రోజ్ వ్యాలీ స్కాం, శారదా స్కామ్‌లు దేశాన్ని ఓ కుదుపు కుదిపేశాయి. లక్షలాది మంది అమాయకుల జీవితాలతో ఆడుకుని సుమారు రూ.60-70 వేల కోట్ల సొమ్మును అక్రమంగా దారిమళ్లించాయి.
రోజా పువ్వు.. అందంగా కనిపిస్తుంది. కానీ అదే సమయంలో సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే మాత్రం ముళ్లు ఖచ్చితంగా గుచ్చుకుంటాయ్. ఇప్పుడు రోజ్ వ్యాలీ స్కాంలో మమతా బెనర్జీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ విచారణ చేయడానికి వస్తేకోల్‌కతా సీఎం ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు. ఆయనను సీబీఐ విచారణ చేయనీయకుండా అడ్డుకోవడంతో పాటు ధర్నాకు కూర్చున్నారు. అంతేకాదు 1989 బ్యాచ్ ఐపీఎస్ఆ ఫీసర్ అయిన రాజీవ్ కుమార్ వాల్డ్‌లోనే బెస్ట్ పోలీస్ ఆఫీసర్ అంటూ ఆమె కితాబిస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగింది:
రోజ్ వ్యాలీ స్కాం, శారదా స్కామ్‌లు దేశాన్ని ఓ కుదుపు కుదిపేశాయి. లక్షలాది మంది అమాయకుల జీవితాలతో ఆడుకుని సుమారు రూ.60-70 వేల కోట్ల సొమ్మును అక్రమంగా దారిమళ్లించాయి. ఓ సారి వెనక్కి వెళ్లి చూస్తే రోజ్ వ్యాలీ స్కాం ఓ రెగ్యులర్ పొంజీ స్కీం. సెబీ నుంచి ఎలాంటి అనుమతులూ లేకుండా రోజ్ వ్యాలీ హోటల్స్ అండ్ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ భారీగా ప్రజల నుంచి నిధులను సేకరించింది. హాలిడే ప్యాకేజీలను ఇస్తామని, పెట్టిన పెట్టుబడికి 21 శాతం సాలీనా వడ్డీ ఇస్తామని నమ్మబలికింది. అక్కడితో ఆగకుండా మల్టీ లెవెల్ మార్కెటింగ్‌ను ఎరగా చూపి లక్షలాది మందిని బుక్ చేసింది. తీరా డబ్బులు చెల్లించే సమయం వచ్చే సరికి చేతులెత్తేసింది.
రూ.40 వేల కోట్ల రోజ్ వ్యాలీ స్కాం:
సెబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్‌కు విషయం తెలిసే సరికి వాళ్ల పరిస్థితి చేయి దాటిపోయింది. రోజ్ వ్యాలీ
ప్రమోటర్లు తాము సేకరించిన డబ్బుతో వ్యక్తిగంతా ఆస్తులు పెంచుకున్నారు. అత్యంత విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడ్డారు. ఈ స్కాం విలువ ఈడీ లెక్కల ప్రకారం రూ.15 వేల కోట్లు. అయితే వాస్తవానికి దీని విలువ రూ.40 వేల కోట్ల వరకూ ఉంటుందని స్మాల్ డిపాజిటర్స్ అసోసియేషన్ వెల్లడించింది.ఇక్కడ రోజ్ వ్యాలీ ప్రమోటర్లకు.. టీఎంసీ పెద్ద నేతలకు ప్రత్యక్ష సంబంధాలున్నాయని జగమెరిగిన సత్యం.
టీఎంసీ పార్టీ వేడుకలను వీళ్లే నిర్వహించడం, భారీగా పార్టీకి ఫండింగ్ ఇవ్వడం సహా టీఎంసీకి ప్రత్యక్షంగా కోటాను కోట్లు అందాయని, దీనిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదన అప్పట్లో జనాలు కూడా దుమ్మెత్తిపోశారు. చివరకు చేసేది లేక అప్పట్లో మమతా సర్కార్ దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. దానికి
ఇప్పుడున్న కోల్‌కతా కమిషనర్ నాయకత్వం వహించారు. దాన్ని నానబెట్టి, తొక్కిబెట్టేందుకు ప్రయత్నించినా చివరకు 2014లో సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు సీబీఐకు కేసు బదలాయించాల్సి వచ్చింది.
శారదా స్కాం కూడా తక్కువేం కాదు:
ఇదే బాటలో 2013-2014 సమయంలో శారదా స్కాం కూడా అటు బెంగాల్‌ను ఇటు దేశాన్ని కుదిపేసింది. సుమారు 200 కంపెనీలను ఏర్పాటు చేసి దాని ద్వారా రూ.20వేల నుంచి 30 వేల రూపాయలను దారి మళ్లించారు. అమాయకులైన 17 లక్షల మంది ఉసురు పోసుకున్నారు. పేద, దిగువ మధ్యతరగతి వాళ్లే టార్గెట్‌గా సాగిన శారదా
స్కాంలో దళారీలకు, చిట్స్ కట్టించిన వాళ్లకు 25-40 శాతం కమిషన్లను ఇచ్చారు.
సెబీ సహా కేంద్ర చట్టబద్ధ సంస్థల నుంచి ఎలాంటి అనుమతులూ లేకుండా ఈ సంస్థ
డిపాజిట్లు సేకరించి వ్యాపారాలు నిర్వహించింది. తీసుకున్న సొమ్మును టూరిజం, హోటల్స్, ఇన్ఫ్రా ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ సహా వివిధ వ్యాపారాలకు మళ్లించింది. సమీకరించిన సొమ్ముతో ఏం చేస్తున్నారో, ఎవరి అనుమతి తీసుకున్నారో ఏమీ చెప్పకుండా ఇష్టానుసారం వ్యవహరించారు ప్రమోటర్లు. బెంగాల్ నుంచి అస్సాం, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని జనాలను కూడా శారదా సంస్థలు ముంచేశాయి.
సెబీ, ఆర్బీఐ హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్టు వ్యవహరించింది. చివరకు పుట్టిమునిగిపోతోందనే సమయంలో చర్యలు తీసుకున్నట్టు యాక్ట్ చేసినా అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. కోట్ల రూపాయలను సేకరించిన గ్రూప్ చేతులెత్తేసింది.
టీఎంసీ లింక్:
టీఎంసీ ఎంపీ మిధున్ చక్రవర్తి ఈ సంస్థకు బ్రాండ్ ఎంబాసిడర్‌గా నిలిచారు. మరో ఎంపి కునాల్ ఘోష్, శ్రింజాయ్ బోస్, మదన్ మిత్రా వంటి వాళ్లు బాహాటంగానే వీటిని ఎంకరేజ్ చేసి సంస్థ నుంచి భారీ స్థాయిలో జీతాలు కూడా తీసుకున్నారు. శారదా సంస్థ కూడా టీఎంసీ పార్టీకి భారీగా ఫండింగ్ ఇచ్చింది. వాస్తవానికి అటుశారదా ఇటు రోజ్ వ్యాలీ
సంస్థలు టీఎంసీ వాళ్లవేనని ఇతరులను అడ్డుకుని పార్టీయే ఈ వ్యవహారం నడిపించిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడేం జరగబోతోంది:
రోజ్ వ్యాలీ, శారదా స్కాంలతో సంబంధమున్న ఐపీఎస్ ఆఫీసర్, కోల్‌కతా కమిషనర్ రాజీవ్ కుమార్‌ను విచారించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. దీన్ని మమతా బెనర్జీ జీర్ణించుకోలేకపోయారు. తమ రాష్ట్రంపైనా, తమ అధికారులపైన సీబీఐని అస్త్రంగా వాడి వేధిస్తోందని ఆరోపించారు. వాస్తవానికి 20 లక్షల మంది జీవితాలతో ముడిపడిన ఈ హై ప్రొఫైల్ కేసుల్లో కోట్లాది రూపాయలు చేతులు మారిపోయాయి. జనాలు మాత్రం మునిగిపోయారు. మరి ఎవరిని రక్షించడానికి ఈ దీక్షలు చేస్తున్నారో మనమే అర్థం చేసుకోవాలి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications