భారత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రంశంసించిన సౌదిరాజు మహ్మద్ బీన్ సల్మాన్ ఈ రంగంతో పాటు భారతో ఏడు లక్షల కోట్ల రుపాయాలు పెట్టుబడి పెట్టాలని నిర్ణయం..కాగా ఇప్పటికే భారత్ పెట్రె కెమికల్స్ లో సౌది ఇప్పటికే భారి పెట్టుబడులు ప్రకటించింది.. భారత్ లో పర్యటిస్తున్న సల్మాన్ ఇతర రంగాల్లోను మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నట్టు ఆయన తెలిపారు..బుధవారం ఢిల్లిలోని హజ్ హౌజ్ లో జరిగిని మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు...
కాగా మోడి విదేశి విధానం ఓక్కోక్కటిగా ప్రతిఫలాలను ఇస్తుంది..అధికారం చేపట్టిన కోద్ది రోజులకే మోది విదేశాంగ విధానంలో భాగంగా పలు దేశాల్లో పర్యటించారు..ఈ నేఫథ్యంలోనే ప్రధాని మోది 2106 లో సౌదీ అరేబియా పర్యటించారు..దీంతో సౌదీ భారత్ లో పెట్టుబడులకు ఆసక్తి కనబరించింది.. ఈనేపథ్యంలోనే అప్పటి నుండి సుమారు 4500 కోట్ల డాలర్లను భారత్ లో పెట్టుబడులు పెట్టినట్టు సల్మాన్ తెలిపారు..పాత ఓప్నందాల పాటు మరిన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు..కాగా ఈ పెట్టుబడుల ద్వార ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత పటిష్టపరుచుకోవాలని భావిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు..

సౌదీలో భారత్ పెట్టుబడులు...
మొత్తం 15 భారత కంపెనీలు సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి.సౌదీ-ఇండియా ఫోరమ్‌లో జరిగిన ఈ ఎంఓయూల్లో 11 కంపనీల ఎంఓయూలు మునుపటి ఒప్పందాలకు కొనసాగింపు కాగా.. 4 కొత్తగా కుదుర్చుకున్న ఒప్పందాలని సౌదీ అరేబియేన్ జనరల్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటికి సంబంధించి ఆయా కంపెనీలకు లైసెన్సులు జారీ చేశామని వెల్లడించింది. కాగా ఈ ఒప్పందాల్లో . 2.8 కోట్ల డాలర్ల విలువైన నాలుగు లైసెన్సులు భారత కంపెనీలకు అందజేయడం జరిగిందని అథారిటీ తెలిపింది.కాగా పెట్టుబడి పెట్టే వాటిలో టీసీఎస్, విప్రో, కార్నివాల్ సినిమాస్, గ్లెన్‌మార్క్‌తో లంటి పలు కంపనీలు ఉన్నాయి
రిలయన్స్ లో పెట్టుబడులు వెల్లడించిన సౌదీ ఆరామ్కో సీఈఓ
ఈనేపథ్యంలోనే రిలయన్స్ ఇండస్ట్రీ్‌సతో కలిసి ముందుకు సాగేందుకు సౌదీ అరామ్కో ఆసక్తిగా ఉంది. భారత పెట్రోకెమికల్స్, రిఫైనరీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌తోపాటు ఇతర కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సౌదీ అరామ్కో సీఈఓ అమీన్ అల్-నాసర్ తెలిపారు.


Click it and Unblock the Notifications