For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొమ్మిది రోజూ పతనం ! మళ్లీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

By Chanakya
|

స్టాక్ మార్కెట్ వరుసగా తొమ్మిదో రోజు కూడా నష్టాల్లో ముగిసి ఇన్వెస్టర్లను మరింత ఏడిపిస్తోంది. 2013 తర్వాత మళ్లీ ఇప్పుడే ఒకేసారి ఇన్ని రోజుల పతనాన్ని చవిచూస్తోంది. 10600 పాయింట్ల దగ్గర ఆగిన నిఫ్టీ... బ్రేక్ డౌన్‌కు స్థాయికి సమీపిస్తోంది. రేపో, మాపో 10580 స్థాయిలను కూడా బ్రేక్ చేసి దాని కింద క్లోజ్ అయితే 10400 వరకూ వెళ్లొచ్చని టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ విశ్లేషిస్తున్నారు.

ఈ రోజు ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలతో ఫ్లాట్‌గా మొదలైన సూచీలు మిడ్ సెషన్ వరకూ నిస్తేజంగానే సాగాయి. అప్పటివరకూ ఐటి మినహా అన్ని రంగాల షేర్లలోనూ
లాభాలే నమోదయ్యాయి. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ ఔట్‌పర్ఫార్మ్ చేసింది. ఒక దశలో 10720 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన నిఫ్టీలో ఒక్కసారిగా సెల్ ఆఫ్ వచ్చింది. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 140
పాయింట్ల వరకూ నిఫ్టీ పతనమైంది. చివరకు 10600 పాయింట్ల స్థాయిని కూడా బ్రేక్ చేసినప్పటికీ కొద్దిగా కోలుకుంది 10604 పాయింట్ల దగ్గర క్లోజైంది. నిఫ్టీ 36 పాయింట్లు, సెన్సెక్స్ 145 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్ల లాభం నుంచి కేవలం 30 పాయింట్ల లాభానికి మాత్రమే పరిమితమైంది.

ఐటీ, ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలోనూ లాభాలు కొనసాగాయి. రియాల్టీ, మెటల్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లలో కొద్దిగా కొనుగోళ్ల మద్దతు ఉంది. ప్రధానంగా టీసీఎస్, ఇన్ఫోసిస్
స్టాక్స్ మార్కెట్ పతనానికి కారణమయ్యాయని చెప్పాలి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా పావు నుంచి అర శాతం లాభానికి పరిమితమయ్యాయి.

వేదాంతా, గ్రాసిం, బిపిసిఎల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిస్తే.. టీసీఎస్, విప్రో, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్ స్టాక్స్ టాప్ 5 లూజర్స్ జాబితాలో చేరాయి.

ఇమామీ హైజంప్

ఇమామీ హైజంప్

రుణభారం తగ్గించుకోవడానికి ఇమామీ అమ్మింది. సమీకరించిన రూ.1600 కోట్లతో అప్పులను తీర్చడానికి సమాయత్తమైంది. దీంతో వాల్యూమ్స్‌తో సహా ఈ స్టాక్ ఏకంగా 15 శాతం పెరిగింది. చివరకు రూ.408

దగ్గర క్లోజైంది.

పదో రోజూ పరుగెత్తిన దిలీప్

పదో రోజూ పరుగెత్తిన దిలీప్

దిలీప్ బిల్డ్‌కాన్ షేర్ పదో రోజు కూడా లాభాల్లో ముగిసింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నాయి. 4 శాతం వరకూ ఉదయం లాభాల్లో ట్రేడ్ అయినప్పటికీ చివరకు అర

శాతం లాభాలతో రూ.460 దగ్గర క్లోజైంది.

కావేరీ నష్టాల ప్రవాహం

కావేరీ నష్టాల ప్రవాహం

ఏపీలో హెచ్ టి పత్తివిత్తనాలు (హెర్బిసైడ్ టాలరెంట్) అమ్మకాలు చేపడ్తున్న వివిధ కంపెనీలు, సంస్థల లైసెన్సులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ఈ సంస్థపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్క ఏపీ నుంచే కావేరీకి 10-12 శాతం వరకూ ఆదాయం లభిస్తోంది. వీటికి తోడు ఒక్క కాటన్‌ సీడ్స్ నుంచే 40 శాతం వరకూ ఆదాయాన్ని ఆర్జిస్తోంది

కావేరీ. ఈ వార్తల నేపధ్యంలో ఈ స్టాక్ ఈ రోజు ఏకంగా 15 శాతం వరకూ పడిపోయింది. చివరకు కొద్దిగా తేరుకున్నప్పటికీ 10 శాతం నష్టాలతో రూ.421 దగ్గర ముగిసింది.

ఎడిల్వైజ్.. ఎగిరి గంతేసింది

ఎడిల్వైజ్.. ఎగిరి గంతేసింది

ప్రముఖ ఫైనాన్షియల్ సేవల సంస్థ ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్‌లో ఈ రోజు ఓ బ్లాక్ డీల్ సెంటిమెంట్‌ను పెంచింది. 15 లక్షల షేర్లు చేతులు మారడంలో ఈ స్టాక్ 5 శాతం లాభపడి రూ.142 దగ్గర

క్లోజైంది.

English summary

తొమ్మిది రోజూ పతనం ! మళ్లీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sensex falls for ninth straight session,

Sensex falls for ninth straight session,TCS and Infosys were the top losers in the Sensex pack Technical exploits are evolving to go beyond 10400 levels and close up to 10400 levels.At one stage, the Nifty, which reached the maximum level of 10720, The Nifty was down 36 points and the Sensex lost 145 points.
Story first published: Tuesday, February 19, 2019, 18:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X