For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాలతోనే వారం ప్రారంభం: 150 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

|

స్టాక్ మార్కెట్ గత వారం ఆఖరి ట్రెండ్‌నే ఇంకా కొనసాగిస్తోంది. ఈ వారం
మొదటి రోజు కూడా నష్టాలతోనే బేరం మొదలుపెట్టింది. ఐటి మినహా అన్ని రంగాల షేర్లూ నష్టాల్లోనే కొనసాగాయి. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌కు ఎక్కడా
కొనుగోళ్ల మద్దతు కనిపించకపోవడం కూడా ట్రెండ్‌ను బలహీన పర్చింది.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నిరుత్సాహక సంకేతాలతో 10931 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ మళ్లీ ఏ దశలోనూ ఆ స్థాయికి రాలేదు. సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ కావడంతో ఒక దశలో 10857 పాయింట్ల కనిష్ట
స్థాయికి పడిపోయింది. మళ్లీ ఆఖర్లో తేరుకునే ప్రయత్నం నిఫ్టీ
చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. బేర్స్ ధాటిని బుల్స్
నీరసించాయి. చివరకు కొద్దిగా కోలుకుని 55 పాయింట్ల నష్టంతో 10889 దగ్గర
నిఫ్టీ క్లోజైంది. సెన్సెక్స్ 151 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయాయి.

టాటా స్టీల్, సిప్లా, ఐఓసి, టాటా మోటార్స్, హెచ్ సి ఎల్ టెక్ స్టాక్స్ టాప్ 5
గెయినర్స్‌గా నిలిచాయి. డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా, ఓఎన్జీసీ, హిందాల్సో, అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్స్ లూజర్స్‌గా మిగిలాయి.

52 వారాల కనిష్టానికి 350 స్టాక్స్

దీన్ని బట్టి ట్రెండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోసారి 10900 పాయింట్ల మార్కు దిగువన నిఫ్టీ ముగియడాన్ని బట్టి చూస్తే.. షార్ట్ టర్మ్ వీక్‌నెస్ మరింత కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన స్టాక్స్ కూడా ఈ పతనం దెబ్బకు విలవిలలాడుతున్నాయి. ఈ రోజు ట్రేడ్‌లో అపెక్స్
ఫ్రోజెన్, బామర్ లౌరీ, కోల్ ఇండియా, సెరీ శానిటరీ, జనరల్
ఇన్సూరెన్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐజి పెట్రో, ఐఎఫ్‌బి
ఇండస్ట్రీస్, లారస్ ల్యాబ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎంఆర్ఎఫ్,
నవభారత్ వెంచర్స్, నోసిల్, టాటా కెమికల్స్, తిరుమలై కెమికల్స్, విశాకా
ఇండస్ట్రీస్, వీఎస్టీ టిల్లర్స్ వంటి స్టాక్స్‌ ఉన్నాయి. ఇందులో చాలా వరకూ
క్వాలిటీ నేమ్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఫండమెంటల్స్ మెరుగ్గా ఉన్న సంస్థలు కూడా ఈ పతనానికి కుప్పకూలుతున్నాయి.

కొద్దిగా తేరుకున్నాయ్

గత రెండు వారాలుగా భారీగా పడిన స్టాక్స్ ఈ రోజు కాస్త తేరుకున్నాయి. వాటిల్లో దిలీప్ బిల్డ్‌కాన్, బాల్‌క్రిష్ణ ఇండస్ట్రీస్, శంకర బిల్డ్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ డిఫెన్స్, అజంతా ఫార్మా వంటివి ఉన్నాయి.
ఇవన్నీ కనీసం 5 శాతానికి తక్కువ లేకుండా లాభపడ్డాయి. ఓవర్ సోల్డ్
జోన్‌లో ఉన్న ఈ స్టాక్స్‌లో కొద్దిగా మూమెంట్ ఉంది కానీ.. ఇది వీటినుంచి బయటపడేందుకే రైట్ టైమ్ అంటున్నారు ఎనలిస్టులు. ఒక వేళ
ఎక్స్‌ట్రీమ్ లాంగ్ టర్మ్ ఆలోచన ఉంటేనే వీటి గురించి ఆలోచించవచ్చని
సూచిస్తున్నారు.

డా.రెడ్టీస్, ఎం అండ్ ఎంకు నష్టాలే నష్టాలు

డాక్టర్ రెడ్డీస్‌కు చెందిన బాచుపల్లి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ -3ను పరిశీలించిన యూఎస్ ఎఫ్‌డిఏ కొన్ని అభ్యంతరాలను లేవనెత్తింది. దీనిపై 11 అబ్జర్వేషన్స్‌తో ఫార్మ్ 483 జారీ చేసింది. దీంతో ఈ స్టాక్ ఏకంగా 6.5 శాతం వరకూ పడిపోయింది. చివరకు 5.6 శాతం నష్టంతో రూ.2617 దగ్గర
క్లోజైంది.

ఇక ట్రాక్టర్ గైడెన్స్‌ను తగ్గించడంతో మహీంద్రా స్టాక్ కూడా అమ్మకాల
ఒత్తిడికి లోనైంది. ఈ స్టాక్ ఇంట్రాడేలో రూ.644 వరకూ తగ్గింది. చివరకు 5.3
శాతం కోల్పోయి రూ.647 దగ్గర ముగిసింది.

ఇదే బాటలో వివిధ వార్తల నేపధ్యంలో ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ 5 శాతం,
ఇన్ఫోఎడ్జ్, అశోక్ లేల్యాండ్, ఇంద్రప్రస్థ గ్యాస్ వంటి స్టాక్స్ 5 శాతం వరకూ కోల్పోయాయి.

గ్రాఫైట్ స్టాక్స్ అవుట్

ప్రమోటర్‌కు చెందిన షేర్లలో మరో 5 శాతం తాజాగా తాకట్టు పెట్టినట్టు
వార్తలు రావడంతో అపోలో హాస్పిటల్స్ స్టాక్ మూడు, నాలుగు నెలల కనిష్టానికి దిగొచ్చింది. ఇంట్రాడేలో ఈ స్టాక్ రూ.1092 స్థాయికి దిగొచ్చింది. చివరకు 11 శాతం లాస్‌తో రూ.1125 దగ్గర క్లోజైంది.

గ్రాఫైట్‌కు డిమాండ్ అనూహ్యంగా తగ్గిపోవచ్చనే వార్తల నేపధ్యంలో ఇదే
ఫీల్డ్‌లో ఉన్న గ్రాఫైట్ 10 శాతం, హెచ్ ఈ జీ 7 శాతం వరకూ పడిపోయాయి. ఈ ఊపు చేస్తే గ్రాఫైట్ రూ.400 దిగువకు రావడం పెద్ద కష్టం
కాదనిపిస్తోంది.

Sensex drops nearly 150 points, Nifty slips below 10,900; DRL tanks

ఇదే బాటలో నాల్కో, ఐబి వెంచర్స్, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ స్టాక్స్
కూడా పది శాతం వరకూ పతనమయ్యాయి.

థైరోకేర్ డౌన్

నిరుత్సాహక త్రైమాసిక ఫలితాల నేపధ్యంలో థైరోకేర్ టెక్నాలజీస్ స్టాక్ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ పెద్దగా కనపడని విధంగా పడింది. ఏకంగా 11 శాతం కోల్పోయి రూ.490 దగ్గర క్లోజైంది. ఒక్కో క్వార్టర్ కాస్త బలహీనంగా
ఉన్నప్పటికీ ఓర్పుగా ఉండాలని యాజమాన్యం కోరినప్పటికీ స్టాక్స్‌ను
తెగనమ్మారు. ఇదే రూట్‌లో ఓరియంటల్ కార్బన్, రెయిన్ ఇండస్ట్రీస్, అడ్వాన్స్డ్ ఎంజైమ్స్, హెస్టర్ బయో, జెట్ ఎయిర్, టెక్స్‌మాకో
రైల్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ 5 శాతానికి తక్కువ లేకుండా పతనం కావడం సెల్లింగ్ ప్రెషర్‌ను సూచిస్తోంది.

రేపు ఎలా

మంగళవారం కూడా ట్రెండ్ ఇలానే బలహీనంగానే ఉండే అవకాశాలున్నాయి. నిఫ్టీ మరోసారి 10900 పాయింట్ల దిగువన ముగియడం దీన్నే సూచిస్తోంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగాఉండొచ్చు.

English summary

నష్టాలతోనే వారం ప్రారంభం: 150 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ | Sensex drops nearly 150 points, Nifty slips below 10,900; DRL tanks 3%

Benchmark indices opened on a weak note on Monday, tracking tepid cues from other Asian markets. Weak technical charts added to the weakness.
Story first published: Monday, February 11, 2019, 19:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X