For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?

దివాన్ హోసింగ్ ఫైనాన్స్.. దేశంలో రెండో అతిపెద్ద ఎన్‌బిఎఫ్‌సి సంస్థ. ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ బ్రాండ్ ఎంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఈ సంస్థపై నాలుగు నెలల క్రితం వరకూ అటు దేశీయ ఇన్వెస్టర్లు

By bharath
|

4 నెలల్లో రూ.650 స్టాక్ రూ.100కు దిగొచ్చింది ! ఎందుకు.. ఏమిటి.. ఎలాదివానా బనాదియా.. ! షారుక్ బ్రాండ్‌కు కోబ్రా షాక్

దివాన్ హోసింగ్ ఫైనాన్స్.. దేశంలో రెండో అతిపెద్ద ఎన్‌బిఎఫ్‌సి సంస్థ. ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ బ్రాండ్ ఎంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఈ సంస్థపై నాలుగు నెలల క్రితం వరకూ అటు దేశీయ ఇన్వెస్టర్లు, రిటైల్ షేర్ హోల్డర్లు,విదేశీ పెట్టుబడిదార్లు, బ్యాంకులకు అపారమైన నమ్మకం ఉండేది. ఏటికేడు భారీ స్థాయిలో వృద్ధిని కనబరుస్తూ వచ్చిన సంస్థ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. స్టాక్
మార్కెట్‌ను, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాన్ని ఓ కుదుపు కుదిపేసిన డిహెచ్‌ఎఫ్‌ఎల్
ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్.

దివాళా దిశగా అడుగులు

దివాళా దిశగా అడుగులు

అయితే ఇది కూడా దివాళా దిశగా అడుగులు వేస్తుందా, ప్రమోటర్ల అత్యాశ సంస్థను ముంచేసిందా, మళ్లీ స్టాక్ కోలుకుంటుందా అనే ప్రశ్నలు ఈ సంస్థతో సంబంధమున్న అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

దివాన్ హౌసింగ్ ఫైనాన్స్

దివాన్ హౌసింగ్ ఫైనాన్స్

దివాన్ హౌసింగ్ ఫైనాన్స్.. (డిహెచ్ఎఫ్ఎల్) ఎన్.బి.ఎఫ్.సి రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇంటికి కావాల్సిన గృహ రుణాలను ఇస్తూ ఈ రంగంలో రెండో స్థానాన్ని సంపాదించుకుంది. ఈ రంగంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన

ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్ డి ఎఫ్ సి, క్యాన్‌ఫిన్ హోమ్స్, జీఐసి హౌసింగ్, రెప్కో వంటి వాటికి గట్టిపోటీ ఇస్తూ.. ప్రైవేట్ రంగంలో టాప్ స్థానంలో ఉండేది. గతేడాది

సెప్టెంబర్‌లో ఈ స్టాక్ ధర రూ.690 ఉండేది.

గతేడాది సెప్టెంబర్ నెలలో

గతేడాది సెప్టెంబర్ నెలలో

మరి ఏమైంది గతేడాది సెప్టెంబర్ నెలలో ఐఎల్ఎఫ్ఎస్ (IL&FS) సంస్థ తాను వివిధబ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన వడ్డీలను, షార్ట్ టర్మ్ రుణాలను చెల్లించలేక చేతులెత్తేసింది. దీంతో అనేక రేటింగ్ సంస్థలు ఈ కంపెనీని డిఫాల్ట్ లిస్ట్‌లో పెట్టి జంక్ రేటింగ్ ఇచ్చేశాయి. దీంతో ఈ సంస్థకు రుణాలిచ్చిన కంపెనీలన్నింటికీ వణుకు పుట్టింది. ఎందుకంటే సుమారు 160 సబ్సిడరీ సంస్థలతో వివిధ రంగాల్లో

వ్యాపారం నిర్వహిస్తున్న ఐఎల్ఎఫ్ఎస్‌కు మొత్తం రూ.91 వేల కోట్ల వరకూ అప్పు ఉంది.

ఇంత పెద్ద సంస్థ అప్పులోకి కూరుకుపోతే బాండ్ మార్కెట్, డెట్ మార్కెట్ అంతా కకావికలమవుతుంది. కొత్తగా అప్పులు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు.

ఐఎల్ఎఫ్ఎస్-డిఎస్‌పి బ్లాక్ వ్యవహారం

ఐఎల్ఎఫ్ఎస్-డిఎస్‌పి బ్లాక్ వ్యవహారం

కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్టుగా ఐఎల్ఎఫ్ఎస్-డిఎస్‌పి బ్లాక్ వ్యవహారం డిహెచ్ఎఫ్ఎల్ కొంప ముంచింది. అదేంటంటే.. డిహెచ్ఎఫ్ఎల్ సంస్థకు చెందిన కమర్షియల్ పేపర్లను డిఎస్‌పి బ్లాక్‌రాక్ అనే మ్యూచువల్ సంస్థ గతంలో కొనుగోలు చేసింది. ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం నేపధ్యంలో సదరు కమర్షియల్ పేపర్లలో రూ.300 కోట్ల మొత్తాన్ని ఒక్కసారిగా అమ్మేసింది. దీంతో లిక్విడిటీ సమస్య ఏదో రాబోతోందని, డిహెచ్ఎఫ్ఎల్‌లో కూడా ఏదైనా ఇబ్బంది రావొచ్చని డిఎస్‌పి అమ్మేసిందేమో అనే ఉద్దేశంతో స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్ 30 శాతం వరకూ పడిపోయింది. రూ.600 నుంచి రూ. 400 వరకూ ఒక్కరోజులోనే దిగొచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ సంస్థకు బ్యాడ్ టైంస్టార్ట్ అయింది.

కోబ్రా దెబ్బ:

కోబ్రా దెబ్బ:

తాజాగా కోబ్రా పోస్ట్ అనే వెబ్ సైట్‌ డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లపై ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం ప్రమోటర్లు రూ.31 వేల కోట్ల భారీ మొత్తాన్ని దారిమళ్లించారని ఆధారాలతో సహా తేల్చింది. ప్రమోటర్లు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి వాటికి పెద్ద ఎత్తున రుణాలను ఇప్పించి మోసగిస్తున్నారంటూ వెల్లడించింది. వీటికి తోడు సొంతంగా విదేశాల్లో వాళ్లు ఆస్తులను కూడబెట్టుకుంటున్నట్టు తమ దర్యాప్తులో తేలిందని వివరించింది. దీనిపై ప్రమోటర్లను తక్షణం స్పందించడంలో ఆలస్యం చేశారు. దీంతో ఇంతకాలం కొద్దోగొప్పో వాళ్లపై ఉన్న నమ్మకం కాస్తా కరిగిపోయింది. ఈ దెబ్బకు స్టాక్ గింగిరాలు కొడ్తూ నేలకు జారింది. రూ.250 ఉన్న స్టాక్ రూ.102కు దిగొచ్చింది. ఇది ఇంకా ఎక్కడికి వెళ్తుందో.. చెప్పడం కూడా కష్టంగా మారింది. ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్ ప్రకారం డబుల్ డిజిట్‌కు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

 మార్కెట్లో రుణాలు

మార్కెట్లో రుణాలు

దివాలా తీసేంత భయం ఉందా వ్యాపారం అంటేనే నమ్మకంపై నడిచే వ్యవహారం. అలాంటి నమ్మకాన్ని ప్రమోటర్లు కోల్పోవడం ఇక్కడ ప్రధానమైన అంశం. వీటికి తోడు ఐఎల్ఎఫ్ఎస్, దివాన్ హౌసింగ్ దెబ్బతో బయటి మార్కెట్లో రుణాలు పుట్టడం మరింత కష్టంగా మారింది. వీళ్లది అంతా రొటేషన్ బిజినెస్ కాబట్టి.. ఒకసారి ఎక్కడైనా సైకిల్‌కు బ్రేక్ పడితే మొత్తం చైన్ రియాక్షన్‌లా ఉంటుంది. ఏడాదికి ఈ సంస్థ సుమారు రు.50వేల కోట్ల వరకూ రుణాలను వివిధ మార్గాల ద్వారా సమీకరిస్తుంది. ఇప్పటివరకూ ఇంత క్రైసిస్‌లోనూ సంస్థ ఏనాడూ పేమెంట్ డిఫాల్ట్ చేయలేదు. అదొక్కట పాజిటివ్ పాయింట్‌గా ఉంది. ప్రస్తుతానికి రూ.80 వేల కోట్ల మేర సంస్థ నెత్తిన రుణభారం ఉంది. వీళ్లు సుమారు రూ.లక్ష కోట్ల మేర రుణాలను ఇచ్చి ఉన్నారు. అవన్నీ లాంగ్ టెర్మ్ డెట్స్.

స్టాక్ ఎందుకు పడిపోతోంది అంటే

స్టాక్ ఎందుకు పడిపోతోంది అంటే

మరి అంతా బాగున్నప్పుడు స్టాక్ ఎందుకు పడిపోతోంది అంటే దానికి ఏకైక కారణం భయం, నమ్మకం లేకపోవడం, పారదర్శకత లోపించడమే. మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్టర్స్ అంతా వచ్చిన కాడికి అనే ధోరణిలో స్టాక్‌ను అమ్ముకుని బయటపడ్తున్నారు. దీంతో ఈ స్టాక్ ఎవరూ ఊహించని విధంగా రూ.650 స్థాయి నుంచి రూ.102 దిగొచ్చింది. అందుకే గతంలో ఎక్కువ ధరకు కొన్నవాళ్లు వెయిట్ చేయడం మినహా చేయగలిగింది ఏమీ లేదు. ఒకవేళ రూ.200-300 మధ్య స్టాక్ కొని ఉంటే నష్టాల్లో ఉన్న బయటపడాలనేది నిపుణుల సలహా.

Read more about: nbfc financial housing loan
English summary

కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు? | Cobra Alleges DHFL Siphons Money Using Shahrukh Khan's Brand Image

Diwan Housing Finance is the second largest NBFC in the country. Four months ago, domestic investors were the company's embodied brand of Shahrukh Khan, a prominent Bollywood star.
Story first published: Saturday, February 2, 2019, 15:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X