ప్రస్తుతం భారతదేశం మొత్తం బయో పిక్ పరంపర కొనసాగుతోంది సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ కూడా వస్తోంది అంటే మీరే ఆలోచించాలి సంక్రాంతి సంధర్బంగా నందమూరి తారక రామారావు గారి బయో పిక్ కథానాయకుడుగా తన కుమారుడు నందమూరి బాలకృష్ణ నటించారు.

వచ్చే నెల:
ఇక వచ్చే నెల కూడా ఈ నందమూరి తారకరామారావు గారి బయో పిక్ సెకండ్ పార్ట్ మహా నాయకుడు కూడా విడుదల కాబోతోంది దీనికి పోటీగా వైస్ రాజశేఖర్ రెడ్డి గారి బయో పిక్ కూడా వస్తోంది అదే యాత్ర.

రామ్ గోపాల్ వర్మ:
ఇక నందమూరి తారక రామారావు గారి మీద ఇంకో బయోపిక్ కూడా వస్తోంది అదే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అని అది కూడా పోటీలో ఉంది.

కెసిఆర్:
ఇక ఈ బయోపిక్ సినిమాలు రావడానికి కారణం కొన్ని నెలనెల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు అని కొందరు అనుకుంటున్నారు. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల వేళా కూడా కెసిఆర్ మీద కూడా కొన్ని సినిమాలు వచ్చాయి.

నారాయణ మూర్తి:
ఇక ఇప్పుడు సినిమా స్టార్స్ మరియు రాజకీయ నాయకుల తర్వాత సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్స్ వంతు వచ్చింది ఇంతకీ ఎవరి బయోపిక్ వస్తోందో తెలుసుకుందాం
నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులుగా ప్రముఖ వ్యాపార దిగ్గజం నారాయణ మూర్తి పేరు తెలియని వారుండరు. తన భార్య సుధా నారాయణ మూర్తి వద్ద రూ.10,000 మొత్తాన్ని రుణంగా తీసుకుని చిన్న వ్యాపారంతో తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించిన నారాయణ మూర్తి ఆ తర్వాత అంచలంచెలుగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ పెద్ద వ్యాపార దిగ్గజంగా ఎదిగిన సంగతి తెలిసిందే.

బయోపిక్:
ఇన్ఫోసిస్ సంస్థను అంతర్జాతీయ మార్కెట్‌లో ఓ బ్రాండ్‌గా తీర్చిదిద్దడం వెనుక నారాయణ మూర్తి చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆ విశేషాలన్నింటినీ ప్రస్తావిస్తూ ప్రముఖ ఫిలింమేకర్ సంజయ్ త్రిపాఠి ఓ బయోపిక్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

లైవ్‌మింట్:
ఎనిమిది నెలల క్రితమే నారాయణ మూర్తి కలిసిన సంజయ్ త్రిపాఠి ఆయనను అతికష్టమ్మీద ఈ బయోపిక్‌కి ఒప్పించినట్టు సమాచారం. సంజయ్ త్రిపాఠి సన్నిహితమిత్రులే ఈ విషయాన్ని వెల్లడించారని, అయితే, వారు తమ పేర్లు బహిర్గతం చేయడానికి నిరాకరించారని లైవ్‌మింట్ ఓ కథనంలో పేర్కొంది. లైవ్‌మింట్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం నారాయణ మూర్తి మూవీ స్క్రిప్ట్ దశలో వున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications