ఈ ఎండాకాలంలో సమ్మర్ సీజన్ హాలిడేను క్యాష్ చేసుకునేందుకు స్పైస్ జెట్ ఎగ్జైటింగ్ ఆఫర్‌ను ప్రకటించింది.
ఈ ఎండాకాలంలో సమ్మర్ సీజన్ హాలిడేను క్యాష్ చేసుకునేందుకు స్పైస్ జెట్ ఎగ్జైటింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. నాలుగు రోజుల పాటు ఉండే ఆఫర్‌లో ప్రయాణీకులు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్లలో తక్కువ ధరకు విమాన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. దగ్గర్లో ఉన్న కొన్ని రూట్లలో ఆల్ ఇన్‌క్లూజివ్ (అన్నీ కలిసి) రూ.899కే ప్రయాణించే వీలుందని స్పైస్ జెట్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

దేశంలో గంటలోపు ప్రయాణం ఉన్న రూట్లలో కిలోమీటర్‌కు రూ.1.75 మాత్రమే ఛార్జ్ చేయబోతున్నట్టు ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 25,2019 వరకూ ప్రయాణించేందుకు వీలుగా ఉన్న ఈ ఆఫర్‌లో ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్డ్ కింద టికెట్స్ ఇస్తామని తెలిపింది.
ఏ ఏ రూట్లలో ఎలాంటి ఆపర్స్
ఢిల్లీ - కొయంబత్తూర్ రూ. 2899, ముంబై - కొచి రూ.1849 వంటి ప్రైసింగ్‌తో టికెట్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఢిల్లీ - గౌహతి రూ.2499, బెంగళూరు - ఢిల్లీ రూ.2649 కూడా టికెట్స్ ఉన్నాయి.
ఇక గంటకంటే తక్కువ జర్నీ ఉన్న రూట్లు అయిన జమ్మూ- శ్రీనగర్, చెన్నై - బెంగళూరు, కోచి - బెంగళూరు, హూబ్లి - బెంగళూరు రూట్లలో ప్రయాణించేందుకు అన్నీ కలిసి రూ.899లోపే ప్రయాణించే వీలుంది.
ఇక హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రూ.2900, ముంబైకి రూ.1900, విశాఖకు రూ.1800లో వెళ్లేందుకు అవకాశాలున్నాయి. అలానే బ్యాంకాక్‌కు రూ.6000 వరకూ టికెట్ రేట్స్ ఉన్నాయి.
విదేశీ రూట్లలో
కోల్‌కతా - ఢాకా, మధురై - దుబాయ్ రూట్లలో ఒన్ టైం ఫేర్ రూ.3699 లోపే అందుబాటులోకి రాబోతున్నాయి.
ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు ఈ ఆఫర్ కింద టికెట్స్‌ను స్పైస్ జెట్‌లో బుక్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications