ఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పీయుష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అభివృద్ధిలో భారత దేశం దూసుకెళుతోందని చెప్పారు. ప్రపంచంలోనే హైవేల నిర్మాణం భారత్‌లో అత్యంత వేగంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. రోజుకు 27 కిలోమీటర్ల మేరా హైవేల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. హైవేల నిర్మాణం వాటి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న పీయుష్ గోయల్...గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం రూ.19వేల కోట్లు కేటాయించడం జరిగింది.
ఇక గత నాలుగేళ్లలో 51,073 కిలోమీటర్లు నిర్మాణం కోసం భూసేకరణ జరిగిందని ఇప్పటికే 28వేల531 కిలోమీటర్లు మేరా హైవేల నిర్మాణం జరిగిందని కేంద్ర రహదారులు మరియు రవాణా శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం రోజుకు 28 కిలోమీటర్ల మేరా పనులు జరుగుతున్నాయని ఇక వేగాన్ని పెంచి రోజుకు 40 కిలోమీటర్ల మేరా రహదారుల నిర్మాణం చేపడుతామని చెప్పారు.

దేశంలోని రహదారులకు సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు భూమిరాశి పేరుతో వెబ్‌సైట్ రూపొందించామని చెప్పారు గడ్కరీ. ఇందులో భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అనుమతుల దగ్గరనుంచి కేంద్ర ప్రభుత్వం ఆమోదం వరకు అన్ని అంశాలను పొందుపరుస్తున్నామని చెప్పారు గడ్కరీ. భూసేకరణ విషయం పలు అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో పారదర్శకత కోసమే ఈ పోర్టల్ ప్రారంభించినట్లు గడ్కరీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తోందని చెప్పారు. దీని ద్వారా చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. ఉదాహరణకు ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేకు లక్ష కోట్లు ఖర్చు కాగా.. కొత్త అలైన్ మెంట్‌తో రూ. 16,500 కోట్లు ఆదా అయ్యిందని చెప్పారు. భూసేకరణ జరగడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications