మంగళవారం నాడు వరుసగా ఆరవ రోజు ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోలు పై 13-14 పైసలు పెరగగా, డీజిల్ పై ధర 19 నుంచి 21 పైసలు పెరిగింది.
న్యూఢిల్లీ: మంగళవారం నాడు వరుసగా ఆరవ రోజు ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోలు పై 13-14 పైసలు పెరగగా, డీజిల్ పై ధర 19 నుంచి 21 పైసలు పెరిగింది. ఢిల్లీలో పెట్రోలు ధర సోమవారం రూ.71.14 రూపాయల నుంచి నేడు రూ.71.27 రూపాయలకు పెరిగింది. డీజిల్ ధర రూ.65.71 రూపాయలకు పెరిగింది.

కోల్‌కతాలో సోమవారం ధరతో పోల్చిచూస్తే 12 పైసలు పెరిగి పెట్రోలు లీటరుకు రూ.73.36 రూపాయలు చెల్లించాల్సి ఉంది అదేవిదంగా డీజిల్ నిన్నటి ధర రూ. 67.49 రూపాయల నుండి 19 పైసలు పెరిగి రూ.67.68 రూపాయలకు చేరుకుంది.
ముంబయిలో రిటైల్ పెట్రోలు ధర సోమవారం ధర తో పోల్చిచూస్తే 13 పైసలు పెరిగి రూ .76.98 కు చేరింది మరియు డీజిల్ ధర లీటరుకు రూ. 68.81 చొప్పున నిన్నటి ధరల నుంచి 20 పైసలు పెంచింది. చెన్నైలో పెట్రోలు రూ.73.99 రూపాయలు, సోమవారం ధర 73.85 గా ఉండగా 14 పైసలు పెరగగా డీజిల్ ధర 69.41 రూపాయల నుండి పెరిగి రూ .69.62 కు చేరుకున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ నుంచి ఈ సమాచారం వెల్లడైంది.
నోయిడాలో రిటైల్ పెట్రోల్ ధర 11 పైసలు పెరిగి రూ.70.97 కి చేరగా,డీజిల్ ధర రూ.65.06 రూపాయలుకు చేరింది. గురుగ్రాంలో పెట్రోలు, డీజిల్ ధర వరుసగా రూ .71.99, రూ .65.67 రూపాయలకు చేరింది.
అక్టోబర్ 4, 2018 న, పెట్రోలు ధర ఢిల్లీలో లీటరుకు 84 రూపాయలు మరియు ముంబైలో 91.34 రూపాయల రికార్డు ధర నమోదుచేశాయి.అదే సమయంలో డీజిల్ ధరలు ఢిల్లీలో రూ .75.45, ముంబైలో రూ. 80.10 రూపాయల ధరలు ఉన్నాయి.
అంతర్జాతీయ చమురు మార్కెట్లో ముడి చమురు ధరలు మంగళవారం పడిపోయాయి. ప్రపంచ ఆర్ధిక వృద్ధిపై ఆందోళనలు తలెత్తాయి. అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 62.64 డాలర్లు, 10 సెంట్లు లేదా 0.2 శాతం క్షీణించాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications