For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో బంగారానికి సంబంధించి కొత్త విధానం.

మన దేశంలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది,చాల మంది ప్రజలు బంగారం పై మొక్కువ చూపుతారు అలాగే బంగారంపై పెట్టుబడులు ఎంతో సురక్షితం అని భావిస్తారు.

By bharath
|

మన దేశంలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది,చాల మంది ప్రజలు బంగారం పై మొక్కువ చూపుతారు అలాగే బంగారంపై పెట్టుబడులు ఎంతో సురక్షితం అని భావిస్తారు.ప్రస్తుతం మన దేశంలో బంగారం ఎగుమతులు అలాగే దిగుమతులపై అనేక ఆంక్షలు ఉన్నాయి మరియు అక్రమాలు కూడా పెద్దఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటి పరిష్కారం కోసం ఒక ప్రత్యేక పుత్తడి ఎక్స్చేంజి విధానాన్ని త్వరలో అమలుచేయనుంది.

త్వరలో బంగారానికి సంబంధించి కొత్త విధానం.

ఈ విధానాన్ని అతి త్వరలో అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది,దీని కి గాను వివిధ మంత్రిత్వ శాఖల పరిశీలనకు ముసాయిదా విధానాన్ని సమర్పించారు.బంగారానికి సంబంధించి ఎంతో కాలంగా ఒక ప్రత్యేక విధానాన్ని తేవాలని కోరినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి పరిష్కారం రాలేదు ఐతే ఇటీవలే అరుణ్ జెట్లీ మాట్లాడుతూ బంగారరాన్ని ఒక ప్రత్యేక తరగతికి చెందిన ఆస్తిగా అభివృద్ధి చేసేలా సమగ్ర విధానం తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు.

సమగ్ర విధానం అంటే ఏమిటి?

మన దేశంలో బంగారం కొనుగోళ్లు,దిగుమతులు రోజురోజుకు పెరుగుతూనే ఉంది,ప్రస్తుతం చైనా తో పాటు పోటీపడుతోంది దింతో ఒక్కసారిగా కరెంటు ఖాతా లోటు పెరిగిపోతున్న నేపథ్యంలో దీన్ని తగ్గించడానికి పసిడి దిగుమతులపై దిగుమతి సుంకాన్ని పెంచేస్తోంది.గతంలో మూడు శాతంగా ఉన్న దిగుమతి సుంకం ప్రస్తుతం 10 శాతం చేసింది.అంతేకాకుండా,దేశీయంగా పసిడి కొనుగోళ్లపై మూడు శతం GST,ఆభరణాల ఎగుమతులపై మూడు శాతం IGST ని మోపింది.దింతో కొందరు అడ్డదారుల్లో అక్రమంగా బంగారాన్ని దేశంలోకి తరలిస్తున్నారు.సమగ్ర పసిడి విధానం వలన దిగుమతులతో పాటు,అక్రమ దిగుమతులకు అడ్డుకట్ట వేయచ్చని పరిశ్రమ వర్గాల అంచనా.

సురక్షిత పెట్టుబడులు:
ప్రస్తుతం మన దేశంలో చాల మంది పెట్టుబడి లాభాల కోసం బంగారాన్ని అధిక మొత్తం లో కొనుగోలు చేస్తారు,విదేశాల్లో ఐతే బంగారం కొనే వారిలో ఎక్కువ శాతం మంది కాగిత రహితంగా డీమ్యాట్ రూపఎంతో ఉండే గోల్డ్ ఈటిఎఫ్ లు లేదా బాండ్స్ రూపంలో కొనుగోలు చేస్తుంటారు.ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ రెండు విధానాలు అందుబాటులో ఉన్నాయి ఐతే పలు కారణాల వల్ల ఇవి ఆశించినంత ఫలితాలు రాలేదు.సమగ్ర పసిడి విధానం ద్వారా మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించి పేపర్ రహిత డీమ్యాట్ గోల్డ్ పెట్టుబడులను అభివృద్ధి చేయవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా.

ఎగుమతులు:
మన దేస్ధా ఎగుమతుల్లో 15 శాతం వాటా బంగారానికి మరియు ఇతర విలువైన రాళ్లతో తాయారు చేసిన నగలకు ఉంది,వీటికోసం దిగుమతి చేసుకునే దిగుమతులపై అనేక ఆంక్షలు ఉన్నాయి దీనివల్ల ఎగుమతిదారులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఐతే సమగ్ర పసిడి విధానం ద్వారా వీటికి పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు.

పరిశ్రమ వర్గాల నుండి కొన్ని ముఖ్య సూచనలు:
బంగారం సరఫరా పెంచందుకు స్పాట్ ఎక్స్చేంజి లు ఏర్పాటు చేయాలి.
ఎగుమతులపై 3 శాతం GST ని పూర్తిగా ఎత్తివేయాలి.
GST ని ప్రస్తుత 3 శాతం నుండి మరింత తగ్గించాలి.
బ్యాంకింగ్ రంగంలో 'బులియన్ బ్యాంకింగ్' ను అనుమతించాలి.
దిగుమతి సుఖాన్ని ప్రస్తుత 10 శాతం నుండి నాలుగు శాతానికి తగ్గించాలి.

Read more about: gold
English summary

త్వరలో బంగారానికి సంబంధించి కొత్త విధానం. | A New Approach To Gold Soon. Arun Jaitley

Gold has a special importance in our country,many people like to invest on gold.
Story first published: Tuesday, February 12, 2019, 13:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X