పెట్రోల్ ధరలు:గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు నేడు పెరిగాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోలు, డీజిల్ ధరలు గురువారం మరోసారి పెరిగాయి. గురువారం పెట్రోల్,డీజిల్ ధరలు దేశంలోని వివిధ నగరాల్లో లీటరుకు 28-42 పైసలు పెరిగాయి.
న్యూఢిల్లి: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోలు, డీజిల్ ధరలు గురువారం మరోసారి పెరిగాయి. గురువారం పెట్రోల్,డీజిల్ ధరలు దేశంలోని వివిధ నగరాల్లో లీటరుకు 28-42 పైసలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు రూ. 68.88 చొప్పున ధర పెరిగింది నిన్న ధర రూ. 68.50 రూపాయలుగా ఉంది, డీజిల్ రూ.62.53 రూపాయల వద్ద విక్రయించింది. నిన్నటి ధర 62.24 రూపాయలు అంటే 29 పైసలు పెరిగింది.

ముంబయిలో పెట్రోలు రూ.74.53 రూపాయలు, బుధవారం 74.16 రూపాయల చొప్పున ఉండగా 37 పైసలు పెరిగింది.అదేవిదంగా డీజిల్ ధర రూ .65.43 రూపాయలు నిన్నటితో పోల్చిచూస్తే 31 పైసలు పెరిగింది. నోయిడాలో పెట్రోల్ ధర 29 పైసలు పెరిగి రూ.69.79 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధర రూ.62.18 రూపాయలకు పెరిగింది. గురుగ్రాంలో, పెట్రోలు, డీజిల్ ధర వరుసగా రూ .70.12 మరియు రూ.62.79 గా నమోదయ్యాయి.
చెన్నై, కోలకతా వంటి నగరాల్లో పెట్రోల్ రిటైల్ మార్కెట్లో రూ. 71.47 మరియు రూ.71.01 రూపాయలు ఇక బుధువారం ధర చూస్తే రూ.71.07, రూ .70.64 గా ఉంది. అదేవిధంగా డీజిల్ ఈ రెండు నగరాల్లో గురువారం నాడు రూ.66.01 రూపాయలు మరియు రూ.64.30 రూపాయల ధరలు నమోదయ్యాయి.
అంతర్జాతీయ ముడి చమురు ధరలు బుధవారం కూడా అధిక స్థాయిలో పెరిగాయి. 2019 లో బ్రెట్ క్రూడ్ ఫ్యూచర్స్ మొదటిసారి బ్యారెల్ మార్క్కి $ 60 దాటింది. గ్లోబల్ మార్కెట్లలో యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా త్వరలో ప్రపంచ ఆర్థిక వృద్ధిని తగ్గిపోతున్న వాణిజ్య వివాదాలను ముగించవచ్చనే ఆశతో, గురువారం, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు $ 60.84 వద్ద ట్రేడ్ అయ్యాయి, అంతకు ముందు 0.96 శాతం తగ్గాయి. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో ముడి ధరలు 10 శాతం పెరిగాయి.


Click it and Unblock the Notifications