లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.

వారం ప్రారంభంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు లాభాల్లో ముగిశాయి. ఆఖరి గంటలో అనూహ్యమైన కొనుగోళ్ల మద్దతు సూచీలను ఆకాశానికెత్తింది.

వారం ప్రారంభంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు లాభాల్లో ముగిశాయి. ఆఖరి గంటలో అనూహ్యమైన కొనుగోళ్ల మద్దతు సూచీలను ఆకాశానికెత్తింది. దీంతో నిఫ్టీ మళ్లీ 10900 పాయింట్ల ఎగువన ముగిసి ఇన్వెస్టర్లు, ట్రేడర్లలోఆశను నింపింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నిరుత్సాహక సంకేతాలతో 40 పాయింట్ల నష్టంతో మొదలైన నిఫ్టీ మిడ్ సెషన్ వరకూ నీరసంగానే కదలాడింది. అయితే ఆఖరి లాస్ట్ సెషన్‌లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో నిఫ్టీ ఇంట్రాడే కనిష్ట స్థాయి అయిన 10814 పాయింట్ల నుంచి ఏకంగా 100 పాయింట్లు రికవర్ అయింది. చివరకు 19 పాయింట్ల లాభంతో 10912 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 113 పాయింట్లు లాభపడి 36582 దగ్గర ముగిసింది.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.

మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు మాత్రం ఒక్క శాతం నష్టంతో ముగిశాయి. బ్యాంకింగ్, ఫిన్ సర్వ్, ఐటీ రంగ స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. రియాల్టీ, మీడియా, ఫార్మా రంగ కౌంటర్లలో మాత్రం అమ్మకాల ఒత్తిడి ఎక్కువైంది.

అనిల్ కంపెనీలు అట్టడుగుకు:

దివాలా అంచున పొంచి ఉన్న అనిల్ ధీరూభాయ్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ తాజాగా ఎన్.సి.ఎల్.టిని కలిసింది. దీంతో ఇక ఈ సంస్థ పని ఇక అధికారికంగా ముగిసిపోతోందని స్పష్టమైంది. ఈ నేపధ్యంలో అనిల్ అంబానీ గ్రూపులో ఉన్న స్టాక్స్ అన్నీ నేలచూపులు చూశాయి.

రిలయన్స్ పవర్ ఏకంగా 35 శాతం నష్టపోయి రూ.17 దిగొచ్చింది. అదే బాటలో రిలయన్స్ ఇన్ఫ్రా 15 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 35 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 20 శాతం, రిలయన్స్ హోం ఫైనాన్స్ 20 శాతం నష్టపోయాయి. ఇప్పట్లో ఈ సంస్థల స్టాక్స్ మళ్లీ తేరుకునే అవకాశాలు దాదాపుగా లేవని నిపుణులు చెబ్తున్నారు.

అదానీ స్టాక్స్ పనీ అంతే:

అదానీ గ్రూప్ స్టాక్స్‌లోనూ ఇదే తరహా పతనం కొనసాగుతోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 14 శాతం, అదానీ పవర్ 10 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 5 శాతం నష్టపోయాయి.

మంచి రిజల్ట్స్‌తో ఆకట్టుకున్న దివీస్, టైటాన్ మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన దివీస్ ల్యాబ్స్, టైటాన్ సంస్థల స్టాక్స్ ఈ రోజు ట్రేడింగ్‌లో మంచిలాభాలను
నమోదు చేశాయి. దివీస్ 5 శాతం, టైటాన్ 3.5 శాతం వరకూ లాభపడ్డాయి. మార్కెట్
నీరసంగా ఉన్నా ఈ స్టాక్స్ మాత్రం లాభాలబాటలో పరుగులు తీశాయి.

దివాన్ నష్టాలకు బ్రేక్:
వరుస పతనాలతో బెంబేలెత్తిపోతున్న దివాన్ హౌసింగ్ స్టాక్‌లో డౌన్ ఫాల్ ఆగింది. త్వరలో ఒక వ్యూహాత్మక భాగస్వామి తమతో చేతులు కలపబోతున్నారంటూ దివాన్
యాజమాన్యం వెల్లడించింది. కేర్ రేటింగ్స్ సంస్థ దివాన్ రేటింగ్స్‌ను తగ్గించిన నేపధ్యంలో యాజమాన్యం ఈ తరహా ప్రకటన చేసింది. దీంతో నష్టాల్లో ఉన్న స్టాక్ లాభాల్లోకి మళ్లింది. చివరకు 4 శాతం లాభాలతో రూ.116 దగ్గర స్టాక్ క్లోజైంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+