వరకూ అదే తప్పే. మీరూ.. మీ బంధువుల మధ్య ఒప్పందం - అండర్ స్టాండింగ్ ఉన్నంత వరకూ మనకే నష్టం లేదు. కానీ ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు చట్టం సాయం తీసుకోవడానికి మనం అవకాశం కోల్పోతాం. అదే మనం ఆలోచించాల్సిన అంశం.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications