క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్లు ట్రాప్‌లో పడొద్దు ! ఈ 7 పాయింట్స్ తెలిస్తేనే సేఫ్ గేమ్

హైదరాబాద్ : క్రెడిట్ కార్డ్ ఉండడం ఎంత ముఖ్యమో.. దాన్ని సక్రమంగా వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యం. క్రెడిట్ కార్డ్ చేతిలో ఉంటే.. మనకు నెలాఖరులో కొండంత అండ. అదే సరిగ్గా బిల్లులు చెల్లించకపోతే మాత్రం అదే నెత్తిన గుదిబండ. ఇది ప్రతీ ఒక్కరికీ అనుభవ పూర్వకంగా ఈ పాటికే తెలిసి ఉండొచ్చు. అయితే ఈ సింపుల్ 7 రూల్స్ తెలుసుకుంటే మాత్రం మీరు దీని బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.

రూల్ 1 ..పొరపాటున కూడా మీ కార్డ్ డీటైల్స్ ఎవరికీ చెప్పొద్దు
మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ సహా ఎవరికీ క్రెడిట్ కార్డ్ డీటైల్స్ పొరపాటున కూడా షేర్ చెయ్యొద్దు. ఇంకొంత మంది చిత్రవిచిత్రమైన ఫ్రాడ్‌కు గురవుతూ కూడా బాధపడిన సందర్భాలున్నాయి. అందుకే పిన్ సహా ఏ వివరాలనూ ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. మర్చంట్ ఔట్ లెట్స్, పెట్రోల్ పంప్స్ వంటి దగ్గర మీరు నెంబర్ చెప్పకుండా మీరే ఎంటర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీ కార్డ్ స్కిమ్మింగ్‌కు గురికావొచ్చు.

credit card holders becarefull .. use must know this 7 points

రూల్ 2 .. డెడ్‌లైన్ లోపు కట్టేయండి
డబ్బులు ఆన్ టైంలో చెల్లించని వాళ్లంటే క్రెడిట్ కార్డ్ సంస్థలకు బాగా ఇష్టం. ఎందుకంటే మీ లాంటి వాళ్లే వాళ్లకు కోట్లకు కోట్ల లాభాలు తెచ్చిపెడ్తారు. అదే సమయంలో మీరు పేమెంట్ టైమ్ మిస్ అయ్యారు అంటే వాళ్ల రాడార్‌లోకి వెళ్లిపోతారు. అందుకే డెడ్ లైన్ లోపే మీ అప్పులు తీర్చేయండి. అలా చేయకపోతే వడ్డీలపై వడ్డీలు, పెనాల్టీ భారాలను మోయాలి. దీనికి తోడు మీ క్రెడిట్ హిస్టరీ కూడా బ్యాడ్ అవుతుంది. మళ్లీ అప్పు పుట్టేందుకు మార్గాలు మెల్లిగా మూసుకుపోతూ ఉంటాయి.

రూల్ 3 ..మినిమం బ్యాలెన్స్ మాత్రమే కడ్తున్నారా
క్రెడిట్ కార్డ్ కంపెనీలు మిమ్మల్ని ఇక్కడే ఇరికించేస్తూ ఉంటాయి. మినిమం బ్యాలెన్స్ అయినా కట్టమంటూ మిమ్మల్ని టెంప్ట్ చేస్తాయి. రూ.10 వేల బకాయి ఉంటే.. అందులో రూ.500 అయినా కట్టమని ఆఫర్ ఇస్తాయి. ఒక వేళ మీరు ఆ ట్రాప్‌లో ఇరుక్కుంటే 24-48 శాతానికి తక్కువ లేకుండా వడ్డీని చెల్లించాలి. అంటే రూ.100కు 2-4 రూపాయల వరకూ మీరువడ్డీలు కట్టాలి. అప్పు కట్టకుండా మినిమం బ్యాలెన్స్ మాత్రమే కట్టారంటే.. మీరు పర్చేజ్ జరిపిన మొదటి రోజు నుంచి వడ్డీ కౌంట్ అవుతుంది. అందుకే ఈ మినిమం బ్యాలెన్స్ ట్రాప్‌లో మాత్రం పడొద్దు. తప్పదు అనుకుంటే ఈఎంఐ ఆప్షన్ కింద మీ అప్పును కన్వర్ట్ చేసుకోండి. దీని వల్ల వడ్డీ 15-18 శాతానికి తగ్గొచ్చు.

credit card holders becarefull .. use must know this 7 points

రూల్ 4 .. నగదు విత్ డ్రా చేయొద్దు
సాధ్యమైనంత వరకూ క్రెడిట్ కార్డ్ ద్వారా నగదును తీసుకోవద్దు. ఎందుకంటే ఇది అన్నింటికంటే కాస్ట్‌లీ ఆప్షన్. తీసుకున్న మొదటి రోజు నుంచే మీరు వడ్డీని చెల్లించాలి. అంతే కాదు 2 - 2.5 శాతం వరకూ ఒన్ టైం ఫీజ్ కూడా చెల్లించాల్సి ఉండొచ్చు. మీరు ఇక విదేశాల్లో గనుక డబ్బులు విత్ డ్రా చేస్తే ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఫీజ్‌తో పాటు అదనపు ట్రాన్సాక్షన్ ఫీజ్ కూడా కట్టాలి. అందుకే అత్యవసర సమయాల్లో చిన్న మొత్తాల్లో కాకుండా అవసరాన్ని బట్టి తప్పదు అనుకుంటే ఒకేసారి మీకు కావాల్సిన మొత్తాన్ని విత్ డ్రా చేసుకోండి.

రూల్ 5 .. మొత్తం క్రెడిట్ వాడొద్దు
మీకు ఉదాహరణకు రూ.లక్ష క్రెడిట్ లిమిట్ ఉంటే..దాన్ని మొత్తం హారతి కర్పూరం చేయొద్దు. మీకు ఉండే లిమిట్‌తో 60 శాతాన్ని మించి వాడకపోవడమే మంచిది. ఎందుకంటే అధిక క్రెడిట్ లిమిట్ వినియోగం మిమ్మల్ని ఇతర రుణ ఆప్షన్స్ నుంచి మెల్లిగా దూరం చేస్తుంది. అందుకే అవసరాన్ని బట్టి ఒక కార్డుకు బదులు రెండు, మూడు కార్డులు వినియోగించండి.

రూల్ 6 .. రివార్డ్స్ పాయింట్ కోసం కకృతి వద్దు
కొంత మంది కేవలం రివార్డ్ పాయింట్స్ కోసం మాత్రమే షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ట్రాప్‌లో పడేందుకు ఇది కూడా ఓ టెంప్టింగ్ ఆప్షన్. ఒక వేళ మీ దగ్గర పాయింట్స్ అక్యుములేట్ అయితే వాటిని ఏడాదికో, రెండేళ్లకో ఒకసారి వాడేయండి. వాడకుండా అలానే పెట్టుకోవడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేనేలేదు. ఒక వేళ మీ బిల్ పేమెంట్స్‌కు సదరు రివార్డ్స్ అడ్జస్ట్ చేసే ఆప్షన్ ఉంటే వెంటనే వాటిని వినియోగించుకోండి.

రూల్ 7 .. రెండు, మూడు కార్డ్స్ ఉంటే తప్పులేదు
మీ దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నా ప్రయోజనంలేదు. వాటిని మీరు సమర్ధవంతంగా వాడుకుంటేనే ప్రయోజనం. కొంత మంది ఏం చేస్తారంటే ఒక కార్డ్ చాలు కదా అని మిగిలిన వాటిని ఉన్నా ఉపయోగించరు. దీని వల్ల క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో పెరిగిపోతుంది. ఇది పరోక్షంగా మీ క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపిస్తుంది. అందుకే కార్డులను రివాల్వ్ చేయండి. ఒకసారి ఒక కార్డ్.. మరోసారి మరో కార్డ్ వాడండి. ఫ్రీ బిల్లింగ్ సైకిల్‌ను తెలివిగా ఉపయోగించుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+