ఎన్నికలు సమీపిస్తుడటంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్ పై చాల కసరత్తులు చేసిందని తెలుస్తోంది.బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుండి ఫిబ్రవరి 13 దాక జరిగే అవకాశం ఉంది.
ప్రతి ఏటా బడ్జెట్‌కు ముందు రెండు, మూడు నెలల నుంచే హడావిడి మొదలవుతుంది. ప్రతి ఏటా యూనియన్ బడ్జెట్ పార్లమెంటులో ఫిబ్రవరి నెలలో సమర్పింపబడుతుంది. మన దేశంలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 దాకా ఆర్థిక సంవత్సరాన్ని ఫాలో అవుతారు.

ఎన్నికలు సమీపిస్తుడటంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్ పై చాల కసరత్తులు చేసిందని తెలుస్తోంది.బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుండి ఫిబ్రవరి 13 దాక జరిగే అవకాశం ఉంది.ఇది పూర్తి స్థాయిలో కాకుండా తాత్కాలిక బడ్జెట్ అని చెప్పవచ్చు.
దేశం అంతటా ఎన్నికల వాతావరణం మొదలైందని చెప్పవచ్చు.అన్ని పార్టీలు వివిధ పథకాలతో ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి.ఇదే తరుణం లో కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ను రేపు ప్రవేశపెట్టనుంది.ఇందులో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ తయారు చేసినట్లు సమాచారం. ప్రతి మధ్యతరగతి ప్రజలకు సొంతఇంటి కల తప్పక ఉంటుంది. దానిని ఈ సారి బడ్జెట్ లో ప్రస్తావించే అవకాశం ఉంది.
హోం ఇన్సూరెన్స్ పై పన్ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.దీనిపై రేపు జరిగే బడ్జెట్ సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సురక్షితమైన రక్షణ భీమా పథకాలకు పన్ను తగ్గింపు, ఇతర పెన్షన్ ఇన్సూరెన్స్ వంటి వాటిపై ట్యాక్స్ తగ్గింపులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఈ బడ్జెట్ లో ఫలాలు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు అలాగే పెట్టుబడి కింద పంట సహాయం కూడా చేయవచ్చని భావిస్తున్నారు.అంతేకాకుండా ప్రభుత్వరంగ సాధారణ భీమా కంపెనీల కోసం ప్రభుత్వం రూ.4వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications