గురువారం పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
రెండు రోజుల విరామం తరువాత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న చమురు మార్కెటింగ్ కంపెనీలు గురువారం రిటైల్ ఇంధన ధరలను పెంచాయి.
న్యూఢిల్లీ: రెండు రోజుల విరామం తరువాత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న చమురు మార్కెటింగ్ కంపెనీలు గురువారం రిటైల్ ఇంధన ధరలను పెంచాయి. నేటి రేటు సవరణ తరువాత పెట్రోలు ధర 6 పైసలు, డీజెల్ ధర 5 పైసలు పెరిగింది. ఢిల్లీలో పెట్రోలు ధర రూ.70.39 రూపాయలకు చేరింది.బుధవారం రూ .70.33 గా ఉండగా, డీజిల్ ధర రూ.65.62 రూపాయలకు చేరింది.

ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ.76.03 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం తో పోల్చి చూస్తే 6 పైసలు పెరిగింది. ముంబైలో డీజిల్ లీటరు రూ.68.76 రూపాయలు, నిన్నటి ధర రూ.68.71 రూపాయలు.
కోల్కతాలో రిటైల్ పెట్రోలు 6 పైసలు పెరిగి బుధవారం నాడు 72.44 రూపాయల నుండి రూ.72.50 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధరలు కూడా లీటరుకు 5 పైసలు పెరిగి రూ. 67.40 చేరుకుంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 73.06 వద్ద ఉంది. డీజిల్ ధర 5 పైసలు పెరిగి రూ .69.37 కు చేరింది అని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ నుంచి ఈ సమాచారం వెల్లడైంది.
నోయిడాలో పెట్రోలు ధర 5 పైసలు పెరిగి రూ.70.30 రూపాయలకు చేరుకుంది.
భారతదేశంలో రిటైల్ పెట్రోల్ మరియు డీజిల్ అంతర్జాతీయ చమురు ధర మరియు రూపాయి-డాలర్ మారకం రేటు రెండింటిపై ఆధారపడుతున్నాయి.
అంతర్జాతీయ చమురు విపణిలో గురువారం ముడి చమురు ధరలు పెరిగాయి. తాజాగా అమెరికా-చైనా సుంకాల చర్చల వల్ల ప్రపంచ ఆర్థిక దృక్పథాన్ని మెరుగుపరుస్తుందని అంచనా వేసింది. గత సెషన్లో బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ 1.9 శాతం పెరిగి 63.98 డాలర్లకు చేరాయి.


Click it and Unblock the Notifications