For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడడం, ఒక కళ కాదు, ఇది సైన్స్..

By Chanakya
|

హైద్రబాద్..
స్టాక్ మార్కెట్. ఇధో ఫ్యాన్సీ వర్డ్. చాలా మంది దీన్నో జూదంలా, మరికొందరు గుర్రపు పందేలతో పోలుస్తారు. ఇంకొందరు ఇదోలాటరీ, లక్ అంటారు. కానీ ఇదో సైన్స్ అని కొద్ది మందినిపుణులు మాత్రమే చెబుతారు. ఇది ఆర్ట్ కాదని,ఇదో సైన్స్ అని గట్టిగావివరిస్తారు. అలాంటివాళ్లలో ప్రముఖు మార్కెట్ వెటరన్, విశ్లేషకులు, రమేష్ దమానీ. మంచి స్టాక్స్‌ను తక్కువ వేల్యుయేషన్స్‌లో ఉన్నప్పుడే పట్టుకుని వాటిని హోల్డ్ చేసి మల్టీబ్యాగర్స్ చేయడంలో దిట్ట.

Stock Market is not art,Gambling, It is a science says Veteran market Analyst damani

మూడెళ్లలో రెట్టింపు ...
రమేష్ దమానీ చెప్పిన కిటుకుల్లో ఈ ఒక్కటి సూపర్ ఫేమస్ అయింది. యూట్యూబ్‌లో వైరల్ కూడా అయింది. ఆయన చెప్పే సింపుల్ ఫార్ములా ఒక్కటే. రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టండి. దాన్ని ఇంక 30 ఏళ్ల పాటు కదపొద్దు. ఏడాదికి 24 శాతం చొప్పున లాభాలు వచ్చేలా చూసుకోండి. ముప్ఫై ఏళ్లు పూర్తయ్యే సరికి ఆ డబ్బు రూ.100 కోట్లు అవుతుంది అనేది ఆయన మాట. ఎందుకంటే 24 శాతం రాబడి వస్తే.. ప్రతీ మూడేళ్లకూ మన పెట్టుబడి రెట్టింపవుతూ వస్తుంది. ఆ లెక్కన మన రూ.10 లక్షల సొమ్ము పది రెట్లు పెరిగి రూ.100 కోట్లు అవుతుందనేది ఆయన ఎనాలసిస్. ప్రిన్సిపుల్ ఆఫ్ కాంపౌండింగ్‌లో భాగంగా ఆయన పదే పదే ఈ లెక్కలను అనేక వేదికలపై ప్రస్తావించారు.

Stock Market is not art,Gambling, It is a science says Veteran market Analyst damani

ఏడాదికి 24 శాతం రాబడి సాధ్యమా
ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ 7-8 శాతానికి మించి లేదు. వివిధ పెట్టుబడి మార్గాల్లోనూ రిటర్న్స్ డబుల్ డిజిట్ రావడం కష్టమే. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో ఇది సాధ్యమే అయినప్పటికీ రిస్క్ కూడా
అదే స్థాయిలో ఉంటుంది. అందుకే అలాంటి వ్యాపారాలను, అలాంటి బిజినెస్‌లనూ పట్టుకోవాలి. అప్పుడే రిటర్న్స్ గొప్పగా వస్తాయి. స్థిరంగా కూడా ఉంటాయి. దీర్ఘకాల దృష్టి ఉన్నప్పుడు అధిక లాభాలు
వచ్చిపడ్తాయని వివరిస్తున్నారు రమేష్ దమానీ.

మీకు అర్థమయ్యే వ్యాపారాలు ఎంపిక చేసుకోండి మీకు ఫుడ్ గురించి తెలిస్తే ఫుడ్ బిజినెస్ చేసే కంపెనీలను నమ్మండి. ఏ మాత్రం అవగాహన లేకుండా బిట్ కాయిన్స్ వంటివి, ఇంజనీరింగ్ వంటివి ఎంచుకుని అందుల్లో వచ్చే మార్పులను మీరు గుర్తించలేరు. అప్పుడు పెట్టుబడి పెట్టినా మీకు లాభాలకు బదులు నష్టాలు రావొచ్చు. అందుకే మీరు నమ్మిన, మీకు నచ్చిన రంగాల్లోని స్టాక్స్‌ను ఎంచుకోండి అని సలహా
ఇస్తారు దమానీ.

ప్రస్తుతం బీఎస్ఈలో వివిధ రంగాల్లో 5000 స్టాక్స్ ఉన్నాయి. మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్న సెక్టార్‌ను పిక్ చేసుకోండి. ఒక వేళ మీరు బ్యాంకర్ అయితే బ్యాంకింగ్ రంగాన్ని, మీరు డాక్టర్ అయితే ఫార్మా రంగాన్ని చూడండి. అప్పుడే మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత ధైర్యంగా ఎక్కువ కాలం కొనసాగించగలరు అని చెప్తారు రమేష్. ఎవరో పెట్టారని, మరెవరో చెప్పారని ఇన్వెస్ట్ చేస్తే ఇరుక్కుంటారని సూచించారు.

Stock Market is not art,Gambling, It is a science says Veteran market Analyst damani

మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను ఇలా పట్టుకోండి

ఇన్ఫోసిస్ ఒకప్పుడు ఐపీఓ ద్వారా రూ.50 కోట్లను సమీకరించింది. ఇప్పుడు దాని మార్కెట్ విలువ రూ.3 లక్షల కోట్లు. మీరు ఏదైనా ఓ కంపెనీకి చెందిన అసలైన విలువను లెక్కించగలిగినప్పుడే మల్టీబ్యాగర్స్‌ను గుర్తించడం సాధ్యపడ్తుంది. భవిష్యత్తులో సదరు సంస్థకు, సదరు రంగానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయో మీరు ముందే తెలుసుకోగలగాలి. అప్పుడే మీకు ఇది సాధ్యపడ్తుంది అని చెబ్తున్నారు.

ఒకవేళ మీరు ఇప్పుడు టైప్ రైటర్ బిజినెస్‌లో కోట్లకు కోట్లు కుమ్మరించినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాటి పరిధి నానాటికీ తగ్గిపోతూ.. భవిష్యత్తులో వాటి ఉనికే ఉండకపోవచ్చు. అప్పుడు అలాంటి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి ఏం ప్రయోజనం అనేది ఆయన విశ్లేషణ.

మరో వైపు ఫోన్లలో కంటెంట్‌కు సూపర్ గిరాకీ వస్తోంది. జనాలు టీవీలను మర్చిపోతూ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా ఫోన్లనే నమ్ముకుంటున్నారు. చాలా లావాదేవీలకు ఫోన్లవైపే మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటీకి రాబోయే రోజుల్లో అత్యధిక డిమాండ్‌ ఉండబోతోంది. అలాంటప్పుడు ఈ రంగంలోని థీమ్స్‌ను పట్టుకోవాలి.

ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచనలు అవసరం

అందరి మాదిరి ఒకేలా ఆలోచించిస్తే ప్రయోజనం ఉండదు. ఒక్క అడుగు ముందుకు వేసి మనం ఆలోచనలు చేయాలి. అప్పుడే ఏ రంగంలో అయినా సక్సెస్ సాధ్యపడ్తుంది. రొటీన్‌కు భిన్నంగా వెళ్లే కంపెనీలు,
యాజమాన్యాలను మనం గుర్తించాలని సూచిస్తున్నారు. ఒకప్పుడు గ్రాసిం, బాంబే డయింగ్ సూపర్ స్టాక్స్. ఆ తర్వాత టెక్నాలజీ స్పేస్‌లో టీసీఎస్, ఇన్ఫోసిస్ హిట్ అయ్యాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి సెక్టార్స్‌
మెరుగైన లాభాలను అందించగలవో అలాంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలని చెబ్తారు.

నమ్మిన స్టాక్‌లో డబ్బులు కుమ్మరించండి

మన పరిశోధన పూర్తైన తర్వాత సాధ్యమైనంత డబ్బును మనం ఇన్వెస్ట్ చేయాలి. రూ.5-10 వేలు పెట్టుబడి పెట్టి ఎప్పటికో వెయ్యి, రెండు వేలు లాభం సంపాదించడం పెద్ద విషయం కాదు. దానికి స్టాక్ మార్కెట్టే
అక్కర్లేదు. భారీగా పెట్టుబుడలను పెట్టాలి. అవసరం అనుకుంటే, ఒక వేళ మనం నమ్మిన కంపెనీ అద్భుతమని అనిపిస్తే.. అందులో డబ్బులు కుమ్మరించినా నష్టం లేదు.

ఒక్కోసారి ఒక్క స్టాక్ మీ జీవితాన్ని మార్చేయవచ్చు.

లాంగ్ టర్మ్ మంత్ర షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం తాపత్రయ పడకుండా లాంగ్ టర్మ్ కోసం స్టాక్స్‌ను హోల్డ్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే ఒకటి ట్రేడింగ్ అకౌంట్, మరొకటి ఇన్వెస్ట్‌మెంట్ ట్రేడింగ్ అకౌంట్
పెట్టుకోవాలి. అప్పుడే అదీ ఇదీ మిక్స్ అవకుండా చూసుకోవచ్చు. ట్రేడింగ్ థ్రిల్ ఇస్తుందేమో కానీ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే మనకు వెల్త్‌ను క్రియేట్ చేస్తుంది.

English summary

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడడం, ఒక కళ కాదు, ఇది సైన్స్.. | Stock Market is not art,Gambling, It is a science says Veteran market Analyst damani

Stock Market is not art or Gambling, It is a science,Choose Businesses Which You Know If you know about food, trust food companies.but dont invest without any awareness companies If you invest then you can risk losses instead.You will not be able to recognize the changes.
Story first published: Tuesday, February 19, 2019, 17:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X