For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్, సెన్సెక్స్ 250 పాయింట్స్ డౌన్

మూడో రోజూ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 10900 పాయింట్ల మార్కును దాటి పైకి వెళ్లిన నిఫ్టీ మళ్లీ ఏ దశలోనూ ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు.

By bharath
|

మూడో రోజూ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 10900 పాయింట్ల మార్కును దాటి పైకి వెళ్లిన నిఫ్టీ మళ్లీ ఏ దశలోనూ ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. బ్యాంకింగ్, రియాల్టీ, ఫైనాన్షియల్ సర్వీస్ రంగాల్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి నేపధ్యంలో మరో రోజు మార్కెట్ సూచీలు నీరసంగా ముగిశాయి. ఆఖరి గంటలో వచ్చిన అనూహ్య అమ్మకాలు కూడా మార్కెట్‌లో సెంటిమెంట్‌ను బలహీనపర్చాయి. చివరకు నిఫ్టీ 57 పాయింట్ల నష్టంతో 10831 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 240 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 217 పాయింట్లు కోల్పోయింది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ చాలా రోజుల తర్వాత ఈ రోజు మరింత నీరసించింది.

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్, సెన్సెక్స్ 250 పాయింట్స్ డౌన్

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలతో ఉదయం ఫ్లాట్‌గా మొదలైన నిఫ్టీ 10823 పాయింట్ల కనిష్ట స్థాయి నుంచి తేరుకుని 10910 పాయింట్ల వరకూ వెళ్లింది. అయితే పీక్ లెవెల్స్ దగ్గర వచ్చిన సెల్లింగ్ ప్రెషర్‌తో నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌ మాత్రం పావు శాతం నష్టపోయింది.

చివరకు జెఎస్‌డబ్ల్యు స్టీల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సన్ ఫార్మా స్టాక్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. భారతి ఇన్ఫ్రాటెల్, హీరోమోటోకార్ప్, హెచ్ డి ఎఫ్ సి, హెచ్ సి ఎల్ టెక్, ఎస్బీఐ స్టాక్స్ టాప్ 5 లూజర్స్ జాబితాలో చేరాయి.


మెటల్ షేర్లలో లాభాలు

గత రెండు మూడు వారాల నుంచి నీరసంగా ఉన్న మెటల్ రంగ షేర్లలో యాక్టివిటీ మొదలైంది. ఇంట్రాడేలో మెటల్ స్టాక్స్ మెరుపులు మెరిపించాయి. జిందాల్ స్టీల్స్ 10 శాతం, సెయిల్-హింద్ కాపర్-జిందాల్ హిసార్-జెఎస్‌డబ్ల్యు స్టీల్ స్టాక్స్ 5 శాతం వరకూ లాభపడ్డాయి. ఈ ప్యాక్‌లో నాల్కో ఒక్కటే మూడు శాతానికి పైగా నష్టపోయింది. మిగిలిన స్టాక్స్ అన్నీ పాజిటివ్‌గానే క్లోజయ్యాయి.

హెగ్‌ స్టాక్‌ యూ టర్న్

గ్రాఫైట్ సంబంధ స్టాక్స్ కొన్ని రోజుల నుంచి అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు
కూడా ఇంట్రాడేలో అలాంటి ఒత్తిడే నమోదైంది. ఇంట్రాడేలో హెచ్ ఈ జీ స్టాక్ రూ.2025 స్థాయి వరకూ పడిపోయింది. అయితే మెరుగైన రిజల్ట్స్ ప్రకటించిన నేపధ్యంలో స్టాక్ రివర్స్ ట్రెండ్ తీసుకుంది. ఒక దశలో నష్టాలన్నింటినీ పూడ్చుకుని 10 శాతం అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయి రూ.2432 వరకూ వెళ్లింది. చివరకు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పటికీ 9 శాతం లాభాలతో రూ.2403 దగ్గర క్లోజైంది. అయితే ఇదే కోవలో ఉన్న గ్రాఫైట్ ఇండియా మాత్రం ఇంట్రాడేలో రూ.395 వరకూ పడిపోయి ఆఖర్లో కోలుకుని రూ.422లో ముగిసింది. 3 శాతం కోల్పోయింది.


క్యాన్‌ఫిన్, సువెన్‌లో లాభాలు

ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్న క్యాన్‌ఫిన్ హోమ్స్ స్టాక్ ఈ రోజు అనూహ్యంగా లాభపడింది. ఏకంగా 10 శాతానికి పైగా పెరిగి ఆశ్చర్యపరిచింది. చివరకు రూ.264 దగ్గర క్లోజైంది. ఇదే ఫీల్డ్‌లో ఉన్న పీఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ హోం ఫైనాన్స్ మాత్రం ఐదు శాతం వరకూ నికరంగా నష్టపోయాయి.

ఫార్మా సంస్థ సువెన్ లైఫ్ కూడా కొద్ది రోజుల నుంచి యాక్టివ్‌గా ట్రేడవుతోంది. క్రామ్స్ బిజినెస్‌ను వేరు చేసి ప్రత్యేకంగా లిస్ట్ చేయాలి అనుకుంటున్నప్పటి నుంచి స్టాక్ వేగం పుంజుకుంది. ఇంట్రాడేలో ఈ స్టాక్ రూ. 236 వరకూ పెరిగింది.

52 వారాల కనిష్టానికి సుమారు 300 స్టాక్స్

మార్కెట్లలో తక్కువ నష్టాలే కనిపిస్తున్నప్పటికీ మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో మాత్రం ట్రెండ్ బలహీనంగా ఉంది. 287 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిల్లో బటర్‌ఫ్లై గంధిమతి, సెరా శానిటరీ, ఎల్టీ ఫుడ్స్, గతి, ఫినోలెక్స్ కేబుల్స్, ఐఎఫ్‌బి ఆగ్రో, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, మంగళం డ్రగ్స్, నెట్వర్క్ 18, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, నవభారత్ వెంచర్స్, టాటా కెమికల్స్, వీల్స్ ఇండియా వంటి సంస్థలు ఉన్నాయి.

Read more about: stock markets sensex nifty
English summary

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్, సెన్సెక్స్ 250 పాయింట్స్ డౌన్ | Today Market Closing

For the third consecutive day markets end in a week note. Sensex ends over 240 points lower and Nifty is below 10,850 points mark.
Story first published: Tuesday, February 12, 2019, 17:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X