For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్న నరేంద్ర మోడీ ఏంటో మీరే చూడండి.

By girish
|

పెద్ద నోట్ల రద్దు కన్నా ముందే రూ.11, రూ.21 నోట్లు కూడా ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం భావించిందట. దీనిపైన చర్చలు కూడా జరిగాయి. హిందువుల వేడుకలు, పండుగల్లో షగుణ్ అంటే బహుమతి రూపంలో రూ.11, రూ.21, రూ.51 ఇస్తుంటారు. అందుకే అంతే విలువగల నోట్లు ముద్రించాలని కేంద్రం భావించిందట.

రెండేళ్ల క్రితం:

రెండేళ్ల క్రితం:

రెండేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దును సామాన్యులు ఇప్పటికీ మర్చిపోలేరు. రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేసి వాటి స్థానంలో రూ.2,000, రూ.500(కొత్తది), రూ.200 నోట్లను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కానీ మోడీ ప్రభుత్వం ఆలోచించింది ఇంతేనా? కాదని చెబుతోంది ది ప్రింట్ కథనం

పెద్ద నోట్ల రద్దు:

పెద్ద నోట్ల రద్దు:

పెద్ద నోట్ల రద్దు కన్నా ముందే రూ.11, రూ.21 నోట్లు కూడా ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం భావించిందట. దీనిపైన చర్చలు కూడా జరిగాయి. హిందువుల వేడుకలు, పండుగల్లో షగుణ్ అంటే బహుమతి రూపంలో రూ.11, రూ.21, రూ.51 ఇస్తుంటారు. అందుకే అంతే విలువగల నోట్లు ముద్రించాలని కేంద్రం భావించిందట.

ఆర్‌బీఐ:

ఆర్‌బీఐ:

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహ్రుషి ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆర్‌బీఐతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనపై చర్చలు జరిపింది. అసాధారణ విలువగల నోట్లు ప్రవేశపెడితే చలామణిలో సమస్యలు వస్తాయని ఆర్‌బీఐ అభ్యంతరాలు చెప్పడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రతిపాదనలపై కసరత్తు చేసింది. ఒకవేళ ఆర్‌బీఐ కేంద్రం ప్రతిపాదనలకు ఒప్పుకొని ఉంటే ఇప్పుడు రూ.11, రూ.21 నోట్లు చలామణిలో ఉండేవేమో?

ఏటీఎమ్ నుంచి దొంగ నోట్లు వస్తే ఏమి చేయాలో మీకు తెలుసా?

ఏటీఎమ్ నుంచి దొంగ నోట్లు వస్తే ఏమి చేయాలో మీకు తెలుసా?

ఏటీఎమ్ వాడ‌కం అంటే ఒక‌ప్పుడు కేవ‌లం ప‌ట్ట‌ణ వాసుల‌కు మాత్ర‌మే ప‌రిచ‌యం ఉండేది... ఈ పేరు బ్యాంకు ఖాతా ఉన్న ప్రతివారికి పరిచయం అవుతోంది. చాలామంది ఏటీఎమ్‌ అనగానే ఎనీ టైం మనీ అని అనుకుంటారు కానీ దీని అసలు రూపం 'అసింక్రోన‌స్‌ ట్రాన్స్‌ ఫర్ మోడ్'.

ఒక‌ప్పుడంటే:

ఒక‌ప్పుడంటే:

ఒక‌ప్పుడంటే బ్యాంక్‌లో ఉన్న డ‌బ్బులు డ్రా చేయాలంటే బ్యాంక్‌కు వెళ్లి, ఫాం నింపి క్యాషియ‌ర్‌కి ఇస్తే కొంత సేపు వెయిట్ చేసిన త‌రువాత లైన్‌లో నిల‌బ‌డి డ‌బ్బులు తీసుకోవాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. అధునాతన సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన ఏటీఎంలు వ‌చ్చేశాయి. అవి ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మ‌న‌కు అందుబాటులో ఉంటున్నాయి.

అధునాతన టెక్నాలజీని:

అధునాతన టెక్నాలజీని:

ఈ అధునాతన టెక్నాలజీని వియోగించడం చాలా తేలిక. తక్కువ సమయం పడుతుంది. కేవ‌లం పిన్ నంబ‌రు ఎంట‌ర్ చేయ‌డంతోనే సెక‌న్ల‌లో డ‌బ్బు వ‌స్తుంది. మ‌ళ్లీ మీ మొబైల్ నంబ‌రుకు సంక్షిప్త సందేశం వ‌స్తుంది. మ‌రి ఏటీఎమ్‌లోనే దొంగ నోట్లు వ‌స్తే ఎవరైనా మనకు దొంగనోట్లు ఇస్తే ఏం చేస్తాం వాటిని తిరిగి వారికే ఇచ్చేసి మంచి నోట్లని తీసుకుంటాం, కాని ఏటీఎం మెషిన్ నుండే దొంగనోట్లు వస్తే ఏం చెయ్యాలో తెలియక తలపట్టుకుని గ‌గ్గోలు పెడుతాం

రిజర్వ్ బ్యాంకు:

రిజర్వ్ బ్యాంకు:

కానీ వాటిని కూడా అసలైన నోట్లుగా మార్చుకొనే పద్ధతి ఉందని చాలా మందికి తెలియదు.. ఏటీఎంలలో దొంగనోట్లు వస్తే మాములుగా బ్యాంకుకి వెళ్లి అడుగుతుంటాం సదరు బ్యాంకు వాళ్ళు తమకు ఏం సంబంధం తెలియ‌ద‌ని స‌మాధానం చెప్పుతుంటారు కానీ రిజర్వ్ బ్యాంకు నిబంధ‌న‌ల ప్ర‌కారం న‌కిలీ నోట్లు వస్తే బ్యాంకు ద్వారానే అసలైన నోట్లని పొందవచ్చు. కాబ‌ట్టి! ఇది చదివి ఎలా పొందాలో తెలుసుకోండి

విత్ డ్రా:

విత్ డ్రా:

ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేసినపుడు మీకు నోట్లలో గానీ, లెక్కల్లో తేడా అనిపిస్తే అక్కడే ఏటీఎం లోపలే ఉండి వాటిని లెక్కపెట్టాలి. దొంగ నోట్లు అని అనుమానం వచ్చినా, చిరిగిన నోట్లు వచ్చినా అప్పటికప్పుడే ఏటీఎంలోని సీసీ కెమెరా వైపు ఆ నోట్లను చూపించాలి. ఏటీఎంలో మనకు నకిలీ నోట్లు వస్తే వెంటనే అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డుకు సమాచారం ఇవ్వాలి. సెక్యూరిటీ గార్డు దగ్గర ఉండే రిజిస్ట‌ర్‌లో మీరు విత్ డ్రా చేసిన మొత్తం, అసలైన నోట్లు ఎన్ని.. నకిలీ నోట్లు ఎన్ని వచ్చాయి.. ఏటీఎం స్లిప్ నెంబర్, నోటు నంబర్లు, తేది, సమయం వివరాలు రాసి సంతకం చేయాలి.

 మేనేజర్ కి:

మేనేజర్ కి:

ఆ తరువాత బ్యాంకుకి వెళ్లి మేనేజర్ కి ఒక లెటర్ ద్వారా కంప్లైట్ చెయ్యాలి, లెటర్ తో పాటు ఏటీఎం స్లిప్ జీరాక్స్, బ్యాంకు పాస్ బుక్ జీరాక్స్ లని జత చేసి, ఏటీఎం వద్ద రిజిస్టర్ లో రాసిన వివరాలని అందించాలి. బ్యాంకు వారు మీ దగ్గర ఉండే నకిలీ నోట్లని తీసుకోని వాటిని స్కాన్ చేసి నకిలీ నోట్ల కాదా..! అని పరీక్షిస్తారు. అవి నకిలీ నోట్లే అయితే మీరు ఇచ్చిన వివరాలని సరి చూసుకొని సరైన నోట్లని తిరిగి ఇస్తారు. ఇలా కంప్లైంట్ చేసే సమయంలో ఏటియం స్లిప్ ని, నకిలీ(fake note) నోట్లని, కంప్లైంట్ లెటర్ ని ఫోటోలు తీసి పెట్టుకోవడం ఇంకా ఉత్తమమైనది.. ముగింపు రిజర్వ్ బ్యాంకు (RBI) నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్రతి బ్యాంకు పైన చెప్పిన విధంగా చేయాలి.. అలా కాకుండా తమకు ఏం సంబంధం లేదని మాట్లాడితే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చు.

బ్యాంకింగ్:

బ్యాంకింగ్:

రిజర్వ్ బ్యాంకు ఋ-మెయిల్ కి కూడా త‌మ ఫిర్యాదుతో కూడిన లేఖ‌ను మెయిల్ రూపంలో పంపవ‌చ్చు, లేదా స్థానికంగా ఉండే బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసి వెంటనే వారి నుండి త‌క్ష‌ణ‌ సహాయాన్ని పొంది బ్యాంకు నుండి నకిలీ నోట్లకి బదులు అసలైన నోట్లని పొందవచ్చు. వ‌న‌రు: వికాస్ పీడియా

Read more about: modi
English summary

మరో బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్న నరేంద్ర మోడీ ఏంటో మీరే చూడండి. | Modi Planning to Release New Currency

Prior to the cancellation of big banknotes, the central government felt that Rs 11 and Rs 21 would be printed. Negotiations were also made. In Hindu festivals and festivals, Shungan means Rs.11, Rs 21, Rs 51 a gift. That's why the Center has thought it's worth printing out precious notes.
Story first published: Tuesday, January 8, 2019, 10:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X