ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు పిల్లల వస్త్రాలు విక్రయించే ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ హాప్‌స్కాచ్ సంస్థతో చర్చలు జరుపుతున్నాయి. హాప్‌స్కాచ్ సంస్థలో మైనర్ వాటాలను దక్కించుకునేందుకు చర్చలు జరుపుతున్నాయి. హాప్‌స్కాచ్ సంస్థ స్థాపించి దాదాపుగా ఆరేళ్లు అవుతోంది. హాప్‌స్కాచ్ సంస్థ తన రుణాల కోసం బార్‌క్లేస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే రూ.428 కోట్లతో తమ సంస్థలను విస్తరించే పనిలో ఉంది. విస్తరణతో పాటు ఉద్యోగులను కూడా భారీగా నియమించుకునే పనిలో పడింది హాప్‌స్కాచ్.
మంచి పెట్టుబడిదారులతో కంపెనీ చర్చలు జరుపుతోందని హాప్‌స్కాచ్ సంస్థ వ్యవస్థాపకులు రాహుల్ ఆనంద్ వెల్లడించారు.అయితే ఏ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారో బయటకు వెల్లడించేందుకు నిరాకరించారు. చర్చలు ఇంకా జరుపుతున్నామని చెప్పిన రాహుల్ ఆనంద్... ఇంకా ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయలేదని స్పష్టం చేశారు. హాప్‌స్కాచ్‌తో చర్చలు జరుపుతున్నట్లు అమెజాన్ కానీ ఫ్లిప్ కార్ట్ సంస్థలు కానీ స్పందించలేదు. వస్తున్న వార్తల్లో నిజం ఉండొచ్చు, అవాస్తవమై ఉండొచ్చు... వీటిపై స్పందించేది లేదని అన్ని విషయాలు త్వరలో తెలుస్తాయని అమెజాన్ సంస్థ ప్రతినిధి తెలిపారు.

ఇదిలా ఉంటే పిల్లల కోసం అన్ని రకాల వస్త్రాలు హాప్‌స్కాచ్‌లో దొరుకుతాయి. రూ.95వేల కోట్లతో ఇది జరుగుతోంది. ప్రతి ఏటా 20శాతం పెరుగుతూ పోతోంది. ఇక దీని వార్షికాదాయం రూ.500 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. దీంతోనే ఇతర ఈ-కామర్స్ దిగ్గజాలు హాప్‌స్కాచ్ కంపెనీపై కన్నేశాయి.హాప్‌స్కాచ్ సంస్థలో అన్ని రకాల దుస్తులు చిన్నారుల కోసం దొరుకుతాయి. ఇదొక సప్లై చైన్‌లా వ్యవహరిస్తోంది. భారీ డిస్కౌంట్లు కూడా ఇస్తుండటంతో ఈ సంస్థ పై కస్టమర్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ కంపెనీకి సగానికి పైగా వ్యాపారం చిన్న పట్టణాలు, నగరాల నుంచే వస్తుండటం విశేషం. ప్రతిరోజు 400 నుంచి 500 వరకు స్టైల్స్‌ను హాప్‌స్కాచ్ సంస్థ అందిస్తోందని చాలా తక్కువ సమయంలోనే కస్టమర్లకు చేరవేస్తున్నామని చెప్పారు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్.


Click it and Unblock the Notifications