ఢిల్లీ : కేబుల్ ఆపరేటర్, డీటీహెచ్ కంపెనీలతో విసిగిపోతున్నవారికి శుభవార్త. మొబైల్ నెంబర్ల మాదిరిగానే సెట్ టాప్ బాక్సులకు కూడా పోర్టబిలిటీ అవకాశం అందుబాటులోకి రానుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరినాటికి సెట్ టాప్ బాక్సుల పోర్టబిలిటీ అమల్లోకి రానుంది. సర్వీస్ ప్రొవైడర్ నచ్చకున్నా, ఏదయినా ఇబ్బందులు తలెత్తినా.. ఇకపై భేషుగ్గా ఇతర సర్వీసులను ఎంచుకోవచ్చు.
సెట్ టాప్ బాక్సుల పోర్టబిలిటీ అమలుపై కసరత్తు చేస్తున్న ట్రాయ్.. వీలైనంత తొందరగా తెరపైకి తెచ్చేలా సన్నాహాలు చేస్తోంది. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పోర్టబిలిటీ అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నామంటున్నారు ట్రాయ్ ఛైర్మన్ శర్మ. ఒక సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఇంకో సర్వీస్ ప్రొవైడర్ కు మారినప్పడు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించనక్కర్లేదని చెబుతున్నారు. ఒక సంస్థకు చెందిన సెట్ టాప్ బాక్సులు ఇతర కంపెనీలు వాడుకునేలా సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ కు సహకరించాలని సూచించారు.

కొత్తగా అమల్లోకి తెచ్చిన టారిఫ్ విధానంలోకి, నిర్ణీత గడువులోగా (31 జనవరి) 90 శాతం మేర వినియోగదారులు మారిపోతారని భావిస్తున్నారు ట్రాయ్ అధికారులు. ఫిబ్రవరి 1 నుంచి ట్రాయ్ కొత్త పాలసీ అమల్లోకి వచ్చే క్రమంలో నూతన విధానంలోకి మారే ప్రక్రియ స్పీడప్ అయిందంటున్నారు. సెలవులు ఇతరత్రా కారణాలతో 10 శాతం మంది కాస్తా ఆలస్యంగా కొత్త టారిఫ్ లోకి వచ్చే అవకాశముందని అంటున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications