పెట్రోల్ ధరలు:వరుసగా రెండవరోజు ఇంధన ధరలు మారలేదు.
ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు రెండో రోజు కూడా ఎటువంటి మార్పులు చేయలేదు. మంగళవారం వరకు ఆరు రోజుల పాటు ఇంధన ధరలు వరుసగా పెరగడం గమనార్హం.
న్యూఢిల్లీ: ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు రెండో రోజు కూడా ఎటువంటి మార్పులు చేయలేదు. మంగళవారం వరకు ఆరు రోజుల పాటు ఇంధన ధరలు వరుసగా పెరగడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు లీటరుకు రూ.71.27 రూపాయలలు,డీజిల్ రూ.65.90 రూపాయల వరకు విక్రయించబడుతున్నాయి. నిన్నటి ధరతో పోల్చుకుంటే ధరలలో ఎటువంటి మార్పు లేదు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్ సైట్ లో లభించిన సమాచారం ప్రకారం ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ .76.90 వద్ద రిటైలింగ్ అవుతోంది,లీటరు డీజిల్ రూ.69.01 రూపాయల చొప్పున లభిస్తుంది. కోల్కతాలో పెట్రోలు, డీజిల్ ధర రూ.73.36 రూపాయలు, రూ.67.68 రూపాయలు.
అదేవిదంగా, చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ.73.99 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది, డీజిల్ ధర లీటరుకు రూ .69.62 రూపాయలు.గురుగ్రామ్, నోయిడాల్లో రిటైల్ పెట్రోలు ధర రూ.71.99 రూపాయలు, రూ.70.97 మరో వైపు డీజిల్ గురుగ్రాంలో రూ.65.67 రూపాయలు, నోయిడాలో రూ.65.06 రూపాయలు వద్ద ధర నిలిచింది.
రోజువారీ దరల సమీకరణ ప్రకారం,పెట్రోల్ మరియు డీజిల్ ధరలు 15 రోజులు సగటున ప్రపంచ ఇంధన ధరలపైనే కాకుండా, రూపాయి-అమెరికా డాలర్ ఎక్స్చేంజ్ రేటుపై కూడా ఆధారపడి ఉంటుంది. దేశంలో 80 శాతం ముడి చమురు అవసరాలకు దిగుమతులు చేస్తోంది.
అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్కు USD 61.17 వద్ద ట్రేడ్ అయ్యాయి, ముగింపు సమయానికి 3 సెంట్లు పెరిగింది, గత సెషన్లో 0.6 శాతం తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో మందగింపు గురించి పెరుగుతున్న ఆందోళనల కారణంగా ముడి ధరలు ఒత్తిడికి గురవుతున్నాయని చాలామంది పరిశ్రమ పరిశీలకులు అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications