మరోసారి పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.
వరుసగా మూడవరోజు ప్రధాన నగరాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధరలు ఢిల్లీ లో 14 పైసలు పెరిగి రూ.70.60 రూపాయలకు చేరుకుంది
న్యూఢిల్లీ: వరుసగా మూడవరోజు ప్రధాన నగరాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధరలు ఢిల్లీ లో 14 పైసలు పెరిగి రూ.70.60 రూపాయలకు చేరుకుంది నిన్నటి ధర రూ.70.46 రూపాయలు.అదేవిదంగా ముంబై లో పెట్రోల్ పై 13 పైసలు పెరిగి రూ.76.23 రూపాయలకు చేరింది.నిన్నటి ధర రూ.76.10 రూపాయలు.

ఇతర నగరాలు కోల్కతా, చెన్నైలలో పెట్రోలు పై 14 పైసలు పెరిగి రూ.72.71 రూపాయలు మరియు రూ.73.28 రూపాయల వద్ద నిలిచింది. శుక్రవారం పెట్రోల్ ధరలు 72.57 రూపాయలకు, 73.14 రూపాయలుగా ఉన్నాయి. గురుగ్రమ్, నోయిడా లో పెట్రోలు ధరలు 9 పైసలు, 11 పైసలు పెరిగి 71.30 రూపాయలు,రూ.70.35 రూపాయలకు చేరింది. శుక్రవారం గురుగ్రం మరియు నోయిడాలో పెట్రోల్ ధరలు రూ .71.21 మరియు రూ.70 .24 రూపాయలు.
డీజిల్ ధరలు మెట్రో నగరాల్లో కూడా ఇలాంటి పెరుగుదల కనిపించింది. శనివారం ఫిబ్రవరి 16, 2019 నాటికి న్యూఢిల్లీలో డీజిల్ ధర 13 పైసలు పెరిగి రూ.65.86 రూపాయలకు చేరింది. ముంబయి, కోల్కతా, చెన్నైలలో డీజిల్ ధర 14 పైసలు,13 పైసలు,13 పైసలు పెరిగింది. శనివారం, ఫిబ్రవరి 16, 2019 న రూ .69.97, రూ. 67.64 మరియు రూ .69.57 లు చొప్పున ధరలు నమోదయ్యాయి.శుక్రవారం ముంబయి, కోల్కతా, చెన్నైలలో లీటరుకు రూ .68.83, రూ. 67.51 మరియు రూ .69.44 చొప్పున రిటైలింగ్ అయ్యాయి.
శనివారం నోయిడా లో డీజిల్ దరల పై 19 పైసలు పెరిగి రూ.65.03 రూపాయలకు పెరిగింది. గురుగ్రమ్ లో డీజిల్ ధరలు 8 పైసలు తగ్గి రూ.65.30 రూపాయలకు చేరింది.


Click it and Unblock the Notifications