పెట్రోల్ ధరలు:దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి.
రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు ఆరురోజుల వరుస పెంపు తరువాత చమురు మార్కెటింగ్ కంపెనీలు బుధవారం ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు.
న్యూఢిల్లీ: రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు ఆరురోజుల వరుస పెంపు తరువాత చమురు మార్కెటింగ్ కంపెనీలు బుధవారం ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.71.27 రూపాయలకు, డీజిల్ రూ.65.90 రూపాయలకు విక్రయించబడుతోంది.

ముంబైలో పెట్రోలు రూ .76.90 వద్ద రిటైలింగ్ అవుతుండగా, డీజిల్ లీటరు రూ. 69.01 ఉంది. కోల్కతాలో పెట్రోలు లీటరుకు రూ.73.36 రూపాయలు చెల్లించగా, డీజిల్ ధర లీటరుకు రూ .67.68 వద్ద ఉంది. చెన్నైలో పెట్రోలు, డీజిల్ ధర 73.99 రూపాయలు, రూ.69.62 రూపాయల వద్ద నిలిచింది.
నోయిడా, గురుగ్రాంలలో రిటైల్ పెట్రోలు ధర రూ. 70.97 మరియు రూ.71.99 మరో వైపు డీజిల్ నోయిడాలో రూ. 65.06 ,గురుగ్రాంలో రూ .65.67 చొప్పున ధర ఉందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ నుంచి ఈ సమాచారం వెల్లడైంది.
గత ఏడాది అక్టోబర్ 4 వరకు కొన్ని నెలలు రిటైల్ ఇంధన ధరల పెరుగుదల భరత్ లో రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది. ఢిల్లీలో పెట్రోలు ధర రూ.84 రూపాయలకు చేరుకుంది. ముంబైలో రూ.91 రూపాయలు దాటింది.
భారతదేశంలో పెట్రోలు,డీజిల్ ధరల పెరుగుదల గ్లోబల్ క్రూడ్ ధరలు, రూపాయి-అమెరికా డాలర్ ఎక్స్చేంజ్ రేటుపై ఆధారపడింది.
అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్కు 61.58 డాలర్లు, 8 సెంట్లు లేదా 0.1 శాతం లాభాలతో ముగిశాయి.


Click it and Unblock the Notifications