దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్ల ధరలు రూ. 899 మరియు రూ. 3,399,పరిమిత కాల ఆఫర్ ను ఇండిగో ప్రకటించింది.
దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లు ధరలు రూ. 899 మరియు రూ. 3,399,పరిమిత కాల ఆఫర్ ను ఇండిగో ప్రకటించింది. సోమవారం, జనవరి 13, 2015 వరకు ఇండిగో ఎయిర్లైన్స్ ఆఫర్ టిక్కెట్లు చెల్లుబాటు అవుతాయని దేశం లోని అతిపెద్ద ఎయిర్లైన్స్ సంస్థ మైక్రోబ్లాగింగ్ వెబ్సైటు ట్విట్టర్ లో తెలిపింది.ఇండిగో వెబ్సైటు ప్రకారం డిస్కౌంట్ ఆఫర్ కింద పొందిన టికెట్ల ప్రయాణం, వినియోగదారులు జనవరి 24, 2019 మరియు ఏప్రిల్ 15, 2019 మధ్య ప్రయాణం చేయాలి అని- goindigo.in లో తెలిపింది.అంతే కాకుండా 'MobiKwik' వాలెట్ ఉపయోగించి టికెట్ బుక్ చేసుకున్న వారికి రూ.500 సూపర్ క్యాష్ ఆఫర్ ను కూడా ఇండిగో ప్రకటించింది.

డిస్కౌంట్ ఆఫర్ పొందేందుకు,నిష్క్రమణ తేదీకి కనీసం 15 రోజుల ముందు టిక్కెట్లు బుక్ చేసుకొని ఉండాలి మరియు ప్రయాణ తేదీ ఏప్రిల్ 15, 2019 తర్వాత ఉండకూడదు అని ఇండిగో వెల్లడించింది. అయితే, ఇండిగో యొక్క దేశీయ మరియు అంతర్జాతీయ నెట్వర్క్లో ప్రత్యక్ష విమానంలో మాత్రమే ఈ ఆఫర్ చెల్లుతుంది. ఆఫర్ ఏ ఇతర ఆఫర్ లేదా ప్రమోషన్తో కలిపి ఉండకూడదు మరియు సమూహ బుకింగ్లపై చెల్లదు.
ఎయిర్పోర్ట్ ఛార్జీలు మరియు ప్రభుత్వ పన్నులపై రాయితీ వర్తించదు అని వైమానిక సంస్థ పేర్కొంది.
దేశంలో దేశీయ పౌర విమానయాన రంగంలో అధిక పోటీని కలిగి ఉన్న నేపథ్యంలో ఇండిగో ఈ ఆఫర్ తో ముందుకొచ్చింది. ప్రయాణీకులను ఆకర్షించడానికి కొత్త మార్గాలను కూడా ఎయిర్లైన్స్ అనుసరిస్తున్నాయి.
మార్కెట్ వాటా ప్రకారం దేశం లో రెండవ అతిపెద్ద క్యారియర్ జెట్ ఎయిర్వేస్ 50 కూడాశాతం తగ్గింపును దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్ల కోసం పరిమిత కాల ఆఫర్లో
భాగంగా అందిస్తోంది.ఎయిర్లైన్స్ వెబ్సైట్ ప్రకారం ఈ డిస్కౌంట్ ఆఫర్ జనవరి 11, 2019 వరకు చెల్లుతుంది.స్పైస్ జెట్ 12 కొత్త దేశీయ విమానాలను ప్రవేశపెట్టి టిక్కెట్ల ప్రారంభ ధర కేవలం రూ. 1,497 రూపాయలు.


Click it and Unblock the Notifications