ఢిల్లీ: భారత దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందిన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌కు చెక్ పెడుతూ కొత్తగా ఇంజిన్ రహిత రైలు ట్రైన్ 18ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడ్డ ఈ రైలును ఇతర దేశాల్లో కూడా ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సింగపూర్ కౌలాలంపూర్ మధ్య ఈ హైస్పీడ్ రైలును పరుగులు పెట్టించే దిశగా భారత ప్రభుత్వం అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ట్రైన్ 18 పట్ల మిడిల్ ఈస్ట్ దేశాలు, దక్షిణ అమెరికా, పలు ఆసియా దేశాలు, యూరప్ దేశాలు ఆసక్తిని కనబర్చినట్లు రైల్వే బోర్డు అధికారి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. అంతేకాదు వివిధ దేశాల్లో పనిచేస్తున్న భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు అంతా ఒకరోజు సమావేశమైనప్పుడు ఈ ట్రైన్ గురించి ఆసక్తి విషయాలను ప్రెజెంటేషన్ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినట్లు సమాచారం. తిరిగి ఆయాదేశాలకు అధికారులు వెళ్లినప్పుడు ట్రైన్ 18 యొక్క విశిష్టత గురించి అక్కడ వివరిస్తే ఆ దేశ ప్రభుత్వాలు రైలు కొనుగోలుకు ఆసక్తి కనబర్చే అవకాశం ఉందని మోడీ చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఆయాదేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతాయనే ఆలోచనలో ప్రధాని ఉన్నారు.

ఇతర దేశాల్లో తయారు అవుతున్న హైస్పీడు రైళ్ల ధరతో పోలిస్తే సాంకేతికంగానూ ఇటు ధర పరంగాను ట్రైన్ 18 బాగుందని రాజేష్ అగర్వాల్ తెలిపారు. అంతేకాదు ధర విషయానికొస్తే ఇతర దేశాల్లో తయారయ్యే హైస్పీడ్ రైళ్లతో పోలిస్తే భారత్‌లో తయారైన ట్రైన్ 18 ధర 25 శాతం తక్కువే ఉందని స్పష్టం చేశారు.అందుకే ప్రపంచ మార్కెట్లో తాము ప్రవేశించి ట్రైన్ 18 విశిష్టతను చాటాలని భావిస్తున్నట్లు రాజేష్ తెలిపారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు ముందుకేస్తోందని రాజేష్ అగర్వాల్ తెలిపారు.
2018లో సింగపూర్-కౌలాలంపూర్ రైల్వే ప్రాజెక్టును మలేషియా ప్రధాని మహతిర్ మొహ్మద్ తిరస్కరించారని ఆ తర్వాత ధరల విషయం చూసి తిరిగి మొగ్గు చూపారని అగర్వాల్ వెల్లడించారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, యూరప్ దేశాలు ట్రైన్ 18పై ఆసక్తి కనబరుస్తున్నట్లు అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ వారణాసిల మధ్య ఈ హైస్పీడు ట్రైన్ పరుగులు తీయనుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు పరుగులు తీస్తుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications