గురువారం మరోసారి పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.
మరోసారి పెరిగిన ఇంధన ధరలు, దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో లీటరు పెట్రోల్ పై ధర 14-15 పైసలు, డీజిల్ ధర 16 నుంచి 18 పైసల మేర పెరగడంతో ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోలు ధరను పెంచాయి.
న్యూఢిల్లీ:మరోసారి పెరిగిన ఇంధన ధరలు, దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో లీటరు పెట్రోల్ పై ధర 14-15 పైసలు, డీజిల్ ధర 16 నుంచి 18 పైసల మేర పెరగడంతో ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోలు ధరను పెంచాయి. ఢిల్లీలో గురువారం పెట్రోలు ధర 15 పైసలు పెరిగి రూ.71.15 రూపాయలకు చేరుకుంది అదేవిదంగా డీజిల్ పై 16 పైసలు పెరిగి రూ.66.17 రూపాయల వద్ద నిలిచింది.

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు బుధవారం పెట్రోల్,డీజిల్ ధరలలో ఎటువంటి మార్పులు చేయలేదు.
కోల్కతాలో పెట్రోలు ప్రస్తతం రూ.73.25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మరియు లీటరు డీజిల్ రూ.68.12 రూపాయలు నిన్నటి ధర రూ.67.95 రూపాయలతో పోల్చి చూస్తే 17 పైసలు ఎక్కువ.
ముంబయిలో రిటైల్ పెట్రోలు ధర బుధవారం రూ. 76.64 నుంచి 15 పైసలు పెరిగి రూ.76.79 కు చేరుకుంది. డీజిల్ ధరలు లీటరుకు రూ .69.30 చొప్పున 17 పైసలు పెంచాయి. చెన్నైలో పెట్రోలు రూ.73.87 రూపాయల చొప్పున రిటైలింగ్ అవుతున్నాయి. బుధవారం నాటి ధర రూ. 73.72 గా ఉంది, డీజిల్ అత్యధికంగా రూ. 70.09 కు చేరుకుంది.
నోయిడాలో పెట్రోలు ధర 11 పైసలు పెరిగి రూ.70.89 రూపాయలకు పెరిగింది. బుధవారం రూ. 70.78 పైసలు, డీజిల్ ధర రూ. 65.46 కు పెరిగింది. గురుగ్రం లో పెట్రోల్ 10 పైసలు పెరిగి రూ.71.75 రూపాయలకు చేరింది అలాగే డీజిల్ ధర రూ.65.89 రూపాయలకు పెరిగింది.
2018 అక్టోబర్లో రిటైల్ పెట్రోలు ధర ఢిల్లీలో లీటర్కు అత్యధికంగా రూ.84 రూపాయలకు చేరుకుంది మరియు ముంబయిలో రూ.91 రూపాయల దాటింది.
గురువారం, అంతర్జాతీయ చమురు మార్కెట్లో, ముడి ధరలు 2019 స్థాయికి చేరాయి, OPEC సరఫరా కోతలు మరియు ఇరాన్ మరియు వెనిజులాపై అమెరికా అడ్డంకులు బలపర్చాయి. అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్కు 67.14 డాలర్ల వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications