For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌ నిర్ణయించేది ఈ ఒక్క పాయింటే..!!

|

అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఆర్బీఎల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సిటీ
బ్యాంక్.. ఇలా వీటి నుంచి ఈ మధ్య పిచ్చపిచ్చగా ఫోన్లు వస్తున్నాయి. మనం
వద్దంటున్న క్రెడిట్ కార్డులను అంటగడ్తున్నాయి. నో ప్రాసెసింగ్ ఫీజ్, ఏ
యాన్యువల్ ఫీజ్, నో జాయినింగ్ ఫీజ్‌ అంటూ ఊరిస్తున్నాయి. అంతే కాకుండా బుక్ మై షోలో ఒన్ ప్లస్ ఒన్ మూవీ టికెట్ ఆఫర్స్ కూడా ఇస్తూ తెగ
ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే వీటన్నింటికన్నా ముఖ్యమైనది మనకు ఎంత
క్రెడిట్ లిమిట్ ఇస్తారు అనేదే.

ఒక్కో బ్యాంక్‌ది ఒక్కో లెక్క మన దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉందని అనుకుందాం. దానికి వాళ్లు ఇచ్చిన లిమిట్ లక్ష రూపాయలు అని అనుకుందాం. ఇప్పుడు కొత్తగా ఇచ్చే బ్యాంక్ దానికంటే ఎక్కువగా ఇస్తేనే మనం ఆసక్తి చూపిస్తాం.

What is the Credit Limit on a Credit Card?

ఒక్కోసారి ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఇవ్వొచ్చు.. మరోసారి అందులో
సగం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

ఇక్కడ దొరికిపోతారు ముందుగా మీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అందుకున్న సదరు బ్యాంక్ చూసేది మీ ఇన్‌కం స్టేట్‌మెంట్. అందులో మీ శాలరీ స్లిప్స్, ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్

స్టేట్‌మెంట్లను చూస్తుంది. ఖచ్చితంగా మీ ఆదాయం ఎంతో ఈ మూడు చూస్తే బ్యాంకులు చెప్పేస్తాయి. ఎందుకంటే మీకు రూ.50 వేలు శాలరీ వస్తోందని మీరు చెప్పొచ్చు. అందుకు తగ్గట్టు పే స్లిప్ కూడా చూపొచ్చు. కానీ అదే ఫిగర్ అటు బ్యాంక్ స్టేట్మెంట్లో, ఐటీ రిటర్న్స్‌లో కూడా ఉండాలి.

మీ పొదుపేంటో చూస్తారు మీరు ఎంత సొమ్మును ఖర్చు చేస్తున్నారు అనే బ్యాంక్ స్టేట్మెంట్లను బట్టి

అంచనాకు వస్తాయి. నెలనెలా కనీసం మీకు వచ్చే జీతంలో 30 శాతమైనా దాస్తున్నారా లేదా అనే విషయాన్ని పసిగడ్తాయి. అంటే మీకు నెలకు రూ.50 వేల శాలరీ వస్తోంటే.. అందులో కనీసం రూ.15 వేలైనా దాయగలుగుతున్నారా లేదా అని విశ్లేషిస్తారు.

మీ ఈఎంల భారమే మీ శత్రువు మీకు నెలనెలా రూ.50వేల జీతం
వస్తోందని అనుకుందాం. అందులో ఇంటి ఖర్చులకు 70 శాతాన్ని తీసేయగా.. మరో 30 శాతం మీకు మిగిలే ఆదా. ఇప్పుడు అందులో నుంచి మీ ఈఎంలను తీసేసి లెక్కిస్తుంది బ్యాంక్ టీం. అంటే మీరు మిగిల్చే
రూ.15 వేలలో మీరు ఎన్ని ఈఎంఐలు కడ్తున్నారో చూస్తుంది.
ఉదా. మీరు మిగిల్చింది రూ.15 వేలు అయితే.. అందులో
ఈఎంఐ రూ.7వేలు అనుకుందాం. ఇప్పుడు మీ ఆదా రూ.8 వేలు మాత్రమే.

సిబిల్ స్కోర్

మీకు ఇతర క్రెడిట్ కార్డులున్నా లేక మరో బ్యాంకులో ఏదైనా లోన్ ఉందనుకుందాం. దాన్ని సరిగ్గా కడ్తున్నారా లేదా చూస్తారు. మొత్తం
బ్యాలెన్స్ చెల్లించేస్తున్నారా లేక మినిమం బ్యాలెన్స్ మాత్రమే చెల్చించి పోస్ట్ పోనే చేస్తున్నారా చూస్తారు. 50 రోజులకు పైన ఉండే గ్రేస్ పిరీడ్‌లో
ఇంకా ఎన్ని రోజులను వాడుకుంటున్నారో చూస్తారు. 750కి పైగా కనీసం స్కోర్ ఉంటే అది మన ఎలిజిబులిటీని, క్రెడిట్ లిమిట్‌ను పెంచుతుంది.

హౌసింగ్ లేదా పర్సనల్ లోన్ అయితే.. పైన చెప్పుకున్నట్టు మనకు
ఈఎంఐలు పోను నెలకు రూ.8 వేలు మిగులుస్తున్నారని అనుకుందాం. ఇప్పుడు బ్యాంక్ టీం ఏం చేస్తుందంటే.. నెలకు రూ.8 వేల చొప్పున ఏడాదికి రూ.96 వేలుగా చూస్తుంది. దాన్ని పదేళ్లతో మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు అది
రూ.9.6 లక్షలు అవుతుంది (8000*12 =96000*10years = 9.6lacs). ఇది మీకు బేసిక్‌గా వచ్చే హౌసింగ్ లేదా పర్సనల్ లోన్. దీనికిపైన మీరు పనిచేసే కంపెనీ, మీ క్రెడిట్ స్కోర్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. దానిపైన ఎంత వచ్చినా అది బ్యాంక్ విచక్షణాధికారం మాత్రమే అనేది గుర్తంచుకోవాలి. మనకు ఎంత ఆదాయం వచ్చిందో చూడడంతో పాటు ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎంత మిగులుస్తున్నామో చూస్తారు. ఎందుకంటే అది కదా వాళ్లను సేఫ్ జోన్‌లో ఉంచేది.

English summary

మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌ నిర్ణయించేది ఈ ఒక్క పాయింటే..!! | What is the Credit Limit on a Credit Card?

our credit card's credit limit is the maximum outstanding balance you can have on your credit card at a given point in time without receiving a penalty.ె
Story first published: Tuesday, February 12, 2019, 18:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X