సోమవారం సోమవారం మరోసారి పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
సోమవారం రిటైల్ ఇంధన ధరలు పెరగడంతో దేశంలో నాలుగు మెట్రో నగరాల్లో వరుసగా ఐదవరోజు పెరిగాయి అలాగే డీజిల్ ధర కూడా పెరిగింది.
న్యూఢిల్లీ: సోమవారం రిటైల్ ఇంధన ధరలు పెరగడంతో దేశంలో నాలుగు మెట్రో నగరాల్లో వరుసగా ఐదవరోజు పెరిగాయి అలాగే డీజిల్ ధర కూడా పెరిగింది. అన్ని మెట్రో నగరాల్లో పెట్రోలు ధరలు 15-16 పైసలు పెరిగాయి, డీజిల్ ధర 13-14 పైసలు పెరిగిపోయింది.

ఢిల్లీలో రిటైల్ ధర 15 పైసలు పెరిగి రూ.70.91 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 13 పైసలు పెరిగి రూ.65.98 రూపాయల వద్ద నిలిచింది.
కోల్కతాలో పెట్రోల్ పై 15 పైసలు పెరిగి లీటరుకు 73.01 రూపాయలు చేరింది మరియు డీజిల్ పై లీటరుకు 13 పైసలు పెరిగి రూ.67.89 రూపాయల వద్ద నిలిచింది.
ముంబైలో రిటైల్ పెట్రోలు ధర 15 పైసలు పెరిగి రూ.76.54 రూపాయలకు పెరిగింది. డీజిల్ ధర లీటరుకు 14 పైసలు పెరిగి రు. 69.09 రూపాయలు చేరింది. చెన్నైలో పెట్రోలు పై 16 పైసలు పెరిగి రూ.73.61 రూపాయల వద్ద నిలిచింది.డీజిల్ పై ధర 14 పైసలు పెరిగి రూ .69.84 రూపాయలుగా ఉంది అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ లో వెల్లడించింది.
నోయిడాలో లీటరు పెట్రోలు రూ. 70.71, డీజిల్ రూ.65.27 రూపాయలు ఖర్చు అవుతుంది. గురుగ్రం లో, పెట్రోల్ ధర రూ. 71.60 మరియు డీజిల్ రూ. 65.74 రూపాయలు.
పెట్రోలు ధర అక్టోబర్ 2018 లో ఢిల్లీలో పతాక స్థాయిలో రూ.84 రూపాయలకు చేరుకుంది. ముంబయిలో 91 రూపాయలు దాటింది.
అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్కు 66.78 డాలర్లుగా నమోదయ్యాయి. గత ముగింపులో ఇది 0.6 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications