ఈరోజుల్లో వాట్సాప్ అంటే తెలియని వారు అలాగే వాట్సాప్ వాడనివారు ఎవరు ఉండరు. కానీ దీనిని అలుసుగా తీసుకోని సైబర్ నేరగాళ్లు మాల్ వైరస్ యాప్ ని వాట్సాప్ గోల్డ్ పేరుతో షేర్ చేసి సైబర్ దాడులకు పాల్పడుతున్నారు.

వాట్సాప్ గోల్డ్:
అయితే వాట్సాప్ గోల్డ్ పేరుతో 2016 లో ఫేక్ మెసేజీలు వైరల్ కావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాట్సాప్ గోల్డెన్ యాప్ వైరల్ అవుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ లింక్ క్లిక్ చేస్తే చాలు మీ డేటా మొత్తం ఫేసక్ అవుతుంది అని చెబుతున్నారు.

సైబర్ నేరగాళ్ల:
డబ్బు ఉన్నవారి కోసం ఈ యాప్ ప్రధానంగా రూపొందించబడింది అని వచ్చిన లింక్ అపి క్లిక్ చేయండి ఉచితంగా సేవలు పొందండి యాప్ ఇంస్టాల్ చేసుకోండి ఇలా ఇంస్టాల్ చేస్తే మీ యాప్ గోల్డ్ కలర్లో కి మారుతుంది అని మెసేజ్ లో ఉంటుంది ఆలా సేవలకు ఆశించిన వినియోగదారుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుంటున్నారు.కొద్దీ సేపు తర్వాత తమ డేటా మొత్తం పోయింది అని లబో దిబో అంటున్నారు అని కావున అందరు జాగ్రత్తగా ఉండలు అని సైబర్ నిపుణులు అంటున్నారు.

ప్రభావంతమైన వైరస్:
వాస్తవానికి ఇది ఒక యాప్ కాదు ఇది ఒక మాల్ వేర్ వైరస్ అని అత్యంత ప్రభావంతమైన వైరస్ అని వారు చెప్పుకొచ్చారు దీనిపట్ల అందరు అప్రమతంగా ఉండాలి అని లేకపోతే భారీగా నష్టపోతారు అని చెబుతున్నారు నిపుణులు ఇలాంటి మెసేజీలు వచ్చినప్పుడు క్లిక్ చేయకుండా డిలీట్ చేయాలి.

మీ ఫోన్ లో చేరితే:
ఒక్కసారి ఈ వైరస్ మీ ఫోన్ లో చేరితే మీ వ్యక్తిగా వివరాలు, బ్యాంకింగ్ వివరాలు, ఫోటోలు, క్రెడిట్ కార్డు వివరాలు ఇలా మీ ఫోన్ లో ఉన్న డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్ళిపోతుంది.

వాట్సాప్ గోల్డ్ కలర్:
ఇప్పటికే తమ వాట్సాప్ గోల్డ్ కలర్ లోకి మారింది అని చాలామంది సంతోషిస్తున్నారు అది భయంకరమైన వైరస్ అని అది ఇంస్టాల్ చేసుకుంటే బుక్ అయ్యారు అనే సంగతి గ్రహించుకొనే లోపే జరగరాని నష్టం జరిగిపోతుంది.

క్లిక్ చేయకుండా:
అందుకే మీకు వాట్సాప్ గోల్డ్ మెసేజ్ వస్తే క్లిక్ చేయకుండా డిలీట్ చేయండి . ఇక మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే వాట్సాప్ నుంచి ఏ అప్ డేట్ అయినాసరే నేరుగా ప్లే స్టోర్ నుంచి వస్తుంది కానీ ఇలాంటి బయట నుంచి రావు అని గమనించుకోవాలి

యాంటీ వైరస్ ఇంస్టాల్:
ఇక మీ స్మార్ట్ ఫోన్ లో యాంటీ వైరస్ ఇంస్టాల్ చేసుకోవాలి ఈ విషయాన్ని షేర్ చేస్తూ అందరిని హెచ్చరించాల్సిన అవవసరము ఉంది. స్మార్ట్ యుగంలో స్మార్ట్ గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications