For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేక్ వాట్సాప్ మెసేజ్ వచ్చిందా ? ఇలా చేస్తే వాళ్ల వాట్సాప్ అకౌంట్ క్లోజ్

By Chanakya
|

వాట్సాప్ లేనిదే ఇప్పుడు మనం లేము అనే స్థాయికి వచ్చేశాం. అంతగా ఈ యాప్‌కు స్మార్ట్ ఫోన్ జనాలంతా అడిక్ట్ అయిపోయారు. అయితే అదే స్థాయిలో ఇందులో ఫేక్ కంటెంట్ గోల కూడా పెరిగిపోతోంది. ఏది నమ్మాలో.. ఏది అబద్ధమో కూడా అర్థం కాని స్థితి కొందరిది. ఇంకో ప్రమాదం బెదిరింపులు, అసభ్య సందేశాలు, బూతు పురాణాలు, చంపేస్తామనే హెచ్చరికలు.

సెలబ్రిటీలూ భయపడ్తున్నారు
సామాన్య జనాలు ఎటూ ఈ సమస్యతో బాధపడ్తూనే ఉన్నారు. కానీ సెలబ్రిటీలు కూడా అదే స్థాయిలో ఆందోళన పడ్తున్నారు. వాళ్లతో పాటు పబ్లిక్ ఫిగర్స్, జర్నలిస్టులు, సినిమా స్టార్స్ వంటి వాళ్లకూ ఇబ్బందికర మెసేజెస్ వస్తున్నట్టు గుర్తించారు. దీంతో చేసేది లేక కొంత మంది లోలోపల కుమిలిపోతే మరికొందరు బయటకు వచ్చినా చెప్పినా ఏమీ చేయలేని స్థితి ఉండేది.

got a Fake Whatsapp Message? Then you can do like this their Whatsapp account close

ఇప్పుడు మీకో కొత్త అస్త్రం

ఇలాంటి ఆకతాయిల పనిపట్టేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఓ కొత్త పరిష్కారంతో ముందుకు వచ్చింది. మీకు ఏదైనా అసభ్యకర, బెదిరింపు మెసేజీలు వస్తే... సింపుల్‌గా వాటిని స్క్రీన్ షాట్ తీసి [email protected] కు మెయిల్ పంపించండి. సదరు మెమొరి మీకు వచ్చిన సందేశంతో పాటు వాళ్ల ఫోన్ నెంబర్ కూడా పంపిస్తే సరిపోతుందని అధికారులు చెబ్తున్నారు.
ఈ మెయిల్‌ను పరిశీలించి సదరు సమాచారాన్ని టెలికాం ఆపరేటర్లకు, పోలీసులకు పంపిస్తామని టెలికాం శాఖ అధికారులు స్పష్టం చేశారు.

అవసరాన్ని, సీరియస్‌నెస్‌ను బట్టి అలాంటి సందేశాలు పంపించే వాళ్ల ఫోన్స్ బ్లాక్ చేయడం, టెలికాం సేవలు నిలిపివేయడం, వాట్సాప్ వాడకుండా చేయొచ్చు. అప్పుడు మనకు వాళ్ల బాధ తప్పుతుంది.

సో మీరు కూడా అలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటే తక్షణం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మీ కోసం తెచ్చిన ఈ సేవలను వినియోగించుకోండి.

Read more about: whatsapp
English summary

ఫేక్ వాట్సాప్ మెసేజ్ వచ్చిందా ? ఇలా చేస్తే వాళ్ల వాట్సాప్ అకౌంట్ క్లోజ్ | got a Fake Whatsapp Message? Then you can do like this their Whatsapp account close

now a days whatsapp is very importanat in daily life ...Without Watsap we are not. at the same time , the fake content is also growing like threats, obscene messages, pornography, killings .so there is no problemThe Department of Telecommunications came forward with a new solution to work on such things
Story first published: Friday, February 22, 2019, 19:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X