For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్బీఐ వద్ద ఉన్న రూ.27,380 కోట్లు తమకు బదలాయించాలని కోరిన కేంద్రం

|

న్యూఢిల్లీ: ఏవైనా అనుకోని ఆర్థిక ఇబ్బందులు వంటివి తలెత్తితే వినియోగించేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న రూ.27,380 కోట్లు తమకు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం.. ఆర్బీఐని కోరింది. 2016-17 సంవత్సరానికి రూ.13,190 కోట్లను, 2017-18లో రూ.14,190 కోట్లను ఆర్‌బీఐ రిస్క్‌ అండ్‌ రిజర్వ్ ఫండ్‌ కింద పక్కన పెట్టింది.

గత ఏడాది రిజర్వ్‌లను దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ మిగులును కేంద్రానికి బదలాయించాలని ఆర్థిక శాఖ కోరింది. అంతకుముందు ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.28వేల కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఆశిస్తోందని తెలిపారు.

Finance Ministry seeks transfer of Rs 27,380 cr from RBI retained towards risks, reserves

ఆర్బీఐ ఆర్థిక సంవత్సరం జులై-జూన్‌ మధ్య ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికే రూ.40వేల కోట్లను ప్రభుత్వానికి బదలీ చేసింది. ఒకవేళ తాజాగా ప్రభుత్వం కోరిన మొత్తాన్ని కూడా ఆర్బీఐ బదలాయిస్తే ఆ మొత్తం రూ.68వేల కోట్లకు చేరుతుంది.

English summary

ఆర్బీఐ వద్ద ఉన్న రూ.27,380 కోట్లు తమకు బదలాయించాలని కోరిన కేంద్రం | Finance Ministry seeks transfer of Rs 27,380 cr from RBI retained towards risks, reserves

The finance ministry has sought from the Reserve Bank of India (RBI) Rs 27,380 crore that was withheld by the central bank towards risks and reserves in the previous years, said sources.
Story first published: Sunday, February 10, 2019, 17:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X