For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.

బిఎస్ఇ బెంచ్మార్క్ సెన్సెక్స్ గురువారం 200 పాయింట్ల మేరకు సానుకూలంగా సాగింది. అమెరికా ఫెడరల్ రిజర్వు కీలకమైన వడ్డీ రేట్లపై వెనక్కు తగ్గిన నేపథ్యంలో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.

By bharath
|

ముంబయి: బిఎస్ఇ బెంచ్మార్క్ సెన్సెక్స్ గురువారం 200 పాయింట్ల మేరకు సానుకూలంగా సాగింది. అమెరికా ఫెడరల్ రిజర్వు కీలకమైన వడ్డీ రేట్లపై వెనక్కు తగ్గిన నేపథ్యంలో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.

గురువారం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.

30 షేర్ల సూచిలు 213.32 పాయింట్లు లేదా 0.60 శాతం పెరిగి 35,804.57 వద్ద ఉంది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50.95 పాయింట్లు పెరిగి 0.51 శాతం పెరిగి 10,705.75 వద్ద ముగిసింది.

బుధవారం సెన్సెక్స్ 1.25 పాయింట్లు క్షీణించి, నిఫ్టీ 0.4 పాయింట్ల నష్టాలతో ముగిసింది. ఐసిఐసిఐ బ్యాంక్, ఆర్ఐఎల్, టాటా స్టీల్, ఎస్బిఐ, టాటా మోటార్స్, ఎన్టిపిసి, వేదాంత, టిసిఎస్ 2.20 శాతం వరకు లాభపడ్డాయి.

మరో వైపు బజాజ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, హీరో మోటార్ కార్పొరేషన్, బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి ద్వయం, హెచ్సీఎల్ టెక్ వంటివి 1.59 శాతం వరకు నష్టపోయాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది వడ్డీ రేట్ల పెంపుపై ఆచితూచి వ్యవహరిస్తామంటూ బుధవారం రాత్రి ఫెడ్‌ సమీక్షా సమావేశం అనంతరం ప్రకటించడంతో అమెరికా స్టాక్‌ సూచీలు 2 శాతం వరకూ ర్యాలీ జరిపాయి.

ఆరునెలల వాణిజ్య యుద్ధం పరిష్కారం లక్ష్యంగా అమెరికా మరియు చైనా మధ్య కొనసాగుతున్న రెండు రోజుల ఉన్నత స్థాయి చర్చలు గురించి గ్లోబల్ పెట్టుబడిదారులు ఆశాజనకంగా ఉన్నారు.

హాంకాంగ్ హాంగ్ సెంగ్ 1.27 శాతం, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.63 శాతం పెరిగి, కోస్పి 0.18 శాతం, జపాన్ నిక్కి 0.90 శాతం లాభపడింది. వాల్ స్ట్రీట్లో, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ బుధవారం 1.77 శాతం పెరిగింది.

అదే సమయంలో రూపాయి విలువ 18 పైసలు పెరిగి 70.93 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.01 శాతం పెరిగి 62.16 డాలర్లకు చేరాయి.

Read more about: stock market sensex nifty
English summary

గురువారం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్. | Sensex Jumps Over 200 Points On Firm Global Cues

Mumbai: The BSE benchmark Sensex on Thursday rallied over 200 points on positive cues from global markets after dovish comments by the US Federal Reserve as it left key policy rates unchanged.
Story first published: Thursday, January 31, 2019, 10:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X