For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్ కి మరో పెద్ద కంపెనీ భూమి పూజ చేసిన చంద్రబాబు

By girish
|

ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రతి ఒక కంపెనీ హైదరాబాద్ వచ్చేవి ఇక చదువు అయిపోగానే అంతా హైదరాబాద్ బెంగుళూరు వెళ్తున్నారు. కానీ కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రములో కొత్త రాజధాని అమరావతికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా మరో కొత్త కంపెనీ అమరావతిలో తిష్ట వేయడానికి ముందుకు వచ్చింది.

అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ వస్తోంది. ఎక్స్ఎల్ఆర్ఐ-జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమిపూజ నిర్వహించారు. జెస్యుట్ మిషనరీ నిర్వహణలో ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటవుతోంది. ఈ విద్యాసంస్థకు తుళ్లూరు మండలం ఐనవోలు వద్ద 50 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. దేశంలో నోయిడా, ముంబై తర్వాత ఆంధ్ర రాజధాని అమరావతిలోనే తన నాలుగో క్యాంపస్‌ను ఆ విద్యాసంస్థ ఏర్పాటు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ కి మరో పెద్ద కంపెనీ భూమి పూజ చేసిన చంద్రబాబు

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర విద్యా సంస్థలకు 2911 ఎకరాలు కేటాయించామన్నారు. ప్రతిష్టాత్మకమైన ఎక్స్ఎల్ఆర్ఐ- జేవీయర్ మేనేజ్మెంట్ స్టడీస్ సంస్థ దక్షిణాదిలో తొలిసారిగా అమరావతికే వచ్చిందని.. అమరావతి ఖ్యాతి ఏంటో ఈ సంస్థ ఏర్పాటు ద్వారా తెలుస్తోందని అన్నారు.

రాజధానికి ఇంత భూమి ఎందుకని అంటున్న వారికి ఇటువంటి సంస్థల ఏర్పాటే సమాధానమని చెప్పారు. 34 వేల ఎకరాలు సమీకరించకుంటే విట్, ఎస్ఆర్ఎం, అమృత్, ఎక్స్ఎల్ఆర్ఐ వంటి సంస్థలు వచ్చేవే కావన్న బాబు.. రూ.230 కోట్ల ఖర్చుతో 50 ఎకరాల్లో ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థను ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తోందంటే.. దానికి కారణం రాజధాని రైతులేని బాబు అన్నారు.

Read more about: chandrababu naidu
English summary

ఆంధ్రప్రదేశ్ కి మరో పెద్ద కంపెనీ భూమి పూజ చేసిన చంద్రబాబు | New Company Came to Andhra Pradesh

every company is going to Bangalore Hyderabad. But in the newly formed state, the companies are kicking the new capital, Amravati. Another new company has come forward to amalgamate in Amravati.
Story first published: Thursday, January 17, 2019, 14:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X