ఇటీవల కాలంలో ఆధార్ అనేది అత్యంత ముఖ్యమైన గుర్తింపు రుజువుల్లో ఒకటిగా ఉంది అలాగే ఇది క్రెడిట్ చిరునామా రుజువుగా కూడా మారింది.
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో ఆధార్ అనేది అత్యంత ముఖ్యమైన గుర్తింపు రుజువుల్లో ఒకటిగా ఉంది అలాగే ఇది క్రెడిట్ చిరునామా రుజువుగా కూడా మారింది. ఆధార్ భద్రతకు సంబంధించి అనేకసార్లు సందేహాలు వచ్చినప్పటికీ, యుఐడిఎఐ పలు మార్లు ప్రస్తావిస్తూ ఆధార్ పూర్తిగా భద్రంగా ఉందని, డేటాను ఎట్టిపరిస్థితుల్లో దొంగలించలేరని తెలియజేసింది.

కానీ ఎన్నిసార్లు భరోసా ఇచ్చిన కొన్ని మీడియాల్లో వచ్చే కథనాల వల్ల ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో యుఐడిఎఐ కొత్త సూచనల ప్రకారం మీ డాటాను సురక్షితంగా ఉంచేందుకు లాక్ మరియు అన్ లాక్ పద్దతిని అందుబాటులో ఉంచింది.అది ఎలా వాడాలో ఈ కింద తెలుసుకోండి.
యుఐడిఎఐ పోర్టల్ ద్వారా లేదా mAadhaar మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో బయోమెట్రిక్ డేటాను లాక్ చేయవచ్చు మరియు అన్లాక్ చేయవచ్చు.
ఇక్కడ మీరు మీ బయోమెట్రిక్ డేటా ఎలా లాక్ చేయవచ్చో చూడండి
1. యుఐడిఎఐ యొక్క ఆన్లైన్ పోర్టల్ను సందర్శించండి మరియు ఆధార్ సేవల విభాగంలో "లాక్ / అన్లాక్ బయోమెట్రిక్స్" ను ఎంచుకోండి.
2. మీ 12 అంకెల ఆద్దార్ నంబరు మరియు భద్రతా కోడ్ ను ఎంటర్ చేసి, ;SEND OTP' ఎంపికపై క్లిక్ చేయండి.
3. ఆధార్లో రిజిస్టర్ అయిన వెంటనే మీ మొబైల్ నంబరుకు ఓటిపి పంపబడుతుంది.
4. మీ మొబైల్ నంబర్ కు పంపిన OTP ను ఎంటర్ చేసి, 'లాగిన్' బటన్ పై క్లిక్ చేయండి.
5. మీరు తెరపై ప్రదర్శించబడిన 4 అంకెల భద్రతా కోడ్ ను నమోదు చేసినప్పుడు మీ బయోమెట్రిక్ డేటా భద్ర పరచబడుతుంది,తరువాత 'enable ' బటన్ పై క్లిక్ చేయండి.
ఇక్కడ మీరు మీ బయోమెట్రిక్ డేటా ఎలా అన్లాక్ చేయవచ్చో చూడండి
1. బయోమెట్రిక్ డేటా అన్లాక్ చేయడానికి "లాగిన్" బటన్ పై క్లిక్ చేయండి.
2. ఇచ్చిన బాక్స్ లో మీ ఆధార్ నంబర్ మరియు భద్రతా కోడ్ ను నమోదు చేయండి.
3. మీ మొబైల్లో వన్ టైం పాస్వర్డ్ కొరకు SEND OTP ' బటన్ పై క్లిక్ చేయండి.
4.ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నంబరుకు ఓటిపి పంపబడుతుంది.
5.ఇచ్చిన స్పేస్ లో ఈ OTP ఎంటర్ మరియు "లాగిన్" బటన్ పై క్లిక్ చేయండి.
6. భద్రతా కోడ్ ను ఎంటర్ చేసి, "అన్లాక్" బటన్ పై క్లిక్ చేయండి మరియు మీ బయోమెట్రిక్ డేటా 10 నిమిషాలు తాత్కాలికంగా అన్లాక్ చేయబడుతుంది.


Click it and Unblock the Notifications