For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంక్రాంతి కీ నిరుద్యోగులకు కేసి.ఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త...!

By girish
|

ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగ యువతకి తెలంగాణ సర్కార్ ఈ సంక్రాంతి పండగకి తీపి కబురు అందించేందుకు ప్లాన్ చేసింది. వారం రోజులో 1800 గురుకుల టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది.

పూర్తి వివరాలు:

పూర్తి వివరాలు:

ఇక ఈ నోటిఫికేషన్ పోస్టులలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్ట్లు ఉంటాయి అని తెలిపింది ఇక దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా!

నీళ్లు-నిధులు- నియామకాల:

నీళ్లు-నిధులు- నియామకాల:

నీళ్లు-నిధులు- నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం పుట్టింది ఇక తెలంగాణ సాధన వరకు ఈ మూడు పదాలు చాలా ప్రధానంగా నిలిచాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నియామకాల విషయంలో తొలి నాలుగు సంవత్సరాలు తెలంగాణ సర్కార్ దారుణంగా విఫలమైంది.

తొలి ఏడాదిలోనే:

తొలి ఏడాదిలోనే:

తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని తెలంగాణ రాకముందు చెప్పిన మాటలు ఆచరణలో సాధ్యం కాలేదు ఉద్యమకాలంలో నోటిఫికేషన్లు వేయకుండా అడ్డుపడిన దాఖలాలు ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఎలాంటి సహాయం లేని పాలనా సాగింది.

తెలంగాణ సర్కార్:

తెలంగాణ సర్కార్:

అందుకే ఈ సారి నిరుద్యోగులకు మేలు చేయాలని ఉద్యోగ నోటిఫికెషన్స్ మీద భారీ ద్రుష్టి సాగించింది తెలంగాణ సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 119 మహాత్మా గురుకుల పాఠశాలలో 1800 టీచింగ్ పోస్టులను జనవరిలో జారీ చేయనుంది అని సమాచారం.

టీచింగ్ మరియు నాన్ టీచింగ్:

టీచింగ్ మరియు నాన్ టీచింగ్:

ఈ స్కూళ్లు 2019 లో ప్రారంభం అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ గురుకుల నిర్వహణ కోసం టీచింగ్ మరియు నాన్ టీచింగ్ కలుపుకొని ఒక్కొక్కొ గురుకులంలో 34 టీచర్ పోస్టులు చెప్పున 4046 పోస్టులు అవసరము అని గుర్తించారు.

 బీసీ సంక్షేమ శాఖ:

బీసీ సంక్షేమ శాఖ:

అలాగే ఒక్కోకో స్కూల్ కు ICT పోస్ట్ మంజూరు చేయడంతో మరో 119 పోస్టులు కలిశాయి. మొత్తం కలిపి 4165 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వానికి బీసీ సంక్షేమ శాఖ ఫైల్ పంపింది.

తరగతులు:

తరగతులు:

అయితే 2019 - 2020 విద్య సంవత్సరంలో నియోజకవర్గంలో ప్రారంభం కానున్న 119 బీసీ గురుకుల పాఠశాలలో 5 మరియు 6 తరగతులు మాత్రమే ప్రారంభిస్తారు. దింతో విద్యార్థుల సంఖ్య అనుగుణంగా 1800 టీచింగ్ పోస్టుల భర్తీ చేయనున్నారు.

అవుట్ సోర్సింగ్ తరహాలో:

అవుట్ సోర్సింగ్ తరహాలో:

ఇందులో ఎక్కువగా టిజిటి పోస్టులు భర్తీ చేయనున్నారు అలాగే మరో 300 నాన్ టీచింగ్ పోస్టులను అవుట్ సోర్సింగ్ తరహాలో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు భర్తీ కోసం వారం రోజుల్లోగా ఆర్ధిక శాఖ నుంచి అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు బీసీ సంక్షేమ శాఖ వర్గాలు తెలిపాయి.

 నిరుద్యోగ యువత:

నిరుద్యోగ యువత:

అయితే 4165 పోస్టులలో 1800 పోస్టులు పోను మిగిలిన పోస్టులను వచ్చే విద్య సంవత్సరంలో భర్తీ చేసే అవకాశం ఉంది అని సమాచారం. రెండోసారి అధికారం తీసుకున్న తెరాస సర్కార్ నిరుద్యోగ యువత తమ మీద ఆగ్రహంగా ఉన్నారు అని తెలుసుకొంది అందుకే రెండో సారి అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కోసం ఇలా చేస్తోంది.

తెలంగాణలో:

తెలంగాణలో:

మొత్తం తెలంగాణలో లక్ష పైన ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని ఈసారి తెలంగాణాలో ఉన్న నిరుద్యోగులు అంతా సంతోషంగా ఉంచడమే మా లక్ష్యం అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.

Read more about: telangana
English summary

సంక్రాంతి కీ నిరుద్యోగులకు కేసి.ఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త...! | Good News to telangana Unemployed

The Telangana Sarkar, a Telangana unemployed youth waiting for job notification, has planned to offer a sweets to the Sankranthi festival. Telangana Sarkar is working to issue a notification for teaching posts to 1800 teachers in a week.
Story first published: Thursday, January 10, 2019, 14:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X