For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నామరూపాలు లేకుండా పోయిన 'నానో' కార్?

టాటా మోటర్స్ భారతదేశంలో అత్యంత సరసమైన కార్లను విడుదల చేసింది.దాదాపు 10 సంవత్సరాల క్రితం టాటా మోటర్స్ చైర్మన్ రతన్ టాటా కళల కారు నానో ఆవిష్కరించబడింది.

By bharath
|

టాటా మోటర్స్ భారతదేశంలో అత్యంత సరసమైన కార్లను విడుదల చేసింది.దాదాపు 10 సంవత్సరాల క్రితం టాటా మోటర్స్ చైర్మన్ రతన్ టాటా కళల కారు నానో ఆవిష్కరించబడింది.ఒక నివేదిక ప్రకారం,కార్ల విక్రయాలు తగ్గడం ఫలితంగా నానో ఉత్పత్తిని నిలిపివేసిందన్నారు.

గత ఏడాది

గత ఏడాది

గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ 83 నానో కార్లు ఉత్పత్తి చేసి అందులో 62 కార్లను విక్రయించిందని టాటా మోటార్స్ సంస్థ మంగళవారం రెగ్యూలేటరీ సంస్థకు ఈ విషయం తెలిపింది.నిజానికి వచ్చే ఏడాది నుండి కార్ల ఉత్పత్తిని నిలిపివేయాలని సంస్థ నిర్ణయించింది.

టాటా మోటార్స్ నానో ఎగుమతుల్లో కూడా ఆశించని ఫలితాలు రాలేదు . అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 25 యూనిట్లు ఎగుమతి చేసిందన్నారు.

నానో ఉత్పత్తిని

నానో ఉత్పత్తిని

నానో ఉత్పత్తిని నిలిపివేయడానికి కంపెనీ నిర్ణయం తీసుకున్నారా అనే అంశంపై టాటా మోటార్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ప్రస్తుత ఉన్న నానో వెర్షన్ 2019 దాటి కొనసాగించలేమని,కొత్తగా అమల్లోకి వస్తున్న బీఎస్-6 ప్రామాణిక కాలుష్య నిబంధనలు,భద్రతా నిబంధనలకు అనుగుణంగా లేదు.వాటికి అనుగుణంగా తీర్చిదిద్దాలంటే మరింత ఖర్చు చెయ్యాల్సి ఉంది.దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

జనవరి 2008 లో

జనవరి 2008 లో

జనవరి 2008 లో ఆటో ఎక్స్పోలో ప్రజల కారుగా ఎన్నో ఆశలు పెట్టుకున్న నానో, అంచనా వేసిన లక్ష్యాలను చేరుకోలేదు.ఈ కారు మార్చి 2009 లో మార్కెట్లో ప్రారంభమైంది. ధరల పెంపులు ఉన్నప్పటికీ రతన్ టాటా వాగ్దానం చేసిన విదంగా ప్రాథమిక నమూనా కోసం ఒక లక్ష రూపాయల ధరతో ప్రారంభించారు.

 ప్రారంభం నుంచి

ప్రారంభం నుంచి

అయితే, ప్రారంభం నుంచి, నానో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. మొదట, పశ్చిమ బెంగాల్లోని సింగూరు వద్ద టాటా మోటార్స్ ప్లాంట్ ప్రారంభించబడింది, అక్కడ భూమి స్వాధీనంపై తీవ్ర రాజకీయ మరియు రైతుల నుండి నిరసనలు ఎదురయ్యాయి.ఆ తరువాత గుజరాత్ లోని సనంద్ వద్ద కొత్త ప్లాంటుకు కంపెనీ తన ఉత్పత్తిని మార్చాల్సి వచ్చింది.

రతన్ టాటా

రతన్ టాటా

నానోను 'చౌకైన కారు' గా ప్రకటించిన విషయంలో కంపెనీ పొరపాటు చేసిందని రతన్ టాటా అంగీకరించింది.ఇది కంపెనీ లో సుమారు రూ.1000 కోట్ల నష్టంగా మిగిలిందన్నారు.

Read more about: tata motors ratan tata
English summary

నామరూపాలు లేకుండా పోయిన 'నానో' కార్? | End Of The Road For Tata's Nano?

Tata Motors' small car Nano is inching closer towards the end of its journey with just one unit produced in June, although the company maintained that no decision has been taken yet on stopping its production.
Story first published: Wednesday, February 6, 2019, 13:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X