For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అట్టర్ ప్లాపైనా రూ.100 కోట్లు దాటినా సినిమా

By girish
|

భారీ క్రేజ్ తో రూపొందే మల్టీ స్టారర్స్ కు ఉండే సౌలభ్యం దేనికి ఉండవు. ముఖ్యంగా డిజిటల్ విప్లవం మొదలయ్యాక నిర్మాతల ఆదాయ వనరులు అమాంతం పెరిగిపోయాయి. ఒక్క అమెజాన్ ప్రైమ్ వచ్చాక ఎన్ని విప్లవాత్మక మార్పులు వచ్చాయో చూస్తూనే ఉన్నాం. ఇక ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసే సౌలభ్యం వల్ల నష్టపోయే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. తాజాగా తగ్స్ అఫ్ హిందూస్తాన్ దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. ఈ ఏడాది వచ్చిన అత్యంత దారుణమైన డిజాస్టర్స్ లో ఫస్ట్ ర్యాంక్ కోసం పోటీ పడిన ఈ అమితాబ్ అమీర్ ఖాన్ల మల్టీ స్టార్ బాక్స్ ఆఫీస్ దగ్గర తుస్సుమన్న సంగతి తెలిసిందే.

అట్టర్ ప్లాపైనా రూ.100 కోట్లు దాటినా సినిమా

విషయానికి వస్తే దీనికైన బడ్జెట్ సుమారు 240 కోట్లు. కాంబో మీద క్రేజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫైనల్ రన్ లో 100 కోట్ల దాకా తెచ్చింది. ఇది షేర్ రూపంలో వచ్చింది. ఇక రిలీజ్ కు ముందున్న హైప్ వల్ల శాటిలైట్ డిజిటల్ హక్కుల ద్వారా మరో 140 కోట్లు వచ్చాయి. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ ఇక్కడ పెద్ద ప్లస్ అయ్యింది. అంటే మొత్తం పెట్టుబడి ఈ రెండు మార్గాల్లోనే వచ్చింది. కథ ఇక్కడితో అయిపోలేదు. మ్యూజిక్ ఆడియో వీడియో రైట్స్ కు మరో 15 కోట్లు ముందే వచ్చి పడ్డాయి.

ఇటీవలే చైనాలో విడుదల చేసారు. అమీర్ ఉన్నాడు కాబట్టి మంచి ధరకు సేల్ అయ్యింది. దాన్నుంచి మరో 110 కోట్లు తోడయ్యాయి. అంటే మొత్తంగా పెట్టుబడిని మైనస్ చేసుకుని చూసుకున్నా 125 కోట్ల రూపాయలు లాభం వచ్చిందన్న మాట. మరి నష్టపోయింది ఎవరు అనే డౌట్ రావొచ్చు. డిస్ట్రిబ్యూటర్లే అందులో అనుమానం అక్కర్లేదు. నిర్మాత మాత్రం భారీ ఎత్తున సేఫ్ అయ్యాడు. కాకపోతే చెత్త సినిమా అంటే ట్యాగ్ వచ్చింది. అయితేనెం ఇది వ్యాపారం. సినిమా తీసాక లాభం వచ్చిందా లేదా అనేదే ముఖ్యం. సో తగ్స్ అఫ్ హిందూస్తాన్ నిర్మాత యాంగిల్ లో పాస్ అయినట్టే

Read more about: business
English summary

అట్టర్ ప్లాపైనా రూ.100 కోట్లు దాటినా సినిమా | Thugs of Hinduston Got 100 Crores Profit

There is no convenience for multi-starers to be created with a huge craze. Much of the producers' revenue sources have risen abruptly since the digital revolution began. After seeing a single Amazon Prime, we see how many revolutionary changes have come.
Story first published: Tuesday, January 8, 2019, 16:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X