కేంద్ర ప్రభుత్వం నిధులతో తొలగనున్న ఎయిర్ ఇండియా కష్టాలు.
టర్నోవర్ ప్లాన్ లో ఈక్విటీ ఇన్ఫ్యూషన్లో భాగంగా వచ్చే వారం ఎయిర్ ఇండియాకు రూ .1,500 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు సీనియర్ అధికారి శుక్రవారం తెలిపారు.
న్యూఢిల్లి: టర్నోవర్ ప్లాన్ లో ఈక్విటీ ఇన్ఫ్యూషన్లో భాగంగా వచ్చే వారం ఎయిర్ ఇండియాకు రూ .1,500 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు సీనియర్ అధికారి శుక్రవారం తెలిపారు.ఆర్థిక సంవత్సరం 2018-19 కి గాను రూ.2,345 కోట్ల నిధులను ఎయిర్ ఇండియా కు గ్రాంట్ గా పార్లమెంటు ఆమోదించింది.

వచ్చే వారం ఎయిర్ లైన్స్ కు రూ .1,500 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు పౌరవిమానయాన శాఖ అధికారి తెలిపారు. ఇది 2,345 కోట్ల రూపాయల సప్లిమెంటరీ మంజూరులో భాగంగా ఉంటుంది అని తెలిపారు.
ఎయిర్ ఇండియా మొత్తం రూ .55,000 కోట్ల రుణా భారాన్ని తగ్గించడంలో భాగంగా
ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ కంపెనీకి రూ. 29,000 కోట్ల రుణాన్ని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మునుపటి యుపిఎ ప్రభుత్వం పొడిగించిన బెయిలవుట్ ప్యాకేజీలో ఎయిర్ ఇండియా కొనసాగుతోంది. కొన్ని పనితీరు పరిమితులు కల్పించడానికి ప్రభుత్వం నుండి సబ్సిడీ గా 30,231 కోట్ల రూపాయలు అందుకోవచ్చు. 10 సంవత్సరాల బెయిలవుట్ ప్యాకేజీ 2012 నుండి ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications