రోజు రోజుకి సరికొత్త ఊహాగానాలు వస్తుంటాయి అలాగే ఈరోజుల్లో ఆధార్ కార్డు న్యూస్ చాలా ఫేమస్ అవుతోంది దీన్లో ఎంత మాత్రం నిజం ఉందొ తెలీదు కానీ ఈ మెసేజ్ మాత్రం వాట్సాప్ లో వైరల్ అవుతోంది.
ఒక కస్టమర్ హోటల్ కి ఫోన్ చేసి బిర్యాని ఆర్డర్ ఇస్తున్నాడు. వారిద్దరి మధ్య సంభాషణ చూడండి. ఆపరేటర్ : హలో... ప్యారడైజ్ హోటల్ ...
కస్టమర్: ఒక ఆర్డర్ తీసుకోండి ప్లీజ్..?
ఆపరేటర్: మొదట మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి సార్
కస్టమర్: ఒక నిమిషం... నా ఆధార్ నెంబర్ "xxxxxxxxxx "
ఆపరేటర్: ఓకే మీ పేరు శ్రీకాంత్ నెంబర్ xx, గాంధీ రోడ్, శ్రీనగర్ కాలనీ నుండి మాట్లాడుతున్నారు. మీ ఇంటి ఫోన్ నెంబర్ xxxxxxxx, ఆఫీస్ నెంబర్ xxxxxxx, మొబైల్ నెంబర్ xxxxxxx. ఇప్పుడు మీరు మీ మొబైల్ నుండి మాకు కాల్ చేశారు.

కస్టమర్: వావ్.. ఇన్ని నెంబర్లు ఎలా సార్ తెలుసుకున్నారు..?
ఆపరేటర్: కేవలం ఒక్క ఆధార్ నంబర్ తో మీ డిటైల్స్ అన్ని తెలిసిపోతాయి sir
కస్టమర్: గుడ్.. నాకు ఒక చికెన్ ఫ్రై బిర్యాని ఆర్డర్ తీసుకుంటారా..?
ఆపరేటర్: సార్ .. నాకు తెలిసినంత వరకు అది వద్దనే చెప్తాను సార్..
కస్టమర్: ఏ.. ఎందుకు ? ఆపరేటర్: మీ మెడికల్ రిపోర్ట్స్ ని బట్టి మీకు కొలెస్ట్రాల్ లెవల్ ఎక్కువగా ఉంది..
కస్టమర్: What..? అప్పుడు నేను ఏమి తినాలి..?
ఆపరేటర్: మా దగ్గర ఉండే Low fat వెజిటబుల్ బిర్యాని ట్రై చేసి చూడండి సార్.. అది బాగా నచ్చుతుంది..
కస్టమర్: నాకు నచ్చుతుంది అని మీకు ఎలా తెలుసు..
ఆపరేటర్: పోయిన వారం మీరు బాబాయ్ హోటల్ లో వెజిటబుల్ బిర్యాని తిన్నారు సార్..
కస్టమర్: మై గాడ్.. చాలు సామీ చాలు.. మీరు చెప్పిన వెజిటబుల్ బిర్యాని ఫ్యామిలీ సైజ్ లో ఇవ్వండి..
ఆపరేటర్: ఖచ్చితంగా సార్... పది మంది ఉన్న మీ కుటుంబానికి అది ఖచ్చితంగా సరిపోతుంది. బిల్ అమౌంటు 2350 రూపాయలు సార్..
కస్టమర్: నేను నా క్రెడిట్ కార్డ్ లో నేను pay చేయచ్చా..? ఆపరేటర్: లేదు సార్.. మీరు క్యాష్ రూపంలోనే చెల్లించాలి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎప్పుడో అయిపోయింది. అదీకాకుండా జనవరిలో మీరు 1,50,648 రూపాయలు క్రెడిట్ కార్డ్ బాకీ పెట్టి ఉన్నారు
కస్టమర్: నేను ఎలాగైనా క్యాష్ రెడీ చేస్తాను. మీరు బిర్యాని పంపండి. ఎంత టైం పడుతుంది..?
ఆపరేటర్: 45 నిమిషాలు పడుతుంది సార్.. అంతసేపు మీరు వెయిట్ చేయలేకపోతే మీ బైక్ లో వచ్చి మీరే తీసుకెళ్ళచ్చు సార్..
కస్టమర్: What.? ఆపరేటర్: మీ ఆధార్ కార్డు ప్రకారం మీ దగ్గర ఒక బైక్ ఉంది. దాని నెంబరు 1122
కస్టమర్: మీరు ప్రకటన లో చెప్పిన విధంగా ఆ మూడు ఫ్రీ కోక్ బాటిల్స్ కలిపి పంపండి.
ఆపరేటర్: బిర్యాని మాత్రమే పంపిస్తాం సార్ మీ మెడికల్ రిపోర్ట్ ప్రకారం మీ ఆరోగ్యాన్ని దృష్ఠిలో ఉంచుకుని మీకు ఆ కోక్ ని ఇవ్వలేం సార్..
కస్టమర్: *%&$%%### You $##$%%@!))) (ఇక్కడ రాయలేని మాటలు) ఆపరేటర్: సార్ .. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి సార్.. ఇలానే ఒక పోలీస్ దగ్గర తిట్టినందుకు కోర్టు మీకు రెండు నెలల జైలు శిక్ష మరియు 5000 రూపాయల జరిమానా విధించింది మర్చిపోయారా?
కస్టమర్: ఢాం అని కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. చదివేటపుడు చూసేటపుడు ఇది సరదాగానే ఉంటుంది కానీ ప్రభుత్వం ప్రతీ దానికి ఆధార్ కార్డ్ ను లింక్ పెడుతుంది దీని కోసమే. భవిష్యత్తులో జరగబోయేది ఇదే అందరూ తెలుసుకోండి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications