వరుసగా ఐదవరోజు పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగాయి.ధరలు పరిశీలించండి.
న్యూఢిల్లీ:పెట్రోలు, డీజిల్ ధరలు చమురు మార్కెటింగ్ కంపెనీలుసోమవారం నాడు వరుసగా ఐదో రోజు పెంచాయి. సోమవారం ధరల సమీక్ష తరువాత పెట్రోలు 18-20 పైసలు పెరిగింది అలాగే డీజిల్ ధర 26-28 పైసలు పెరిగింది. ఢిల్లీలో పెట్రోలు ధర రూ.71.14 రూపాయలకు పెరిగింది. ఆదివారం రూ .70.95 గా ఉండగా,డీజిల్ ధర రూ.65 .47 నుండి పెరిగి సోమవారం రూ.65.71 రూపాయలకు చేరుకుంది.

ముంబయిలో దేశ వాణిజ్య రాజధానిలో లీటరు పెట్రోలు రూ.76.77 రూపాయల చొప్పున ఉండగా నిన్నటి ధర రూ.76.58 రూపాయలుగా ఉంది, డీజిల్ లీటరుకు రూ.68.81 రూపాయలకు విక్రయించింది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ నుండి డేటా ప్రకారం నిన్న ధర కంటే 28 పైసలు అధికంగా పెరిగాయి.
కోల్కతా, చెన్నైలలో పెట్రోల్ ధర 18 నుంచి 20 పైసలు పెరిగి రూ.73.23 ,రూ.73.85 కి చేరుకుంది. అయితే, డీజిల్ ధర వరుసగా రూ .67.49 మరియు రూ .69.41 రూపాయలుగా ఉంది.నోయిడాలో పెట్రోల్ ధర రూ. 70.86 పెరిగి డీజిల్ ధర 64.904 రూపాయలకు చేరుకుంది. గురుగ్రాంలో పెట్రోలు ధర రూ.71.89 రూపాయలకు పెరిగింది. డీజిల్ ధర రూ. 65.51 కు చేరుకుంది.
దేశీయ ముడి చమురు ధర, రూపాయి-డాలర్ మార్పిడి రేటుపై ఆధారపడి రిటైల్ ఇంధన ధర ఉంటుందని గమనించవచ్చు. దేశంలో చమురు అవసరాలకు 80 శాతం దిగుమతి చేస్తుంది. అక్టోబర్ 4, 2018 న పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ.84 రూపాయలు చేరుకుంది. అదే సమయంలో ముంబైలో రూ.91 రూపాయలకు పైన నమోదయింది.
చమురు ధరలు సోమవారం పడిపోయాయి, చైనా ఆర్ధిక వృద్ధి 28 ఏళ్లలో అతి తక్కువగా నమోదయింది, అయినప్పటికీ పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (OPEC) నేతృత్వంలోని ఉత్పత్తి తగ్గింపుల వలన ముడి ధరలు కొంతవరకు మంచి మద్దతును కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్కు 62.57 డాలర్లు, 13 సెంట్లు లేదా 0.2 శాతం తగ్గాయి.