ప్రముఖ వస్త్ర బ్రాండ్ రీడ్ అండ్ టేలర్ దివాలా తీసేసింది. సంస్థను లిక్విడేట్ చేయాలంటూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖ వస్త్ర బ్రాండ్ రీడ్ అండ్ టేలర్ దివాలా తీసేసింది. సంస్థను లిక్విడేట్ చేయాలంటూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన సంస్థ ప్రమోటర్లు ఎవరూ అప్పులు తీర్చే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అంతేకాకుండా సంస్థను నిలబెట్టుకోవాలనే ఉద్దేశం లేదని ట్రైబ్యునల్ భావించింది. దీంతో జడ్జలు భాస్కర మోహన్, నల్లసేనాపతి దివాలా ప్రక్రియను ఆదేశించారు.

రీడ్ అండ్ టేలర్ ఇన్వెస్టర్లు కోర్టు ముందు తమ నెట్‌వర్త్‌ను ప్రూవ్ చేసుకోవడంలో విఫలమయ్యారని, ఇక బెంచ్ ముందు ఎలాంటి ఆప్షన్ లేకపోవడం వల్లే ఆస్తుల అమ్మకానికి అనుమతులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.
ఎన్.సి.ఎల్.టి.లో గత తొమ్మిది నెలల నుంచి ఈ కేస్ కొనసాగుతోంది. ఈ సంస్థను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రుణగ్రహీతలు, రెజల్యూషన్ ప్రొఫెషనల్‌తో కలిసి దివాలా ప్రక్రియను వేగవంతం చేశారు.
ఎస్పీజీపీ గ్రూప్‌తో కలిసి రీడ్ అండ్ టేలర్ ఉద్యోగుల సంఘం, సీఎఫ్ఎం అసెట్ రీకన్‌స్ట్రక్షన్, ఇండియన్ గ్యాస్ సంస్థలు రీడ్ అండ్ టేలర్ కొనుగోలుకు ఉత్సాహం చూపించారు. అయితే ఎవరూ నెట్వర్త్‌ను ప్రూవ్ చేసుకోలేదు.
ప్రమోటరే దొడ్డిదారిలో..
రీడ్ అండ్ టేలర్ ప్రమోటర్ అయిన నితిన్ కస్లీవాల్‌పైనా అనేక ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది ఉద్యోగులతో కలిసి ఆయనే బిడ్లు దాఖలు చేయిస్తున్నారని, తక్కువ ధరకు మళ్లీ కంపెనీని చేజిక్కించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆయనను బ్యాంకులన్నీ విల్‌ఫుల్ డిఫాల్టర్(ఉద్దేశపూర్వక ఎగవేతదారు)గా ప్రకటించాయి. నేరుగా ఆయన బిడ్స్ దాఖలు చేసేందుకు అవకాశం లేకపోవడం ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కంపెనీని అప్పుల పాలు జేసి ఇప్పుడు తక్కువ ధరకు సంస్థను తీసుకునేందుకు పావులు కదపడాన్ని రిసొల్యూషన్ టీం తప్పుబడ్తోంది.
ఇప్పుడేంటి
ప్రస్తుతం రీడ్ అండ్ టేలర్ లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. వాళ్లకు ఉన్న ఆస్తులేంటి, వాటిని ఏ రేట్‌కు ఎలా విక్రయించాలి, ఎవరు ముందుకొచ్చారు అనే అంశాలపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం రీడ్ అండ్ టేలర్ ఎడిల్వైజ్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి రూ.4100 కోట్లు బకాయి పడింది. భరత్ పటేల్‌కు చెందిన ఫిన్ క్వెస్ట్ అనే మరో ఎన్.బి.ఎఫ్.సి.కి కూడా రూ. 800 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఫిన్ క్వెస్ట్ సంస్థ మరికొంత మొత్తాన్ని తాజాగా ఇన్వెస్ట్ చేసి రీడ్ అండ్ టేలర్‌కు పూర్వవైభవం తెచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా ఎన్.సి.ఎల్.టి. ఇచ్చిన తీర్పు నేపధ్యంలో మరోసారి రివైవల్‌కు అవకాశం చిక్కింది.


Click it and Unblock the Notifications