లండన్ లో నాకు కార్లు ,బంగారం తప్ప ఎలాంటీ ఆస్తులు లేవు..ఉన్నవన్ని కూడ మా తల్లి ,పిల్లల పేరు మీదే ఉన్నాయంటున్నాడు విజయ్ మాల్య...సుమారు పదివేల కోట్ల అప్పు చేసి విదేశాల్లో ఉంటున్న విజయ మాల్య ఇండియన్ బ్యాంకులను ముప్పు తిప్పులు పెడుతున్నాడు..తన దగ్గర డబ్బులు లేవంటూ చేతులెత్తేస్తున్నాడు..తన పేరు మీద ఏలాంటీ అస్తులు లేవంటూ దర్జగా చెబుతున్నారు....

లండన్ హై కోర్టులో పిటిషన్ వేసిన 13 భ్యాంకుల కన్సార్టీయం
దీంతో మాల్య అప్పులను రాబట్టుకునేందుకు ఇండియన్ బ్యాంకులు నానా తంటాలు పడుతున్నాయి....లండన్ లో విజయ మాల్యాకు చెందిన ఆస్తుల వివరాలు తమకు ఇవ్వాలంటూ ఇండియాకు చెందిన 13 బ్యాంకుల కన్సార్టీయం లండన్ లో పిటిషన్ ధాఖాలు చేశాయి...
కాగా ఇంగ్లాండ్ లోని వేల్స్ లో మాల్యాకు చెందిన ఆస్తులను వేలం వేసుకోవచ్చని గత సంవత్సరమే యూకే హైకోర్టు అనుమతి ఇచ్చింది... అయితే ఆస్తుల యాజమాన్యానికి సంబంధించి సమస్యలు ఉన్నాయని అందుకే ఆస్తులను సీజ్ లేక పోతున్నామని బ్యాంకుల ఎన్ ఫోర్స్ మెంట్ చెబుతోంది..దీంతో విజయ మాల్య అప్పులను ఎలా రాబట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి..తమ పిటిషన్ లో విజయ మాల్య అస్తుల వివరాలను తమకు అందించాలని కోర్టును కోరాయి..

తల్లి , పిల్లల పేరుమీదే ఆస్తులు ..విజయ్ మాల్యా...
కాగా ఈ సంధర్భంలోనే విజయ్ మాల్య మాత్రం నాపేరు లండన్ ఎలాంటీ ఆస్తులు లేవని చెబుతున్నాడు...కేవలం కార్లు ,నగలు తప్ప తనవద్ద ఏమీ లేవని వాదిస్తున్నారు..ఈనేపథ్యంలోనే టీవిఎన్ ఎస్టేట్ తన వారసుల పేరిట ఉండడంతో పాటు టివిఎన్ ఎస్టెట్ తన తల్లి పేరు మీద ఉందని అంటున్నాడు..మొత్తం మీద తన పేరు మీద ఎలాంటీ అస్తులు లేవంటూనే మరో వైపు ఇండియన్ బ్యాంకుల చర్యలపై స్టే ను విధించాలని లండన్ హై కోర్టులో కేసు వేశారు...

విజయ్ మాల్య ఆస్తులు బినామి పేర్ల మీద ఉన్నాయి..బ్యాంకులు...
అయితే చాల లగ్జరీ రీచ్ లతో పాటు ఇతర ఆస్తులు బినామిల పేర్ల మీద ఉన్నాయని బ్యాంకుల కన్సార్టీయం చెబుతోంది.. అయితే విదేశాల్లో ఉన్న ఆస్తులను సైతం ఆక్కడి బ్యాంకుల్లో కుదువపెట్టి అప్పుులు తీసుకున్నాడని వాటి వివరాలు కూడ ఇవ్వాలని కన్సార్టీయం కోరింది....ఈ నేపథ్యంలోనే ఇండియన్ బ్యాంకులు కోరినట్టు గా విదేశి బ్యాంకులు సమాచారాన్ని ఇవ్వాలని లండన్ హై కోర్టు ఆదేశించింది...

ఆస్తులను సీజ్ చేయకుండా కోర్టులో పిటిషన్ వేసిన మాల్యా....
కాగా బ్యాంకులు లండన్ లో ఆస్తులను సీజ్ చేయకుండా స్టే విధించాలని మాల్యా కోర్టులో పిటిషన్ వేశాడు...ఇండియాలో తనపై దివాళకేసు నమోదయిందని దాన్ని ఇంకా విచారించలేదని మాల్యా తన పిటిషన్ ల పేర్కోన్నారు..కాగా మాల్యా కేసును ముందుగా విచారించిన తర్వాత ఇండియన్ బ్యాంకులు వేసిన పిటిషన్ తర్వాత విచారించనున్నట్టు కోర్టు తెలిపింది....


Click it and Unblock the Notifications