For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాట్సాప్ వాడుతున్నవారికి బ్యాడ్ న్యూస్

By girish
|

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు వాడనివారుండరు ఇక స్మార్ట్ ఫోన్ ఉంటే దాంట్లో చాలా రకాల యాప్స్ వాడుతుంటారు కానీ ప్రతిఒక్కరి ఫోన్లో కచ్చితంగా ఉండే యప్ప ఒకటి పేస్ బుక్ మరియు వాట్సాప్ ఈ రెండు యాప్స్ ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్నాయి ఇక ఇదంతా ఎందుకు చెబుతున్నాము అంటే వాట్సాప్ వాడుతున్నవారికి ఒక చేదు వార్త .ఏంటో చూడండి.

అసత్యాలను, వదంతులను వ్యాపింపజేయకుండా అరికట్టేందుకు, సందేశాలను ఐదుగురు వ్యక్తులు లేదా గ్రూపులకు మించి ఫార్వర్డ్ చేయకుండా భారత్‌లో ఆంక్షలను అమలు చేస్తున్న వాట్సాప్ వాటిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించినట్లు సంస్థ పాలసీ అండ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ విక్టోరియా గ్రాండ్ తెలిపారు. వాట్సాప్ సందేశాల వల్లే గత ఏడాది భారత్‌లో కొన్ని మూకదాడులు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో వాట్సాప్ సందేశాలను ఒకసారి ఐదుగురికి మించి ఫార్వర్డ్ చేయకుండా ఆ సంస్థ గత జూలైలో నుంచి భారత్‌లో ఆంక్షలు అమలు చేస్తున్నది.

వాట్సాప్ వాడుతున్నవారికి బ్యాడ్ న్యూస్

ఇంతకుముందు వరకు వాట్సాప్ మెసేజ్‌లను 20 మందికి గానీ, 20 గ్రూపులకు గానీ ఫార్వర్డ్ చేసే వెసులుబాటు ఉండేది. వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉన్నది. అయితే ఫేక్ న్యూస్ వ్యాపింపజేయడంతోపాటు మార్పులు చేర్పులు చేసిన ఫోటోలు, సందర్భ రహిత వీడియోలు, తమాషా ఆడియోలను ఫార్వార్డ్ చేస్తుండటం వాట్సాప్‌కు ఇబ్బందికరంగా మారింది.

వందల గ్రూపులు, వ్యక్తులు సమాచారం, ఫొటోలు, వీడియోలు ఫార్వార్డ్ చేసుకునేందుకు వాట్పాప్ ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ అనుమతించేది. కానీ క్రమంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతుండటంతో ఈరోజు నుంచి వాట్సాప్ ఫార్వార్డ్ పరిమితులను ఐదు గ్రూపులు లేదా వ్యక్తులకు పరిమితం చేయాలన్న నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నామని కమ్యూనికేషన్స్ విభాగం అధిపతి కార్ల్ వూగ్ తెలిపారు.

మీకు తెలియని మరికొన్ని విషయాలు:

ఫోన్‌లో సిమ్‌కార్డు లేకున్నా వై-ఫై సర్వీసును ఉపయోగించడం ద్వారా వాట్సాప్‌ ఖాతాకు సందేశాలను పంపే అవకాశం ఉంది. వాట్సాప్‌ డేటాను బ్యాకప్‌ చేసుకోకుండా కొత్త ఫోన్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది.

కానీ ఒకవేళ ఫోన్‌ పోయినా దొంగతనానికి గురైనా మన వాట్సాప్‌ ఖాతా, అందులోని సమాచారం భద్రంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి. మన ఫోన్‌ పోయినప్పుడు తొలుత మనం సర్వీస్‌ ప్రొవైడర్‌కు కాల్‌ చేసి సిమ్‌ కార్డును లాక్‌ చేయించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఫోన్‌లోని వాట్సాప్‌ ఆప్షన్‌ డిజేబుల్‌ అవుతుంది. ఆ సమయంలో ఫోన్‌ను వాడటం కుదరదు. ఒకవేళ యాక్టివేట్‌ చేయాలంటే మరో నెంబర్‌కు మెసేజ్‌ కానీ, ఫోన్‌ కానీ చేయాలి.

ఒకవేళ కొత్త ఫోన్‌ తీసుకుంటే కొత్త సిమ్‌ కార్డుతో వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఒకవేళ సిమ్‌ కార్డు యాక్టివేట్‌ అవడంలో ఆలస్యమైతే వాట్సాప్‌ కస్టమర్‌ కేర్‌కు ఈమెయిల్‌ పంపొచ్చు. 'నా ఫోన్‌ పోయింది. ఖాతాను డీయాక్టివేట్‌ చేయండి' అని మెసేజ్‌ చేయాల్సి ఉంటుంది. మెయిల్‌లో మన భారతదేశ కోడ్‌తో పాటు ఫోన్‌ నంబర్‌ను కూడా పంపాల్సి ఉంటుంది. వాట్సాప్‌ ఖాతా డీయాక్టివేటైనా కూడా మన మిత్రుల కాంటాక్ట్స్‌ నుంచి మెసేజ్‌లు వస్తుంటాయి. నెల రోజుల పాటు ఆ మెసేజ్‌లు పెండింగ్‌లో ఉంటాయి. 30 రోజుల తర్వాత కూడా వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేసుకోకపోతే ఖాతా శాశ్వతంగా డిలీట్‌ అయ్యే అవకాశం ఉంది.

Read more about: whatsapp
English summary

వాట్సాప్ వాడుతున్నవారికి బ్యాడ్ న్యూస్ | Whatsapp News

There are many types of apps that can not be used on smartphones nowadays and if they have a smart phone, but there is one pace book and Watsap that is exactly the same on everybody's phone. These two apps are currently in trades and that's why you say it's a bitter news for those who use Watsapp.
Story first published: Wednesday, January 23, 2019, 16:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X