రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ గురువారం తన నిర్ణయాన్ని వెలువరించబోతోంది. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఊహాగానాలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అలాంటివేమీ ఉండకపోవచ్చని భావిస్తున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ గురువారం తన నిర్ణయాన్ని వెలువరించబోతోంది. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఊహాగానాలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అలాంటివేమీ ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతీ సమీక్షకూ రెండు రోజులే భేటీ అయ్యే మానిటరీ కమిటీ ఈ సారి మాత్రం మూడో రోజు కూడా కలుస్తోంది. గురువారం ఉదయం 11 గంటలకు కమిటీ సభ్యుల మెజార్టీ నిర్ణయం తెలుస్తుంది.

ఎన్నికల నేపధ్యంలో...
బ్యూరోక్రాట్ అయిన శక్తికాంతదాస్ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలను తీసుకోవచ్చనే మాట ఉంది. ఎందుకంటే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలోవడ్డీ రేట్ల తగ్గింపు ఉంటే కొద్దిగా పాజిటివ్ కావొచ్చు. గతంలో దువ్వూరి సుబ్బారావు ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నప్పుడు కూడా 2008-2009 మధ్య 4 శాతం వరకూ వరుస దఫాల్లో వడ్డీ రేట్లను కుదించారు. కొత్త గవర్నర్ కూడా ఐఏఎస్ అధికారి కావడం వల్ల ప్రభుత్వం స్టాండ్‌కు తగ్గట్టు నిర్ణయాలు వెలువడవచ్చు. అయితే మానిటరీ పాలసీలో సభ్యుల మెజార్టీ నిర్ణయమే కాబట్టి అందుకు తగ్గట్టే స్టాండ్ తీసుకోవచ్చు.
అన్నీ సానుకూలమే..
ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులో ఉంది, ద్రవ్యలోటు కట్టతప్పలేదు.. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కొద్దిగా ఉంది. క్రూడ్ స్థిరంగా ఉన్నప్పటికీ, రూపాయి మాత్రం డాలర్‌తో పోలిస్తే బలహీనంగానే ఉంది. 2018లో రూపాయి 8.5 శాతం క్షీణించింది.
వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతానికి శక్తికాంతదాస్ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆస్కారం ఉంది. అయితే ఈ పాలసీకి ఆగినా.. మరో మీటింగ్‌లో అయినా పావు శాతం వరకూ కోత ఉండొచ్చు.


Click it and Unblock the Notifications