For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.1400 కోట్లకు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మకం !! హాంకాంగ్ సంస్థ చేతికి పగ్గాలు

By Chanakya
|

దేశంలోని టాప్ క్లాస్ ప్రైవేట్ స్కూల్స్‌లో ఒకటిగా పేరొందింది ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్. పీపుల్ కంబైన్ అనే సంస్థ పేరుతో ఇద్దరు తెలుగువాళ్లు ఏర్పాటు చేసిన ఈ స్కూల్‌కు తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ లభించింది. ఎస్‌బిలో చదివి టాప్ ఆంట్రప్రెన్యూర్స్‌గా ఎదిగిన ప్రసాద్ తుమ్మల, వైవి రాజశేఖర్ ఇద్దరూ కలిసి ఈ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. మొదట హైదరాబాద్‌లో ప్రారంభమైన ఓక్రిడ్జ్ ఇప్పుడు విశాఖపట్నం, బెంగళూరు, మొహాలీలో క్యాంపస్‌లు నిర్వహిస్తోంది.

హైదరాబాద్‌లో టాప్ స్టార్లు, బిగ్ షాట్స్ పిల్లల చదువుకు కేరాఫ్ అడ్రస్ అయిన ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ యాజమాన్యం మారినట్టు న్యూస్ అందుతోంది. హాంకాంగ్‌ కేంద్రంగా నడుస్తున్న విద్యా సంస్థ నోర్డ్ ఏంజిలా ఎడ్యుకేషన్ సంస్థ.. ఓక్రిడ్జ్‌ను రూ.1500-1600 కోట్లు పెట్టి కొన్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా స్పందించేందుకు రెండు సంస్థలూ నిరాకరించినప్పటికీ యాజమాన్య మార్పు జరిగిందనే విషయాన్ని మాత్రం ధృవీకరిస్తున్నాయి. నోర్డ్ ఏంజిలా ఫ్యామిలీ గ్రూప్‌నకు 30 దేశాల్లో 60 ప్రీమియర్ కె-12 స్కూల్స్ ఉన్నాయి. సుమారు 60 వేల మంది ఉన్నత స్థాయితో వ్యక్తిగత శిక్షణను అందిస్తోంది. బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా, కెనెడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ సంయుక్తంగా నోర్డ్ సంస్థను నిర్వహిస్తున్నాయి.

oakridge International School going to be sell

ఎడ్యుకేషన్‌ సెక్టార్‌లో టాప్ డీల్
హైదరాబాద్ ఎడ్యుకేషన్ రంగంలో ఇదో టాప్ డీల్ అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో అనేక వైద్య సంస్థలను విదేశీ సంస్థలు పోటీపడి మరీ కొన్నాయి. కానీ విద్యలో మాత్రం ఇంటర్నేషనల్ స్థాయి సంస్థలు కొన్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌కు రూ.1500-1600 కోట్ల వేల్యుయేషన్ రావడాన్ని చూసి హైదరాబాద్ బిజినెస్ కమ్యూనిటీ ఆశ్చర్యపోతోంది. రెండు దశాబ్దాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను అందిస్తూ.. టాప్ సర్కిల్స్‌లో మంచి పేరు సంపాదించిన ఓక్రిడ్జ్‌కు అదే స్థాయిలో బ్రాండ్‌ కూడా ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం ఐదు స్కూల్స్‌ ఉన్న ఓక్రిడ్జ్‌లో ప్రస్తుతం 7000 మంది విద్యార్థులు ఉన్నారు.

కొన్ని వారాల క్రితమే ఈ డీల్ కుదిరినప్పటికీ ఇప్పుడు అధికారికంగా ఈ వ్యవహారం విసిసి సర్కిల్ ద్వారా బయటకు పొక్కింది. పాత మేనేజ్మెంట్ పూర్తిగా వైదొలుగుతుందా లేక వాళ్ల నేతృత్వంలోనే ఇతర ప్రాంతాల్లో విస్తరణ కొనసాగుతుందా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇలాంటి డీల్స్‌లో హైదరాబాద్ టాప్ బ్రాండ్స్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగడిస్తాయి అనడంలో ఎలాంటి సందేహంలేదు.

English summary

రూ.1400 కోట్లకు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మకం !! హాంకాంగ్ సంస్థ చేతికి పగ్గాలు | oakridge International School going to be sell

One of the top class private schools in the country the oak ridge International School is going to sell ,News has reported that The school was established by two Telugu people named People Coubine Populary has come. The school was created by Prasad Thummala and Vivi Rajasekhar, who grew up in the upper and lower parts of Andhra Pradesh.
Story first published: Friday, February 22, 2019, 19:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X