For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వచ్చేవారం స్టాక్ మార్కెట్లో లాభాలా.. నష్టాలా

By bharath
|

వచ్చేవారం స్టాక్ మార్కెట్లు అనేక అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి. ప్రధానంగా ఆర్బీఐను క్రెడిట్ పాలసీ, ప్రముఖ సంస్థల ఆర్థికఫలితాలు సహా ఆఫ్టర్ బడ్జెట్ ఎఫెక్ట్ మార్కెట్ల కదలికలను నిర్ణయించబోతోంది. వోట్ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైనప్పటికీ చివరికీ వారంతంలో లాభాల్లోనే ముగిశాయి. అయితే కొత్త ఎఫ్ అండ్ ఓ సిరీస్ నేపధ్యంలో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యే సూచనలు స్పష్టంగా కనిపిసున్నాయి. శుక్రవారం రోజునే ఫిబ్రవరి సిరీస్ మొదలైనప్పటికీ ఆ రోజు బడ్జెట్ కావడంతో తీవ్రమైన ఒలటాలిటీ నమోదైంది.

వచ్చేవారం స్టాక్ మార్కెట్లో లాభాలా.. నష్టాలా

అదే మొత్తం నెలంతా ఎలా ఉంటుంద అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. గతవారమంతామాత్రం పాజిటివ్‌గా ట్రేడైన సూచీలు ఐటీ, మెటల్ ప్యాక్‌కు థంబ్స్ అప్ వచ్చాయి. ఆర్బీఐ పాలసీ కీలకం ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాతజరుగుతున్న మొట్టమొదటి పాలసీ మీట్ వచ్చే వారం జరగబోతోంది. అయితే వినియోగ డిమాండ్‌ను పెంచేందుకు ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తుందా అనే దానిపై మనకు క్లారిటీ వస్తుంది. సిఆర్ఆర్ (నగదు నిల్వల నిష్పత్తి), రెపో రేట్‌నుతగ్గిస్తారా అని మార్కెట్ఆశగా ఎదురు చూస్తోంది.

ఒకవేళ అలాంటి పాజిటివ్ సర్‌ప్రైజెస్ ఏవైనా ఉంటే మార్కెట్ ఇక్కడి నుంచి మరింత పరుగులు తీసే అవకాశం ఉంది. ఇప్పటికే బ్యాంకింగ్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ సూచీ ప్రధాన నిఫ్టీతో పోలిస్తే మెరుగైన పర్ఫారెన్స్ కనబరుస్తోంది.

రిజల్ట్స్ సీజన్ ఫిబ్రవరి 4 - కోల్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, ఐఆర్బీ ఇన్ఫ్రాఎక్సైజ్ఇండస్ట్రీస్,ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఫిబ్రవరి 5 - టెక్ మహీంద్రా,గెయిల్, హెచ్ పి సి ఎల్, పిఎన్‌బి, డిఎల్ఎఫ్, అపోలో టైర్స్, టాటా గ్లోబల్, డిష్టీవీ ఫిబ్రవరి 6 - లుపిన్, సిప్లా సీమెన్స్, అదానీ పోర్ట్స్,అలహాబాద్ బ్యాంక్
ఫిబ్రవరి 7 - టాటా మోటార్స్,అరబిందో ఫార్మా, బ్రిటానియా, కాఫీ డే, అర్వింద్, గ్రాసిం ఫిబ్రవరి 8 - మహీంద్రా మహీంద్రా, బిపిసిఎల్, ఇంజనీర్స్ ఇండియా టైటాన్‌లో జోష్ ప్రముఖ వాచ్, గోల్డ్ జ్యువెల్రీ సంస్థ టైటాన్ మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన లాభాల్లో 43 శాతం వృద్ధిని నమోదు చేసినటైటాన్ రూ.413.20 కోట్లను నమోదు చేసింది. రూ.288 కోట్ల నికర లాభాన్ని వెల్లడించింది.రెవెన్యూలో 34.6 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.5871.50
కోట్లను ఆర్జించింది. దీంతో ఈ స్టాక్‌లో సోమవారం పాజిటివ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది.

ఎనలిస్టులు ఏం చెబ్తున్నారు హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ అంచనాల ప్రకారం మార్కెట్లు
ఇప్పటికిప్పుడు (నిఫ్టీ) 11వేల పాయింట్ల మార్కును అధిగమించే అవకాశాలు
తక్కువే ఉన్నాయి.ప్రస్తుతానికి 10950-10985 మధ్యతీవ్రమైన నిరోధాన్ని నిఫ్టీ ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి.ఎఫ్ఐఐ పెట్టుబడులు ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు నెట్ బయర్స్‌లా నిలిచారు.ఇప్పటివరకూ 1300 కోట్ల రూపాయల విలువైన స్టాక్స్‌ను వాళ్లు కొనుగోలు చేశారు

Read more about: sensex nifty stock market
English summary

వచ్చేవారం స్టాక్ మార్కెట్లో లాభాలా.. నష్టాలా | Stock Market News

Stock markets are going to affect many factors next week. Mainly, RBI will determine the movements of the next budget-based markets, including the credit policy and the major financial firms
Story first published: Sunday, February 3, 2019, 20:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X