6 కోట్ల మందికి పనికొచ్చే న్యూస్.. ఈపీఎఫ్ వడ్డీ 8.55 శాతం

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) 2018-19 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌పై వడ్డీ రేట్‌ను 8.55 శాతంగా ఖరారు చేయొచ్చని తెలుస్తోంది. గతంలో 2017-2018ఏడాదికి కూడా ఇదే వడ్డీ ఉంది. ఆరు కోట్ల మంది ఖాతాదార్లను నేరుగా ప్రభావితం చేయబోయే ఈ వడ్డీ రేట్‌పై ఈ సారి జనాల్లోచాలా అంచనాలున్నాయి.ఎన్నికల ఏడాది కావడంతో కేంద్ర బోర్డ్ ఈ సారి కొద్దిగా వడ్డీ రేట్లను సవరించవచ్చని అంతా భావించారు. అయితే అలాంటిదేమీ ఉండకపోవచ్చని 8.55 శాతానికి మించదని
స్పష్టంగా అర్థమవుతోంది.

ఫిబ్రవరి 21న భేటీ కాబోతున్న బోర్డ్, పీఎఫ్‌పై నేడు తుది నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు నేతృత్వం వహించే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోఈపీఎఫ్ఓ ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. ట్రస్టీస్ ఆమోదం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖకు ఈ ఫైల్ చేరుతుంది. ఎందుకంటే ఆర్థిక శాఖ ఆమోదం తర్వాతే సబ్‌స్క్రైబర్ల ఖాతాల్లోకి వడ్డీ జమ అవుతుంది.

EPFO seems to have fixed the interest rate on PF TO 8.55 P/a

2016-17లో వడ్డీ రేట్ 8.65 శాతంగా, 2015-16లో 8.8 శాతంగా ఉండేది. అదే 2013-15 మధ్య కూడా వడ్డీ రేట్ 8.75 వరకూ ఉండేది. అయితే ఈ సారి 8.55 శాతానికి బదులు కనీసం 8.6శాతమైనా ఇస్తారని భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లు పెంచేందుకు ఆస్కారం లేకపోవడంతో బోర్డ్ పాత రేట్‌కే పరిమితం కావొచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+