For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారా.. ? మీరు ఇంత ట్యాక్స్ కట్టాలి?

|

ఈ రోజుల్లో యూట్యూబ్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి రిటైర్డ్ జనాల వరకూ చాలామంది ఇప్పుడు దీన్నో హాబీ, మంచి ఇన్‌కం సోర్స్‌లా భావిస్తున్నారు. అందుకే ఇబ్బడి ముబ్బడిగా దేశంలో యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. ఇంకొంత మంది వీడియో బ్లాగింగ్ ద్వారా కూడా యూట్యూబ్ నుంచి డబ్బులు

పొందుతున్నారు. కెమెరాలు కొనుక్కుని వీడియోలు షూట్ చేయడం, ఇంకొందరు మొబైల్ ఫోన్ల ద్వారా వీడియోస్ షూట్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి ఆదాయాన్ని పొందుతున్నారు. హౌస్ వైఫ్స్ కూడా వంటల ప్రోగ్రామ్స్ పెట్టి కాస్తా కూస్తో వెనకేసుకుంటున్నారు. అయితే ఇలా సంపాదించిన సొమ్ముకు ట్యాక్స్ కట్టాలని మనలో ఎంత మందికి తెలుసు ?

ఫ్యాషన్ టిప్స్, మూవీ రివ్యూస్, బుక్ రివ్యూస్, కుకరీ, మూవీ క్లిప్స్, పొలిటికల్ సెటైర్స్, కామెడీ స్కిట్స్, ట్రావెలాగ్స్ రూపంలో వీడియోస్ పెట్టే వాళ్లకుయూ ట్యూబ్‌లో మంచి హిట్స్ వస్తున్నాయి. ఇందుకు యూట్యూబ్ సంస్థ కూడా వాళ్లకు డబ్బులు చెల్లిస్తోంది. కొంత మంది సిఎంఎస్‌ను అప్రోచ్ అయితే, ఇంకొంతమంది గూగుల్ యాడ్స్‌ను నమ్ముకున్నారు. రూపం ఏదైనా ఆదాయం వస్తోంది కాబట్టి దీనికి ట్యాక్స్ చెల్లించాలి, అయితే ఇక్కడ మనం పెట్టిన ఖర్చులకు కూడా క్లైం చేసుకోవచ్చు.

యూట్యూబ్ ఎంత డబ్బిస్తుంది

ఇక్కడ వయస్సుతో ఏ మాత్రం సంబంధం లేదు. చిన్న పిల్లలు కూడా డబ్బులు సంపాదించవచ్చు. దీనికి కావాల్సిందల్లా ఓ కెమెరా.. అవసరమైతే ఎడిటింగ్‌ కోసం ఓ కంప్యూటర్. ఇంకొందరు మొబైల్స్‌లో కూడా షూట్
చేసి వీడియోస్ అప్ లోడ్ చేస్తున్నారు. పార్ట్ టైంలో కొందరు, ఫుల్ టైంగా
కొందరు దీన్నో బిజినెస్‌లా చూస్తున్నారు.

1. రీచ్, వ్యూస్, కామెంట్స్ ఆధారంగా ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్ నేపధ్యంలో యూట్యూబ్ డబ్బులిస్తుంది.

2. యూట్యూబ్ యాడ్స్

3. వీడియో మేకింగ్, డిజైనింగ్, ఆప్టిమైజేషన్ కన్సల్టెన్సీ సేవలకు డబ్బులు

4. అఫ్లియేట్ సేల్స్ సహా ఇతర ఫ్రీలాన్స్ సేవలకూ యూట్యూబ్ డబ్బులు
చెల్లిస్తుంది.

ట్యాక్స్ ఎలా?

ఒక వేళ మీరు కంపెనీ, ఎల్ఎల్‌పి కింద రిజిస్టర్ కాకపోతే మిమ్మల్ని సోల్
ప్రొపైటర్‌షిప్‌ కింద ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. ఇక్కడ యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వ్యక్తిగత ఆదాయం కింద కాకుండా బిజినెస్ ఇన్‌కంకింద పరిగణిస్తారు.

Earn Money With YouTube

ఆదాయం ఏడాదికి కోటి దాటితే.. !

సర్వీస్ రంగం ద్వారా డబ్బులు ఆర్జిస్తారు కాబట్టి ఐటి యాక్ట్ 1961కింద
కొన్ని ప్రొవిజన్స్ మీరు వినియోగించుకోవచ్చు. ఒక వేళ యూట్యూబ్ ద్వారా మీకు ఏడాదికి రూ. 1 కోటి కంటే ఎక్కువ లభిస్తే అప్పుడు మీరు సెక్షన్ 44AB కింద ట్యాక్స్ ఆడిట్ పరిధిలోకి వస్తారు. దీనికి అదనంగా టిడిఎస్ కూడా వాళ్లు కట్ చేయొచ్చు. ఒక వేళ టిడిఎస్ కింద యూట్యూబ్ లేదా మీ
సీఎంఎస్ వాళ్లు కట్ చేస్తే..దాన్ని 26AS సెక్షన్ కింద మీరు ఆన్ లైన్‌లోనే
పొందొచ్చు. మీకు అధిక ఆదాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా అకౌంట్ పుస్తకాలు నిర్వాహణ కూడా చేపట్టాలి. దాన్ని ఛార్టెడ్ అకౌంటెంట్ చేత ఆడిట్ కూడా చేయించాల్సి ఉంటుంది. మీ వ్యాపార నిర్వాహణకు
అవసరమైన ఖర్చులను కూడా అందులో చూపించవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ కనెక్షన్, స్టాఫ్, కంప్యూటర్, కెమెరా, ఎడిటింగ్ వంటి వాటికి మీరు బిల్స్ క్లైం చేసుకోవచ్చు. అంతే కాకుండా డిప్రిసియేషన్ కూడా
చూపించవచ్చు. అడ్వాన్స్ ట్యాక్స్ కూడా చెల్లించాలి. మరింత సమాచారం కోసం మీ సీఎంఎస్ వాళ్లను కూడా కాంటాక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ల
వ్యాపారం కోటిపైనే ఉంటుంది కాబట్టి వాళ్లకు ఒక వేళ టీడీఎస్ కట్ అయితే
మీకు కూడా వాళ్లు కట్ చేయొచ్చు. అప్పుడు దాన్ని మీ ప్యాన్ నెంబర్ పై జమ చేశారా లేదా అనే విషయాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోండి.

ఆదాయం కోటి కంటే తక్కువుంటే... !

ఒక వేళ మీ వార్షిక ఆదాయం కోటి రూపాయల కంటే తక్కువగా ఉంటే మీకు సాధారణ ట్యాక్స్ ప్రొవిజన్స్ వర్తిస్తాయి. జీతానికి తోడు ఈ డబ్బు అదనంగా వస్తోంటే.. దీన్ని కూడా మీరు రిటర్న్స్‌లో చూపించాల్సి ఉంటుంది.వచ్చే ఆదాయానికి పన్ను కట్టాలి. ప్రతీ ఏటా జూలై 31వ తేదీలోగా రిటర్న్స్ ఫైల్ చేయాలి. మీ సీఏను సంప్రదించి మీరు పెట్టే ఖర్చుల జాబితా తయారు చేయించుకోండి. బుక్స్ మెయింటైన్ చేయండి. ఎప్పుడైనా ఐటీ అధికారులు అడిగినప్పుడు సమాధానం చెప్పేలా అకౌంట్స్ అన్నీ
పక్కాగా నిర్వహించుకోండి. మీ వ్యాపార నిర్వాహణకు మీరు పెట్టే ఖర్చులకు గాను రిసీప్ట్స్ తీసుకోండి.

English summary

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారా.. ? మీరు ఇంత ట్యాక్స్ కట్టాలి? | Earn Money With YouTube

Connect your YouTube channel to an AdSense account in order to earn money and get paid for your monetized videos.
Story first published: Friday, February 8, 2019, 18:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X